తెలంగాణ

TS Covid Update: మాస్క్ ధరిస్తారా..రూ. వేయి జరిమానా కడతారా, మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌యాక్ట్‌-2005, ఐపీసీ సెక్షన్‌ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు

Hazarath Reddy

రాష్ట్రంలో కోవిడ్‌-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని ( Fine on mask in Hyderabad) ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్‌ ధరించని వారికి 1000 రూపాయల జరిమానా ( fine of Rs 1,000 for who not wearing masks) విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్‌ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు.

TS Covid Report: తెలంగాణలో స్వచ్ఛంద లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ అసోసియేషన్‌, తాజాగా 3,187 మందికి కరోనా పాజిటివ్, ముందుముందు పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపిన ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

Hazarath Reddy

తెలంగాణలో తాజాగా 3,187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Telangana coronavirus) అయింది. ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 787 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి (TS Covid Report) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,05,335 మంది కోలుకున్నారు.

Telangana IMS Scam: తెలంగాణలో రూ.6.5 కోట్లు ఈఎస్ఐ కుంభకోణం, ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ, దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Hazarath Reddy

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు (Ex-minister Naini Narsinghareddy’s house raided) నిర్వహించింది. ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Advertisement

Peddapalli MP Venkatesh: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ‌మిస్సింగ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు, పెద్దపల్లి ఎంపీ ఫోటోను పట్టుకుని బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీ

Hazarath Reddy

పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ (Peddapalli MP Venkatesh) ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు (BJP leaders complaint) చేశారు.

TS Covid: తెలంగాణలో చేయి దాటుతున్న కరోనా, రంగంలోకి దిగిన సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు, మాస్క్ లేకుంటే రూ.1000 జరిమానా, తాజాగా 2,909 మందికి కరోనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి‌కి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

తెలంగాణలో తాజాగా 2,909 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (coronavirus in telangana) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 584 మంది కోలుకున్నారు.

Sharmila New Party: కొత్త మలుపులతో తెలంగాణ రాజకీయాలు, జూలై 8న షర్మిలారెడ్డి కొత్త పార్టీ, అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపిన వైయస్ఆర్ తనయ, షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అంటున్న వైయస్ విజయమ్మ

Hazarath Reddy

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Party in Telangana) రాబోతోంది. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్‌ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి (Late Chief Minister YS Rajasekhara Reddy Birthday) రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

Aid for Private Teachers: ప్రైవేట్ స్కూల్ సిబ్బందికి ఏప్రిల్ నెలాఖరులోగా అందనున్న రూ. 2 వేలు, నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ, రేషన్ షాపుల ద్వారా 25 కేజీల సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Team Latestly

విద్యాశాఖ రూపొందించిన వివరాలను ఈ నెల 10వ తేది నుండి 15వ తేది మధ్యన సంబంధిత జిల్లాలకు అందజేయనుందని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుండి 19వ తేది లోపల వివరాల పరిశీలన, ఏప్రిల్ 20 నుండి 24 తేదీల మధ్య వారి బ్యాంక్ అకౌంట్లలో ఆర్ధిక సహాయం జమ కానుందని మంత్రి వెల్లడించారు...

Advertisement

COVID in TS: తెలంగాణలో విస్తరిస్తున్న సెకండ్ వేవ్ కరోనా, కొత్తగా 2478 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 15,472కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,01,986 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,478మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 3,907 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు....

COVID Review: అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, అర్హులైన వారు టీకా వేసుకోవాలని సూచన, మాస్కులు ధరించని వారిపై చర్యలకు ఆదేశం

Team Latestly

కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టిపిసిఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

Relief for Private Teachers: ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేల ఆపత్కాల భృతి, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ నిర్ణయం

Team Latestly

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...

Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలు, థియేటర్లపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై పరిమితి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల చర్యలు పెంచాలని ఆదేశం

Team Latestly

మద్యం షాపులు కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా తయారవుతున్నాయని తెలంగాణ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్19 కేసులను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు, పబ్బులు, మద్యం విక్రయించే క్లబ్ లు మరియు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది....

Advertisement

Treasure Pot: తెలంగాణలోని జనగామ జిల్లాలో బయటపడ్డ లంకె బిందె, సుమారు 5కేజీల బంగారు, వెండి అభరణాలు లభ్యం, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది

Team Latestly

జనగాం జిల్లాలోని పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి, ఒక వెంచర్ అభివృద్ధి చేయడం కోసం నెలరోజుల క్రితం 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే గురువారం ప్రొక్లైయినర్ తో భూమిని చదును చేస్తుండగా భూమిలోపల నుంచి ఒక రాయిలా ఉన్న కుండ బయటపడింది. తీరా అందులో ఏముందని చూస్తే కళ్లు విస్తుపోయేలా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి...

COVID in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం, 2 వేలు దాటిన రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య, కోవిడ్ కట్టడి చర్యల కోసం కేంద్ర సహాయం కోరనున్న టీఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని మరోసారి స్పష్టీకరణ

Team Latestly

మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్రం పొడవైన సరిహద్దును కలిగి ఉండటం అలాగే, కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌కు వివిధ ప్రదేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం మూలానా కేసులు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.....

Major Jolt to TDP: తెలంగాణలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ, తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం, టీఎస్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ

Team Latestly

తెలుగు దేశం పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తాజా తీర్పుతో బోక్కబోర్లా పడ్డ టీడీపీకి, ఇటు తెలంగాణలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తెలుగు దేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.....

HYD Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికీలల్లో చిక్కుకున్న టైర్ల గోడౌన్, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు

Hazarath Reddy

హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అఫ్జల్ గంజ్ లోని బడేమియా పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న ఓ టైర్ల గోడౌన్ అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Afzal Gunj Fire Accident: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం, పక్కనే భారత్ పెట్రోల్ బంక్, మంటలను ఆర్పుతున్న 15 ఫైర్ఇంజన్లు, భారీగా నష్టం వాటిల్లినట్లు వార్తలు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం (Afzal Gunj Fire Accident) చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

MEIC in Hyderabad: అమెరికా తర్వాత..హైదరాబాద్‌లో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం, వేల మందికి ఉపాధి అవకాశాలు, 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడ్ ట్రానిక్, కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గల నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ (Telangana Industries Minister KT Rama Rao) బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య ప‌రిక‌రాల త‌యారీ సంస్థ మెడ్ ట్రానిక్ (Medtronic Engineering & Innovation Cente) రూ. 1200 కోట్ల‌తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Telangana Shocker: తండ్రి లేడు..చెల్లెలిపై అదేపనిగా అత్యాచారానికి పాల్పడిన అన్నలు, నిందితులకు సహకరించిన తల్లి,పెద్దమ్మ, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి

Hazarath Reddy

సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది, వావి వరసలు మరచి కామాంధులు (Bhadradri Kothagudem Shocker) అత్యాచారానికి ఒడిగుడుతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అన్నలే తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే చెల్లెలిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

TS's COVID Report: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా 1914 కేసులు నమోదు, 11 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో వైరస్ వ్యాప్తి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఇటీవలే ఏప్రిల్ 2న కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నిత్యం వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని నడిపించే సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం కొంత అస్వస్థత అనిపించడంతో కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది...

Advertisement
Advertisement