టెక్నాలజీ
Ola: క్విక్ కామర్స్ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం
Vikas Mగతంలో క్విక్ కామర్స్ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తున్నట్లు సమాచారం.
Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెల్కోలకు డాట్ ఆదేశం
Vikas Mవివరాల ధ్రువీకరణలో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించింది.
RBI: ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన
Vikas Mరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పన్ను చెల్లింపుల UPI పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనర్థం మీరు ఇప్పుడు UPIని ఉపయోగించి పెద్ద పన్ను మొత్తాలను త్వరగా, సులభంగా చెల్లించవచ్చు.ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.
Tesla Cars: రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం 16.80 లక్షల టెస్లా కార్లు రీకాల్, ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రకటన
Vikas Mటెస్లా రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం చైనాలో 1.68 మిలియన్ కార్లను రీకాల్ చేస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. ట్రంక్ లాచెస్ లోపభూయిష్టంగా ఉన్న వాహనాలను ఉచితంగా మరమ్మతులు చేస్తామని మంగళవారం ఆలస్యంగా ప్రకటనలో తెలిపారు.
Anand Mahindra on Vinesh Phogat Disqualification: నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు, వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. ఈ అంశం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Dell Layoffs Announced: టెక్ రంగంలో భారీ లేఅప్స్, 12, 500 మంది ఉద్యోగులపై వేటు వేసిన డెల్, ఇంటెల్ భారీ ఉద్యోగాల కోతల తర్వాత రెండవ అతిపెద్ద దెబ్బ
Hazarath Reddyడెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను ప్రభావితం చేసే అతిపెద్ద ఉద్యోగ కోత రౌండ్‌లో దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. టెక్ దిగ్గజం ఆగస్ట్ 6, 2024న అంతర్గత మెమో ద్వారా ఈ తొలగింపులను ప్రకటించింది, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10% ప్రభావం చూపుతుందని సూచించింది.
Manish Tiwary Resigns: అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ రాజీనామా, కొత్త కంపెనీని వెతుకుతున్నట్లుగా వార్తలు
Vikas Mఈ-కామర్స్ దిగ్గజంలో ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిపిన తర్వాత అమెజాన్ ఇండియా అధినేత మనీష్ తివారీ పదవికి రాజీనామా చేసినట్లు పరిణామాలు తెలిసిన వ్యక్తులు మనీకంట్రోల్‌కి తెలిపారు.తివారీ మరో కంపెనీలో కొత్త పాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారని వారు తెలిపారు.
Job Cuts 2024: డెల్ కంపెనీలో మరోసారి భారీ లేఆప్స్, రేపటి నుండి 12,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లుగా వార్తలు
Vikas Mఇటీవల, టెక్ దిగ్గజం డెల్ తన కొత్త AI-కేంద్రీకృత యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేయడంతో డెల్ తొలగింపులు విక్రయ విభాగంలో వేలాది మంది ఉద్యోగులను దెబ్బతీస్తాయని అనేక నివేదికలు ధృవీకరించాయి. అయితే ప్రభావితమయ్యే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే, Xలోని అనేక పోస్ట్‌లు సంఖ్యలు 12,500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని సూచించాయి.
Dark Patterns in Indian Apps: ఈ 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయి, సంచలన నివేదిక వెలుగులోకి..
Vikas Mస్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే కొన్ని యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI), ParallelHQ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో చేర్చబడిన 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.
Cognizant New Centre in Hyd: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం
Vikas Mప్రముఖ ఐటీ దిగ్గజం `కాగ్నిజెంట్` హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నది
Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం
Vikas Mప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.
Samsung Galaxy F14: తొమ్మిది వేలకే శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీతో ప్రైమరీ కెమరాతో పాటు మిగతా ఫీచర్లు అదుర్స్
Vikas Mదక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా భారత మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ ఒకటి లాంఛ్ చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14. కేవలం రూ. 8,999కే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.
Infineon Layoffs: ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్
Vikas Mజర్మనీలోని మ్యూనిచ్ జిల్లాలోని న్యూబిబెర్గ్‌లో ఉన్న గ్లోబల్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇన్ఫినియన్ టెక్నాలజీస్ మూడవ త్రైమాసిక ఆదాయ అంచనాలను తప్పిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ఫినియన్ తొలగింపులు జర్మనీలోని రెజెన్స్‌బర్గ్‌లో పనిచేస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపుతాయి
Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.
BSNL 4G Network Ready: బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ సిద్ధం, త్వరలోనే లక్ష 4జీ టవర్లు నిర్మిస్తామన్న కేంద్రమంత్రి, అక్టోబర్ వరకు 80వేల టవర్ల నిర్మాణం పూర్తి
VNSకేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ (BSNL 4G) సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు.
UN Praises India's Digital Revolution: భారత్‌లో డిజిటల్ విప్లవంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి
Hazarath Reddyడిజిటల్ రివల్యూషన్ ద్వారా గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (Dennis Francis) పేర్కొన్నారు
BSNL 5G Service: గుడ్ న్యూస్.. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5G సర్వీసులు, ఏఏ నగరాల్లో తెలుసా?
Arun Charagondaప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వినియోగదారులకు తక్కువ ధరలోనే 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ... బీఎస్‌ఎన్‌ఎల్‌తో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీ చర్చలు జరుపుతోంది.
New FASTag Rules: వాహనదారులు అలర్ట్, నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే బ్లాక్‌లిస్టులోకి..
Hazarath Reddyనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సరికొత్త రికార్డు, ఏకంగా 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్స్
VNSనేటితో గడువు పూర్తికానుండటంతో.. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ( IT Department) తెలిపింది.
OPPO K12x 5G: ఒప్పో నుంచి ఒప్పో కే12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్, ఎంట్రీ లెవల్ ఫోన్ కావాలనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇదే..
Vikas Mచైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 8 జీబీ ర్యామ్ తో వస్తోంది.