తెలంగాణ

Hair Ball Removed from Girl’s Stomach: రెండు కిలోల వెంట్రుకల తినేసిన బాలిక, కడుపునొప్పి అంటూ విలవిల , శస్త్ర చికిత్స చేసి తొలిగించిన ఉస్మానియా వైద్యులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో వైద్యులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఓ బాలిక రెండు కిలోల వెంట్రుకలను తినేసి కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చింది. జీర్ణాశయంలో పేరుకుపోయిన ఈ రెండు కిలోల వెంట్రుకలను తొలగించి (Hair Ball Removed from Girl’s Stomach) ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆ బాలికను రక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీ కేవలం 68 మందికి మాత్రమే జరిగాయి.

#OperationChabuthra: ఆపరేషన్‌ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాచకొండ పోలీసులు, బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌, ఒక్కో స్టేషన్‌ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్‌ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Coronavirus in Telangana: తెలంగాణలో కొత్తగా 1771 మందికి కరోనా, జూన్ 13 నుంచి సింగరేణి కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌, కేంద్రం త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని 44వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కోరిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1771 పాజిటివ్‌ కేసులు (Coronavirus in Telangana) నమోదు కాగా 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5 లక్షల 76 వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Telangana EDCET 2021: తెలంగాణ బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో కీలక మార్పులు, ఇకపై బీఏ, బీకాం, బీఎస్సీ కాకుండా వేరే సబ్జెక్టులు చదివిన వారికి కూడా అవకాశం, జీవో 16 జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా

Hazarath Reddy

తెలంగాణలో బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్‌) (Telangana EDCET 2021) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం (Eligibility Criteria Revised) వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో 16 జారీ చేశారు.

Advertisement

Etela Rajender Resigns as MLA: ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా, ఈనెల 14న నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి, హుజూరాబాద్‌లో కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు యుద్ధం జరగబోతుందని తెలిపిన రాజేందర్

Hazarath Reddy

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Etela Rajender Resigns as MLA) చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. మాజీ మంత్రి ఈటల (Former TRS minister Etela Rajender) రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు.

Hyderabad Shocker: స్నేహితుడని నమ్మితే న్యూడ్ వీడియోలు పంపమన్నాడు, లేకుంటే ఫోటోలు ఇంటర్నెట్లో పెడతా అన్నాడు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, మరో చోట ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన ఓ కసాయి తల్లి

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడనే (Friend) కదా అని నమ్మినందుకు ఓ ప్రబుద్ధుడు ఆమెను న్యూడ్ వీడియోలు (nude Videos) పంపాలంటూ వేధింపులకు గురి చేశాడు. తట్టుకోలేక ఆ మైనర్ బాలిక (minor Girl) సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

Monsoon 2021 Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, హెచ్చరించిన వాతావరణశాఖ అధికారులు

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Telangana: అనాథ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఈ ఫోన్లలో ప్రభుత్వ అధికారుల ముఖ్యమైన నంబర్లు ఫీడ్ చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపిన హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు

Hazarath Reddy

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు సహాయ పడేందుకు వీలుగా అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు (Mobile Phones) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా అనాథ పిల్లలకు (Children Orphaned By COVID-19) స్మార్ట్ ఫోన్లు అందించాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్ణయించింది.

Advertisement

CM KCR to Take up Surprise Visits: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఈ నెల 19 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

Hazarath Reddy

ఈ నెల 19 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు (surprise visits to panchayats municipalities after June 19)చేసి పంచాయతీ రాజ్‌, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Corona in Telangana: థర్డ్ వేవ్ తీవ్రతను ఇప్పుడే అంచనా వేయలేమంటున్న ఆరోగ్య నిపుణులు; తెలంగాణలో కొత్తగా 1707 పాజిటివ్ కేసులు నమోదు, 23 వేల దిగువకు ఆక్టివ్ కేసులు

Team Latestly

ఇప్పటివరకు దేశ జనాభాలో కేవలం 4 శాతం మంది వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. కరోనా యొక్క డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ల ద్వారా కూడా పూర్తిగా నిరోధించబడటం లేదని ఆయన హెచ్చరించారు....

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం, స్పిల్ వే మీదుగా గోదావరి నీరు డెల్టాకు విడుదల, ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలో ఉండగానే అందిన తొలి ఫలితం

Team Latestly

పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ జరిగింది. ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్ వే మీదుగా ఈరోజు గోదావరి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు...

COVID19 in TS: తెలంగాణలో పాస్‌పోర్ట్ సేవలు పునరుద్ధరణ; రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన సెకండ్ వేవ్ కరోనా.. కొత్తగా 1798 పాజిటివ్ కేసులు నమోదు, 24 వేల దిగువకు ఆక్టివ్ కేసులు

Team Latestly

లాక్‌డౌన్ కారణంగా గత నెల 12న నిలిచిపోయిన పాస్‌పోర్ట్ సేవలు గురువారం ఎప్పట్లాగే సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది. ఇక, రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే..

Advertisement

Monsoon 2021 Update: ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు, రాగల 24 గంటల్లో ఏపి, టీఎస్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Team Latestly

తెలుగు రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను తాకిన రుతుపవనాలు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా...

Lockdown in TS: తెలంగాణలో నేటి నుంచి పగటి లాక్డౌన్ ఎత్తివేత, పెరగనున్న ప్రజా రవాణా మరియు కార్యాలయాల పనివేళలు; రాష్ట్రంలో ప్రస్తుతం 24,301గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఈరోజు నుంచి పగలంతా కూడా ఆర్టీసీ బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు సాయంత్రం వరకు తిరగనున్నాయి, నేటి నుంచి విద్యార్థులకు బస్ పాసుల జారీ కూడా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు....

Telangana: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం, న్యాయశాఖకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు.

TS Inter 2nd Year Exam 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు, ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు (Inter 2nd year Exams 2021 Cancelled) చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు (TS Inter Exams 2021 రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

TS Inter 2nd Year Exams 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు, అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ ఫలితాలు

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను (TS Inter 2nd Year Exams 2021) రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ లో పొందిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు...

TS Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం.. జూన్ నెల నుంచే వేతనాల పెంపు అమలు, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల మంజూరు, వ్యవసాయ భూముల డిజిటలైజన్, తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు ఇవే!

Team Latestly

రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి...

Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ సమయం కుదింపు, సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు; అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు కేబినేట్ నిర్ణయం, మెరుగైన వైద్య సేవల కల్పనకు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు

Team Latestly

బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల క్యాన్సర్....

COVID19 in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ మరో పది రోజులు పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 1897 కోవిడ్ కేసులు నమోదు, మరో 2982 మంది రికవరీ

Team Latestly

తెలంగాణలో లాక్ డౌన్ జూన్ 19 వరకు మరో పది రోజులు పొడగిస్తూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఊహించినట్లుగానే ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపునిచ్చారు....

Advertisement
Advertisement