తెలంగాణ

Bengaluru Shocker: ప్రియుడి నగ్న వీడియోతో ప్రియురాలు బ్లాక్‌మెయిల్, బెంగుళూరులో ఘటన, హైదరాబాద్‌లో వితంతువును పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 3లక్షలు దోచుకున్న సైబర్‌ నేరగాడు, అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

Hazarath Reddy

IPS Officer RS Praveen Kumar: ముదురుతున్న స్వేరోస్ వివాదం, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞపై మండి పడుతున్న బీజేపీ నేతలు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఫిర్యాదు చేసిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు

Hazarath Reddy

తెలంగాణ ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (IPS Officer RS Praveen Kumar) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది.

Shyamala Goli: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు, ప్రపంచంలోనే రెండో మహిళగా గుర్తింపు, 13 గంటల 43 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరిన శ్యామల, సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శిక్షణ

Hazarath Reddy

భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా (Shyamala Goli) హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. 13 గంటల 43 నిమిషాల్లోనే జలసంధిని ఈది ఔరా అనిపించారు. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు.

Covid in TS: తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన యాక్టివ్ కేసులు, తాజాగా 364 మందికి కరోనా, కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 364 కరోనా కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది (Corona in TS) కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,451 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,666గా ఉంది.

Advertisement

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కోసం బడ్జెట్‌లో రూ. 610 కేటాయింపు, నిర్మాణ పనులను వేగవంతం చేసిన ప్రభుత్వం, నేరుగా వెళ్లి పనుల పురోగతిని సమీక్షించిన సీఎం కేసీఆర్

Team Latestly

తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలవాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన...

Telangana's COVID Bulletin: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా మరో 318 మందికి పాజిటివ్, విద్యార్థులకు వైరస్ సోకుతుండటం పట్ల రాష్ట్ర హైకోర్ట్ ఆందోళన, వ్యాప్తిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

Team Latestly

MLC Polls 2021 Counting: తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్, ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు, రెండో ప్రాధాన్యత ఓట్లు తమకేనని ప్రత్యర్థుల ధీమా!

Team Latestly

శుక్రవారం ఉదయం నాటికి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానానికి మొత్తం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....

Telangana Budget 2021: రూ. 2.30 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్! అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఏయే రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూడండి

Team Latestly

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు గురువారం ఉదయం 11.30 గంటలకు శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ. 2 లక్షల 30 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.....

Advertisement

TS's COVID Report: తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారి, సరిహద్దు ప్రాంతాలపై ఆరోగ్యశాఖ నిఘా, రాష్ట్రంలో కొత్తగా 278 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

కరోనా యొక్క రెండవ వేవ్ ప్రమాద సూచనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు వేసుకోవడం, చేతులకు శానిటైజేషన్ చేసుకోవడం, పబ్లిక్ ర్యాలీలు, సభలు, పార్టీలకు దూరంగా ఉంటూ రాష్ట్రంలో మహమ్మారి మరింత విస్తరించకుండా సహకరించాలని వారు కోరుతున్నారు....

MLC Polls 2021 Results: తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం, పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న

Team Latestly

కొద్దిసేపటి క్రితమే తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి గానూ 16,130 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయనకు సమీపంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న 12,046 ఓట్లతో....

Weather Forecast: తెలంగాణలోని పలు ప్రాంతాలకు నేడు వర్షసూచన, ఉరుములు- మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ

Team Latestly

ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో గురువారం ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షపాతానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.....

TS EAMCET: ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు

Hazarath Reddy

ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) స్పష్టం చేసింది.

Advertisement

CM KCR Speech Highlights: ఉచిత విద్యుత్ పేటెంట్ వైఎస్సార్‌దే, కరోనాపై కన్నేసి ఉంచాం, రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతాం, బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్పీచ్‌లో హైలెట్ పాయింట్స్ ఇవే

Hazarath Reddy

ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని (YSR) తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్‌ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు.

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 247 కోవిడ్ కేసులు నమోదు, విద్యార్థులపై కరోనా మహమ్మారి పడగ, రాష్ట్రంలో వివిధ పాఠశాలలకు చెందిన వందకు పైగా విద్యార్థులకు సోకిన వైరస్

Team Latestly

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడటం కలవరపాటుకు గురిచేస్తుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు వంద మందికి పైగా విద్యార్థులకు కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు సమాచారం....

MLC Election Results: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.

Bye-Elections 2021: తిరుపతిలో జెండా పాతేదెవరు, సాగర్‌లో గెలుపెవరిది?, రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు

Hazarath Reddy

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను (Bye-Elections 2021) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 17 పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Tribute to Nomula: పేదల మనిషి.. బలహీన వర్గాల గొంతుక నోముల! దివంగత సభ్యులకు సంతాప తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టిన టీఎస్ సీఎం కేసీఆర్, నోముల నర్సింహయ్యకు ఘన నివాళి

Team Latestly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున దివంగత సభ్యులకు నివాళిగా సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య సేవలను, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు....

Case Filed Against Jogini Shyamala: జోగిని శ్యామల మీద జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు, మద్యం తాగుతూ తన బట్టలు విప్పి వీడియో తీశారని పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి, కేసును పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయింపు

Hazarath Reddy

బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల తాజాగా వివాదంలో చిక్కుకుంది. జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు (zero fir registered Against Jogini Shyamala) నమోదయ్యింది.

KV Reddy Quits Congress: కాంగ్రెస్‌కు గుడ్ బై, సంచలన నిర్ణయం తీసుకున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం, బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు

Hazarath Reddy

టీఆర్ఎస్ పార్టీ దెబ్బకు తెలంగాణలో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చేవెళ్ల ఎంపీ, వ్యాపారవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Former Chevella MP Konda Vishweshwar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.

COVID in TS: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనావైరస్.. మహారాష్ట్రతో సరిహద్దులు మూసివేత, మంచిర్యాల జిల్లాలో 12 మంది టీచర్లకు కరోనా పాజిటివ్, రాష్ట్రవ్యాప్తంగా 204 కోవిడ్19 కేసులు నమోదు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్

Team Latestly

మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంతో తెలంగాణకు ఉన్న సరిహద్దులను ప్రభుత్వం మూసివేసింది. అంతరాష్ట్ర రవాణ మరియు ఆర్టీసీ బస్సులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలు మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.....

Advertisement
Advertisement