తెలంగాణ

Coronavirus Second Wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచన

Hazarath Reddy

దేశంలో మరోసారి కరోనావైరస్ విరుచుకుపడే అవకాశం ఉందని, తెలంగాణలో కూడా రెండవ దశ ప్రమాదం (coronavirus second wave) ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ఆదేశించారు. కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి (CM KCR) ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రజలు కూడా తగిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Devi Priya Passes Away: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూత, సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు తదితరులు

Hazarath Reddy

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత జర్నలిస్టు దేవిప్రియ (Devi Priya Passes Away) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో (NIMS hospital) చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

TS Corona Update: తెలంగాణలో తాజాగా 925 కరోనా కేసులు, 2,62,653 కి చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఇప్పటివరకు 2,49,157 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో 925 కరోనా కేసులు (TS Corona Update) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,367 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,653 కి (COVID-19 cases in Telangana) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,49,157 మంది డిశ్చార్జ్ అయ్యారు.

CM KCR's Letter To PM Modi: జాతీయస్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలి, ప్రధానికి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారంటూ లేఖలో ఆవేదన

Hazarath Reddy

జాతీయస్థాయిలో జరిగే నియామక పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని (Allow Regional Languages In Competitive Exams) తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ (CM KCR's Letter To PM Modi) రాశారు

Advertisement

2015 Cash for Vote Scam: ఓటుకు కోట్లు కేసు, సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు, స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని కోర్టుకు వివరణ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 2015లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో (2015 Cash for Vote Scam) ఏ2గా ఉన్న బిషప్‌ సెబాస్టియన్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై (Sebastian's discharge petition) ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది.

Covid in TS: తెలంగాణలో తాజాగా 1,058 కరోనా కేసులు, నలుగురు మృతితో 1,419 కి చేరుకున్న మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో 1,058 కరోనా కేసులు (Covid in TS) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,440 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834 కి (telangana corona cases) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,46,733 మంది డిశ్చార్జ్ అయ్యారు.

GHMC Elections 2020: విపక్షాలకు దిమ్మతిరిగేలా గ్రేటర్‌లో విజయం సాధిస్తాం, ధీమా వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, అభ్యర్థుల తొలి జాబితా రెడీ, బీజేపీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

Hazarath Reddy

డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) పోటీ చేసేందుకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.

TS-BPAS Customer Charges: టీఎస్‌–బీపాస్‌ కస్టమర్ ఛార్జీలు ఖరారు, ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించాలి, 75 చదరపు గజాలలోపు ఉంటే అనుమతి ఉచితం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌–బీపాస్‌ దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాల్సిన కస్టమర్‌ చార్జీలను (TS-BPAS Customer Charges) ఖరారు చేసింది. భవన/లే–అవుట్‌లకు అనుమతుల కోసం వసూలు చేసే వివిధ రకాల ఫీజులు, చార్జీలకు కస్టమర్‌ చార్జీలు అదనం కానున్నాయి.

Advertisement

Telangana: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు, ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు

Hazarath Reddy

తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka By poll) గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు (Goreti Venkanna, Baswaraju Saraiah, Dayanand) ప్రమాణ స్వీకారం చేశారు.

Fresh Guidelines in TS: తెలంగాణలో మారిన ఆంక్షలు, కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల జరిగే కార్యక్రమాలకు 200 మందికి అనుమతి, కంటైన్మెంట్‌ జోన్లలో అనుమతి నిషిద్ధం

Hazarath Reddy

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా అమల్లో ఉన్న ఆంక్షలను (Fresh Guidelines in TS) సడలించింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఉన్న ఆంక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Tungabhadra Pushkaralu: 12 ఏళ్ల తరువాత..తుంగభద్ర నది పుష్కరము, దివంగత వైఎస్సార్ తరువాత తనయుడు వైయస్ జగన్ ప్రత్యేక పూజలు, ఖరారైన ఏపీ సీఎం పర్యటన, తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కొన‌సాగే తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై (Tungabhadra Pushkaralu) తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశాయి. ఈ 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వాలు స్ప‌ష్టం చేశాయి. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని ప్రభుత్వాలు సూచించాయి.

TS Coronavirus: తెలంగాణలో కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు, గాంధీ హాస్పిటల్‌లో ఇకపై నాన్ కొవిడ్ కేసులకు కూడా చికిత్స, సమ్మెను విరమించిన జూడోలు

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 948 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in TS) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 2.59లక్షలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు మృతి (Covid Deaths) చెందారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకూ 1,415 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,068 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా.. ఇప్పటి వరకూ 2.45లక్షల మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకున్నారు. తాజా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

Advertisement

TS Corona Report: తెలంగాణలో తాజాగా 952 కరోనా కేసులు, కరోనాతో ఇప్పటివరకు 1,410 మంది మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 150 కరోనా కేసులు

Hazarath Reddy

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులిటెన్ ను విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా పాజిటివ్‌ కేసులు (TS Corona Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 2.58 లక్షలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గరు మృతి (Covid Deaths) చెందారు.

GHMC Elections 2020: మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను (GHMC Elections 2020) దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

TS-bPASS: టిఎస్‌-బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, భవన నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు, రియల్‌​ ఎస్టేట్‌ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరిక

Hazarath Reddy

టిఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నుంచి మంత్రి కెటిఆర్‌ (Minister KTR Inaugurated TS-bPASS Website) ఈ రోజు ప్రారంభించారు. దీంతో నేటి నుంచి ఈ వెబ్‌సైట్ (TS-bPASS Website) అందుబాటులోకి రానుంది. ఈ వెబ్‌సైట్‌ ను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

HYD Man Suicide in Canada: ప్రేమ విఫలం, కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య, ప్రియురాలు మోసం చేసిందని వీడియో సందేశం, అవయువాలు దానం చేయాలని కోరిన ప్రణయ్

Hazarath Reddy

కెనడాలో హైదరాబాద్ యువకుడు ఆత్మహత్య (HYD Man Suicide in Canada) చేసుకున్నాడు. ప్రేయసితో విభేదాల కారణంగా నత్రజని వాయువు పీల్చుకుని (inhaling nitrogen gas) అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Selfie Deaths: తెలంగాణలో తీవ్ర విషాదం, సెల్ఫీ మోజులో 5 మంది మృతి, రెండు రోజుల్లో నీట మునిగి 11 మంది దుర్మరణం, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Hazarath Reddy

తెలంగాణలో తీవ్ర విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల్లో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పర్వదినాన సెల్ఫీ సరదా (Selfie Deaths) అయిదు మంది ప్రాణాలను (Five persons lost life) తీయగా, వేర్వేరు చోట్ల మరో 6 మంది తీరని లోకాలకు వెళ్లిపోయారు. విషాద ఘటనల వివరాల్లోకెళితే.. దివాళీ రోజున నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీలు తీసుకుంటూ నిటిలో మునిగిపోయారు.

Lorry Driver Stabs Cleaner: కరీంనగర్‌లో చంపాడు, ఖమ్మం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు, లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు మధ్య జరిగిన వాగ్వాదంలో క్లీనర్‌ను చంపేసిన లారీ డ్రైవర్

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు మధ్య జరిగిన వాగ్వాదంలో (Lorry Driver Stabs Cleaner) డ్రైవర్‌.. క్లీనర్‌ను హతమార్చాడు. దాదాపు 250 కిలోమీటర్లు మృతదేహంతో ప్రయాణించి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా లారీకి (Lorry) పైన టార్పాలిన్‌ కట్టే విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.

TS Coronavirus Update: కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌‌పై నిమ్స్‌లో మొదలైన ట్రయల్స్, తెలంగాణలో తాజాగా 502 మందికి కరోనా, ముగ్గురు మృతితో 1407కు చేరిన మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 502 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (TS Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,876కు (Coronavirus Cases) చేరింది. నిన్న ఒక్కరోజే 1,539 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,659. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1407కు (Coronavirus Deaths) చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

Good News to RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, కరోనా కాలంలో కట్ అయిన జీతాలు తిరిగి చెల్లించాలని ఆదేశాలు, ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభవార్తను (Good News to RTC Employees) అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల (RTC Employees) జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. వీటి కోరకు దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement