తెలంగాణ

Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..

Rudra

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..

Rudra

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.

Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి

Rudra

దేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్

VNS

తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Telangana: గులాబీ బాస్‌కు షాక్...కేసీఆర్ వియ్యంకుడు కిషన్‌రావుపై ఎస్సీ,ఎస్టీ కేసు, భూకబ్జా నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

కేసీఆర్ వియ్యంకుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన

Arun Charagonda

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని స్పష్టం చేశారు. చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం...విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Congress Corporator Rajasekhar Reddy: సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా?, చట్టం ముందు అంతా సమానమే..రూల్ ఈజ్ రూల్.....రూల్ ఫర్ ఆల్..బన్నీపై కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఫైర్

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి. సినిమా యాక్టర్ లకు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాశారా ?...అల్లు అర్జున్ అయినా అల్లుడు శ్రీను అయినా ఎవరైనా సరే చట్టానికి తగ్గాల్సిందేనన్నారు.

Advertisement

Hyderabad: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం, ఓ యువకుడిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు...వీడియో

Arun Charagonda

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్(30) అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. భరత్ తలపై బలమైన గాయాలు కావడంతో స్థానికంగా ఉండే హాస్పటల్లో తీవ్రగాలతో చికిత్స పొందుతున్నాడు.

MP Chamala Kirankumar Reddy: చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

Arun Charagonda

సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ.. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలి అని ట్వీట్ చేశారు.

MLA Danam Nagender: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం కానీ ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందనడం సరికాదన్న ఎమ్మెల్యే నాగం నాగేందర్...బెయిల్ దొరకడం సంతోషంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Arun Charagonda

అల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడు అన్నారు. బన్నీ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు.అల్లు అర్జున్‌ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు.

Telangana: వివాదంలో జగిత్యాల జిల్లా వైద్య సిబ్బంది, రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైనం, విచారణ జరిపిన కలెక్టర్..చర్యలకు ఆదేశం

Arun Charagonda

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు నర్సులు, సిబ్బంది. కోలాటాలతో నృత్యాలు చేశారు. మీడియా రాకను చూసి డ్యాన్స్ ఆపగా దీనిని కప్పిపుచ్చే యత్నం చేశారు ఆర్ఎంఓ సుమన్. విషయం తెలిసి ఆస్పత్రిలో విచారణ జరిపారు అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి. తక్షణమే చర్యలకు ఆదేశించారు.

Advertisement

CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఐదుగురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చ

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఐదుగురు కేంద్ర మంత్రులని కలిశారు రేవంత్ రెడ్డి. కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటును పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తావించారు. కాజీపేట‌లో పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ (పీవోహెచ్‌) వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేస్తూ ఆ త‌ర్వాత కూడా కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశాన‌ని చెప్పారు.

Allu Arjun Fan: బన్నీ కోసం ఆత్మహత్య చేసుకోబోయిన ఫ్యాన్‌, అభిమాని చేతిలో నుండి పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పారు.

Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)

Rudra

చట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.

Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??

Rudra

అల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Advertisement

Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్‌ లాంటి వ్యాక్సిన్‌.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

వ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్‌ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్‌ విధానాన్ని అమెరికాలోని స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Allu Arjun Released: నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)

Rudra

విడుదలైన నాన్న ఎప్పుడు ఇంటికి వస్తారంటూ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు

Rudra

జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.

Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..

Rudra

నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌ లైన్‌ లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement