Technology

Ola Showroom Fire: వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన

Vikas M

ఓలా ఈవీ కస్టమర్లు ఇటీవల కర్ణాటకలో ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య జరుగుతున్న పోరాటం ఈ పరిణామం జరిగింది. X (గతంలో Twitter)లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో, Ola EV కస్టమర్‌లు తమ వాహనాన్ని నెల రోజులుగా సర్వీసింగ్ చేయనందుకు ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టడం చూపిస్తుంది.

Jio Plan Update: జియో ప్లాన్‌లో కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌, రెండు పరికరాల్లో కస్టమర్లు స్ట్రీమింగ్‌ను వీక్షించే అవకాశం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌ను జోడించింది.

BSNL New Plan: మోసపూరిత ఎస్సెమ్మెస్‌లపై బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు

Vikas M

బీఎస్ఎన్ఎల్ తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌పై బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఇప్పుడు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

SBI Jobs Update: నిరుద్యోగులకు అలర్ట్, ఎస్‌బీఐలో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Vikas M

దేశంలోని అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Advertisement

Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

VNS

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది

Google Tests Verified Check Marks: ఫేక్ వెబ్ సైట్ల‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ బిగ్గెస్ట్ ఫీచ‌ర్, ఇది అందుబాటులోకి వ‌స్తే స్కామ‌ర్ల‌కు ఇక చుక్క‌లే

VNS

వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.

BSNL 4G Phone: బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్, చాలా త‌క్కువ ధ‌ర‌లో 4జీ ఫోన్ తీసుకువ‌స్తున్న కంపెనీ, అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్

VNS

దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, కార్బన్ మొబైల్స్ (Karbonn Mobiles) చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి.

Youtube Update: యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు ఇక పండుగే! ఇక‌పై షార్ట్ వీడియోలు 3 నిమిషాల పాటూ అప్ లోడ్ చేయొచ్చు

VNS

కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. షార్ట్స్‌ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్‌ వీడియోలు (Youtube Shorts) ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేసుకునే వీలుండేది.

Advertisement

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో సైబర్ దొంగల భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. మాల్తీ వర్మ అనే బాధితురాలు డిజిటల్ బ్లాక్‌మెయిల్‌కు గురై అకాల మరణానికి దారితీసినట్లు సమాచారం.

Solar Flare Video: వీడియో ఇదిగో, భూమి వైపు అతి పెద్ద సోలార్ ఫ్లేర్‌ వదిలిన సూర్యుడు, ఏడేళ్లలో ఇదే అతి పెద్దది

Vikas M

అక్టోబరు 3, గురువారం నాడు సూర్యుడు భూమి వైపు ఒక ప్రధాన సౌర మంటను విడుదల చేశాడు. ఈరోజు సూర్యుడు భూమికి ఎదురుగా ఉన్న సౌర మంటను X9-తరగతిగా వర్గీకరించినట్లు NASA తెలిపింది. NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సోలార్ ఫ్లేర్ యొక్క ఇమేజ్‌ని క్యాప్చర్ చేసి, Xలో ఇమేజ్‌ని షేర్ చేసింది

Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగ‌ళూరు ప్ర‌జ‌ల‌కు కేవ‌లం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గ‌త నెల 27 నుంచి ప్ర‌క‌టించిన‌ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ సంద‌ర్భంగా త‌మ యూపీఐ పేమెంట్స్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది.

Samsung Layoffs: వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు

Vikas M

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.

Advertisement

BSNL 4G Mobiles: బీఎస్ఎన్ఎల్ మరో సంచలనం, దేశీయ మార్కెట్లోకి త్వరలొ 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు, కార్బన్ మొబైల్స్ జత కట్టిన ప్రభుత్వ రంగ దిగ్గజం

Vikas M

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడా ఐడియా) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు పోటీగా 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.

iPhone 16 Pro Max Seized: 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్

Hazarath Reddy

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఇటీవల లాంచ్ చేసిన 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు

Hazarath Reddy

ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన 82 ఏళ్ల ఎస్‌పి ఓస్వాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), డివై చంద్రచూడ్ తో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ. 7 కోట్ల మేర మోసం చేశారు.

Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పండుగలు, బ్యాంకుల సెలవు లిస్టు ఇదిగో..

Vikas M

అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

Advertisement

Tesla New Milestone: టెస్లా కొత్త మైలురాయి, గిగా షాంఘై ప్లాంట్ నుండి 1 మిలియన్ కార్లు ఎగుమతి సక్సెస్, అభినందనలు తెలిపిన ఎలోన్ మస్క్

Vikas M

టెస్లా ఆసియా సెప్టెంబరు 28, 2024న ఒక విజయాన్ని పంచుకుంది. గిగా షాంఘై తన ప్లాంటు నుండి ఒక మిలియన్ కారును విజయవంతంగా ఎగుమతి చేసిందని ప్రకటించింది.

Anil Ambani Wins Rs 780 Crore: అనిల్ అంబానీకి కోర్టులో భారీ ఉరట, డివిసిపై రూ. 780 కోట్ల కేసును గెలిచిన అనిల్ అంబానీ

Vikas M

Calcutta High Court, Anil Ambani, Anil Ambani wins Rs 780 crore, DVC, Reliance Infra, Reliance Infra Wins Rs 780 Cr Arbitration Case, long-standing dispute, Damodar Valley Corporation (DVC), అనిల్ అంబానీ, పశ్చిమ బెంగాల్‌,దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌, కోల్‌కతా హైకోర్టు తీర్పు, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌

Gold Prices Hit Record: వామ్మో బంగారం ధ‌ర రోజు రోజుకూ పెరగుతూనే ఉంది క‌దా! గ‌త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి గోల్డ్ రేటు..ఇవాళ ఎంత ఉందంటే?

VNS

కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ (FED reserve Rates) నిర్ణయం తీసుకున్న తర్వాత బంగారం ధర (Gold Prices) ధగధగ మెరుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లలో గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 పెరిగి రూ.78, 250 లకు చేరుకున్నది.

Tsuchinshan-ATLAS: ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం, మళ్లీ భూమికి దగ్గరగా రానున్న దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క

Vikas M

Advertisement
Advertisement