టెక్నాలజీ

Telangana e-Pass Apply Online: తెలంగాణ లాక్‌డౌన్‌, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ, పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ అంజనీ కుమార్

Hazarath Reddy

లాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్‌ లభిస్తుందని సీపీ చెప్పారు.

E-Commerce Firms Sales: 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ అమ్మకాలు, డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు

Hazarath Reddy

కరోనా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలులో ఉన్న సమయంలోనూ ఏప్రిల్ 20వతేదీ నుంచి నిత్యావసరేతర వస్తువులను కూడా డెలివరీ చేసేందుకు ఈకామర్స్ కంపెనీలకు (E-Commerce Firms Sales) కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి అనుమతించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.

Aarogya Setu App: ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.

JioPOS Lite App: జియో యాప్ అదిరిపోయే ఆఫర్, రీఛార్జ్ చేస్తే 4.16శాతం కమిషన్, జియోపోస్ లైట్ పేరుతో కొత్త యాప్ ప్రారంభించిన రిలయన్స్ జియో

Hazarath Reddy

జియో యూజర్లకు రిలయన్స్ జియో (Reliance jio) మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో వినియోగదారులు (jio Users) ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో (JioPOS Lite app) ఒక యాప్ ను కొత్తగా ప్రారంభించింది. ఈ యాప్ (APP) ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చు.

Advertisement

Free Eeducation Learning Apps: మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ దెబ్బకు మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. విద్యార్ధులు, ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మనమందరం ఇప్పుడు ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలను నేర్చుకోలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు. అయితే ఆ బాధ లేకుండా కొన్ని యాప్ లు ప్రీమియం సభ్యత్వంతో ఉచితంగా వారికి సేవలను అందిస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ల గురించి ఓసారి తెలుసుకుందాం.

Aditya Birla Group Donation: ఆదిత్యా బిర్లా రూ. 500 కోట్ల విరాళం, కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధికి సాయం, పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నట్లుగా తెలిపిన బాలీవుడ్ జంట దీపికా, రణ్‌వీర్

Hazarath Reddy

ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Birla group) కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చింది. పీఎంకేర్స్‌ పేరిట( PM Cares Fund) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూపు ప్రకటించింది. అలాగే, రూ.50 కోట్లను కరోనా వైరస్‌ (Coronavirus) నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ–ఆదిత్య బిర్లా సీఎస్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్క్‌లు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేయనున్నట్టు గ్రూపు పేర్కొంది.

Azim Premji Foundation: కరోనాపై పోరాటానికి రూ.1,125 కోట్లు, భారీ విరాళం ప్రకటించిన అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌, ఇప్పటికే రూ. 1500 కోట్లను విరాళంగా ప్రకటించిన టాటా గ్రూపు

Hazarath Reddy

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై ( Coronavirus) పోరు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌-19 (COVID-19) మహమ్మారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాజాగా విప్రో లిమిటెడ్‌ (Wipro), విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ (Azim Premji Foundation) కలిసి రూ.1,125 కోట్ల సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. మొత్తం విరాళంలో విప్రో రూ.100కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

Jio Good News: జియో యూజర్లకు శుభవార్త, జియో 100 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఉచిత మెసేజ్‌లు, దేశంలో ఎక్కడికైనా కాల్ చేసుకునే అవకాశం

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Lockdown) కొనసాగుతుండటంతో పలు టెలికాం కంపెనీలు వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (Reliance Jio) కూడా ఆ జాబితాలో చేరింది. ఇకపై జియో ఫోన్‌ వినియోగదారులకు (JioPhone users) ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల కాల్స్‌, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్‌ (Calls) చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది.

Advertisement

Covid Alerting Tracking System:జగన్ సర్కారు మరో ముందడుగు, కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం, కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు దాని నియంత్రణకు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సర్కారు (AP government) మరో ముందడుగు వేసింది. . హోమ్ క్వారంటైన్‌లో (home quarantine) ఉన్న వారి కదలికలను గుర్తించడానికి కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను (Covid Alerting Tracking System) తెరమీదికి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) చేసింది.

WhatsApp Update: వాట్సాప్ స్టేటస్‌లో కీలక మార్పు, ఇకపై వీడియోల నిడివి 15 సెకన్లకే పరిమితం, ఇకపై స్టేటస్ ద్వారా 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే షేర్ చేయలేరు

Hazarath Reddy

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని (Status video) సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు (15 seconds) పరిమితం చేసింది.

RBI 'War Room': ప్రపంచంలో ఫస్ట్ టైం, ఆర్‌బీఐ రహస్య వార్ రూమ్, వ్యాపార విపత్తు ప్రణాళికను అమల్లోకి తెచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌, కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి (coronavirus outbreak) కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank) యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (BCP)ని అమల్లోకి తెచ్చింది. 24 గంటల వ్యవధిలో ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ (RBI War Room) ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు.

Jio Work From Home Pack: జియో నుంచి కొత్త ప్లాన్, రోజుకు 2జీబీ డేటా, 10 శాతం పెరిగిన ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌, డేటాను అనూహ్య డిమాండ్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని (COVDI-19) నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) సరికొత్త ప్లాన్ తో వచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ (Jio Work From Home Pack).

Advertisement

Anil Ambani: యస్ బ్యాంక్ సంక్షోభం, అనిల్ అంబానీకి ఈడీ సమన్లు, యస్‌ బ్యాంక్‌ నుంచి రూ 12,800 కోట్లు రుణాలు పొందిన రిలయన్స్‌ గ్రూప్‌, నిరర్థక ఆస్తులుగా మారిన రుణాలు

Hazarath Reddy

యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్‌ బ్యాంక్‌ కేసులో (Yes Bank crisis) తమ ముందు హాజరు కావాలని అనిల్‌ అంబానీకి (Anil Ambani) ఈడీ సమన్లు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ (Reliance Group) రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు.

Apple Stores Closed: కరోనా విశ్వరూపం, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు మూసివేత, మార్చి 27 వరకు అన్ని బంద్ చేస్తున్నామని ప్రకటించిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్

Hazarath Reddy

కోవిడ్-19(coronavirus) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్‌ (Apple) యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌ను మార్చి 27 వరకు మూసివేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Vodafone Idea’s New Plans: వొడిఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్, అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ డేటా, ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులోకి..

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను (Vodafone Idea’s New Plans) లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ (Vodafone) డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో (Website) లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

GST Council Meet: కొత్త ఫోన్లపై కేంద్రం జీఎస్‌టీ షాక్, మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం

Hazarath Reddy

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కేంద్రం జీఎస్‌టీ రూపంలో భారీ షాక్‌ ఇచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జీఎస్‌టీ కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంపునకు ( GST Hike on Mobile Phones) ఆమోదం కేంద్రం తెలిపింది.

Advertisement

Bill Gates: మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా, పూర్తిగా సామాజిక సేవ వైపు బిలియనీర్, 2014లో ఛైర్మెన్ పదవికి రాజీనామా, మిళిందా ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్

Hazarath Reddy

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

Hazarath Reddy

కరోనా (Coronavirus)దెబ్బకు దేశం కుదేలవుతోంది. ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది. బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.

Corona Caller Tune: విసిగిస్తోన్న కరోనా కాలర్ ట్యూన్, కాలయాపన తప్ప మరేమి లేదంటూ నెటిజన్ల గగ్గోలు, కాలర్‌ ట్యూన్‌ ఇంగ్లిష్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

ఈ మధ్య మీరు గమనించారో లేదో ఎవరికైనా ఫోన్ చేస్తే మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఆంగ్లంలో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం.. చివరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన అంటూ 30 సెకన్ల పాటు మీకు రింగ్ టోన్ (Corona Caller Tune) వినిపిస్తూ ఉంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్‌ వినియోగదారులకు కోవిడ్‌ వైరస్‌ (COVID 19) వ్యాప్తి నిరోధం కోసం వస్తున్న కాలర్‌ ట్యూన్‌ ఇది.

Debit and Credit Cards Alert: డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి, లేకుంటే పనిచేయవు, మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వాడని కార్డులు పనిచేయవన్న ఆర్‌బిఐ

Hazarath Reddy

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? అయితే వాటిని వెంటనే ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఉపయోగించండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ కార్డులు (Credit And Debit Cards Alert) పని చేయవు.

Advertisement
Advertisement