Republic Day Celebrations: అన్ని రంగాల్లో హైదరాబాద్ భేష్, రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై, నాటు నాటు టీమ్‌కు సత్కారం చేసిన గవర్నర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Dr Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
Hyderabad, JAN 26: గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic day celebrations) రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Dr Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని చెప్పారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు.
తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉన్నదని చెప్పారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి(MM keeravani), సినీ గేయరచయిత చంద్రబోస్(Chandrabose), బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించారు.