Technology

YONO Super Saving Days: ఎస్‌బీఐ యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ఆఫర్లు, ఏప్రిల్‌ 7వ తేదీ వరకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లు, మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి

Hazarath Reddy

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘యోనో’ ద్వారా సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ ఎస్‌బీఐ తన ట్వీట్‌లో తెలిపింది. అమెజాన్‌, అపోలో, ఈజ్‌మైట్రిప్‌, ఓయోలాంటి టాప్‌ బ్రాండ్ల భాగస్వామ‍్యంతో ఈ ఆఫర్లను అందిస్తోంది. గత మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి.

LG Mobile Business Closed: ఎల్‌జీ ఫోన్ యూజర్లకు షాక్, మొబైల్ ఫోన్ల వ్యాపారానికి గుడ్ బై చెప్పిన ఎల్‌జీ కంపెనీ, గత ఆరేళ్లలో రూ.32,856 కోట్ల నష్టాలను చవిచూసిన దక్షిణ కొరియా దిగ్గజం

Hazarath Reddy

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని (LG Mobile Business Closed) నిర్ణయించినట్టు అధికారికంగా ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా స్మార్ట్‌ఫోన్‌ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు (LG To Shut Down Mobile Business) తెలిపింది.

Facebook Data Leak: భారత్ నుంచి 60 లక్షల ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్, ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి పర్సనల్‌ సమాచారం, ఫోన్‌ నంబర్‌, దీంతో పాటుగా 106 దేశాల్లో ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్

Hazarath Reddy

యూజర్ల పర్సనల్‌ సమాచారాన్ని, ఫోన్‌ నంబర్‌ను ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి (Facebook Data Leak) ఉంచినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీక్ (Personal Data of 553 Million Facebook IDs) అయినట్లు వార్తలు వస్తున్నాయి.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్‌ అదిరిపోయే ప్లాన్, రూ.108తో రీచార్జ్ చేసుకుంటే రెండు నెలల పాటు ప్రతి రోజూ 1 జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్‌లు

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌ తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను (BSNL New Plan) తీసు కొచ్చింది.

Advertisement

MobiKwik Data Leaked: 11 కోట్ల మంది భారతీయుల డేటా లీక్, చరిత్రలోనే అతి పెద్ద స్కాం, డార్క్‌వెబ్‌లో అమ్మకానికి మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారం, ఖండించిన మొబిక్విక్

Hazarath Reddy

ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్‌ యూజర్లకు షాకిచ్చింది. లక్షలమంది మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారన్న వార్తలు (MobiKwik Data Leaked) మొబీక్విక్‌ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది.

PAN-Aadhaar Linking: పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్, మార్చి 31లోగా చేయకుంటే పాన్‌ కార్డు చెల్లదు, అలాగే రూ.1000 జరిమానా, లింక్ చేయకుంటే ఎలా చేయాలో తెలుసుకోండి, లింక్ చేసి ఉంటే స్టేటస్ తెలుసుకోండి

Hazarath Reddy

ఈ నెల 31లోగా పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Linking) చేయకపోతే పాన్‌ కార్డు చెల్లదు. అంతే కాకుండా రూ.1000 జరిమానా పడుతుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఐటీ చట్టానికి సవరణలు చేసింది. పాన్‌కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌ నంబర్‌ లింక్‌ (PAN-Aadhaar Linking) చేయకపోతే జరిమానా పడుతుందా.. తిరిగి లింక్‌ చేసుకోవాలంటే జరిమానా కట్టాల్సి ఉంటుందా అన్న విషయాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు.

Fake WhatsApp Message: అమెజాన్ యానివర్సరీ మెసేజ్ ఫేక్‌, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్ చేయకండి, షేర్ చేస్తే సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారు, పూర్తి వివరాలు స్టోరీలో చూడండి

Hazarath Reddy

అమెజాన్ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెజాన్ ఉచితంగా బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక వాట్సాప్ సందేశం (Fake WhatsApp Message) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ అని ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Gmail Down: జీమెయిల్ డౌన్, అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్, ఆండ్రాయిడ్‌ వెబ్‌ వ్యూ యాప్‌ ద్వారా సమస్య ఏర్పడిందని తెలిపిన గూగుల్, ఈ సూచనలు పాటించాలని కోరిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు చెందిన డివైస్‌ల‌లో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ (Gmail, Yahoo Mail, Google Pay Down) అవుతున్నాయి. మ‌న దేశంలోనూ కొంద‌రు యూజ‌ర్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోని జీమెయిల్ యాప్ (Gmail App) ఎక్కువ‌గా క్రాష్ అవుతుంద‌ని ఫిర్యాదు చేస్తున్నారు.

Advertisement

Airtel Active Users: జియో నుంచి బయటకు వస్తున్న యూజర్లు, ఎయిర్‌టెల్‌ ఖాతాలో కొత్తగా 69 లక్షల యాక్టివ్‌ యూజర్లు, 34 లక్షలకు పైగా తగ్గిన జియో యూజర్లు, గణాంకాలను వెల్లడించిన ట్రాయ్

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో వేగం కాస్తా నెమ్మదిస్తోంది. ఖాతాదారులు దాని నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా డిసెంబరుతో పోలిస్తే రిలయన్స్‌ జియో (Relinace Jio) యాక్టివ్‌ చందాదారులు 34 లక్షల మంది తగ్గారని ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి.

Chandrayaan-3: చంద్రయాన్ -3 వచ్చేస్తోంది, 2022 మధ్య నాటికి నింగిలోకి దూసుకు వెళుతుందని చెప్పిన ఇస్రో ఛైర్మెన్ కె శివన్, గగన్‌యాన్ డిజైన్ కూడా తుది దశలో ఉందని చెప్పిన శివన్

Hazarath Reddy

చంద్రయాన్ -3 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ కె. శివన్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో ఏరోస్పేస్, ఏవియానిక్స్ యొక్క భవిష్యత్తు పై యూపీఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2022 మధ్య నాటికి చందయన్ -3 ప్రయోగం (Chandrayaan-3) ఉంటుందని తెలిపారు.

Gautam Adani Beats Elon Musk: గౌతం అదానీ దెబ్బకు ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్‌ అవుట్, 2021లో అత్యధికంగా సంపాదించిన వారిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్‌ వ్యాపార వేత్త , అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరిక

Hazarath Reddy

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా (Gautam Adani beats Elon Musk) నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు. అదాని సంపద ( biggest wealth surge) ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

BSNL Offers: కొత్త ఆఫర్లతో దూసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించిన టెలికం దిగ్గజం, కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి 4జీ సిమ్‌ ఉచితం

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను (BSNL BroadBand Plan Offers) సవరించింది.

Advertisement

Redmi Note 10 Series: షియోమి అభిమానులకు శుభవార్త, రెడ్‌మి నోట్‌ 10 సీరిస్ వచ్చేశాయి, ధర రూ.11,999 నుంచి ప్రారంభం, రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లను విడుదల చేసిన కంపెనీ

Hazarath Reddy

షియోమి యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ను చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి ఇండియాలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో (Redmi Note 10 Series) రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు (Xiaomi Redmi Note 10 Pro Max, Note 10 Pro, Note 10) లాంచ్‌ చేసింది.

WhatsApp Mute Video Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్, ఇకపై ఇతరులకు ఆడియో మ్యూట్ చేసి కేవలం వీడియో మాత్రమే పంపవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. ఆ వీడియోలో ఏవైనా అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు.

CoWIN Registration: కో–విన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా? ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

BSNL New Plan: అత్యంత తక్కువ ధరకే ఇంటర్నెట్, సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్, 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి

Hazarath Reddy

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి.

Advertisement

PSLV-C51: 2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి, ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 నింగిలోకి

Hazarath Reddy

నింగిలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపుతూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో 2021లో తొలి విక్టరీని సాధించేందుకు రెడీ అయింది. పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

New JioPhone 2021 Offer: జియో నుంచి మరో సంచలన ఆఫర్, రెండేళ్ల పాటు ఉచిత కాల్స్, నెలకు 2 గిగాబైట్ల డేటా ఉచితం, కొత్త జియో ఫోన్ రూ.1,999కే, ఆఫర్‌పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ (New JioPhone 2021 Offer) ప్రకటించింది, అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అంతే కాదు, ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ (Unlimited Voice calls) ఇస్తామని చెప్పింది.

WhatsApp's Privacy Policy: వాట్సప్, ఫేస్‌బుక్‌లకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు, వినియోగదారుల గోప్యత చాలా ముఖ్యం, నాలుగు వారాల్లో దీనిపై మీ స్పందన తెలపాలని ఆదేశాలు

Hazarath Reddy

సోషల్‌ మీడియా దిగ్గజాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీ కంపెనీ ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. ప్రజల గోప్యత అనేది చాలా ముఖ్యమైనది. దానిని కాపాడటం మా కర్తవ్యమంటూ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది.

FASTag Update: రేపటి నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి, ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలు హైవేల‌పైకి..లేకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే, ఫాస్టాగ్ ఎక్క‌డ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఫాస్టాగ్ అమ‌ల్లోకి (FASTag Update) రానుంది. ఇకపై వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి. లేదంటే డబుల్ టోల్ చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి (FASTags Mandatory) వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచి దీన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

Advertisement
Advertisement