World

BP Drugs Cuts Covid Death Risk: కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.

Kim Jong Un in Coma: కోమాలోకి నార్త్ కొరియా అధినేత, కిమ్‌ యో జోంగ్ చేతికి నార్త్ కొరియా పగ్గాలు, సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణ కొరియా అధికారి

Hazarath Reddy

గత కొంత కాలంగా ఉత్తర ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్యంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా అధికారి, గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ కిమ్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారని (Kim Jong Un in Coma), తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని ఆయన అన్నారు.

Coronavirus in india: కరోనా రోగులు వాసన ఎందుకు కోల్పోతున్నారు? దేశంలో తాజాగా 61,408 మందికి కరోనా, 31 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 57,542కి చేరిన మృతుల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా (Coronavirus in india) సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు (Coronavirus Cases in India) చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542 (Covid Deaths)పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు.

Dawood Ibrahim: మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉంటున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చిన పాకిస్థాన్, భారత మీడియా కథనాలతో రివర్స్ గేర్

Team Latestly

ఇంతకాలంగా సదరు మాఫియా డాన్ ఎక్కడున్నాడో తెలియడంటూ చెప్తూ వచ్చిన పాక్ ఇప్పుడు తమ దేశంలోనే ఉన్నట్లు తనకు తానుగా ప్రపంచానికి చెప్పినట్లయింది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ మీడియాలో కథనాలు రావడంతో వెంటనే పాకిస్థాన్...

Advertisement

COVID19 in India: భారత్‌లో 30 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 69,878 పాజిటివ్ కేసులు నమోదు, 55 వేలు దాటిన కరోనా మరణాలు

Team Latestly

శనివారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,864,873 గా ఉండగా, మరణాలు 797,787 కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది....

Zoom viral video: లైవ్ మీటింగ్‌, సెక్స్‌లో మునిగిపోయిన ఉద్యోగి, బ్రెజిల్‌లోని రియో డి జనీరో మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశంలో ఘటన, వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

కరోనావైరస్ దెబ్బకు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చాలా సంస్థ‌లు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆఫర్ ఇచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే అవ‌కాశాన్ని బ‌ట్టి ఆన్‌లైన్ మీటింగులు పెడుతున్నారు. ఇక‌, విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసుల్లో బిజీ అయిపోయారు. చాలామంది జూమ్, గూగుల్ మీట్ ఇలా కొన్ని యాప్‌ల‌ను ఆన్‌లైన్ స‌మావేశాల‌కు ఉప‌యోగిస్తున్నారు. అన్ని ప్ర‌భుత్వాలు కూడా వీటినే ఫాలో అవుతున్నాయి.

Alexei Navalny poisoning: రష్యా ప్రతిపక్షనేతపై విష ప్రయోగం, ఐసీయూలో అలెక్సీ అలెక్సీ నవాల్నీ, అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలమైన నేతగా ఎదిగిన అలెక్సీ

Hazarath Reddy

రష్యాలో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ధీటుగా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నవాల్నీపై విషప్రయోగం (Alexei Navalny poisoning) జరిగింది. విషప్రయోగంతో ఆయన కోమాలోకి వెళ్లారని అనుచరులు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్‌ మీద ఉంచి, చికిత్స చేస్తున్నారని తెలిపారు. సైబీరియాలోని టోమ్‌స్క్‌ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్‌ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Corona Cases in India: హోం క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం, దేశంలో తాజాగా 68,898 మందికి కోవిడ్-19, భారత్‌లో 29 లక్షలు దాటిన కరోనా కేసులు, దేశ రాజధానిలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కేసులు

Hazarath Reddy

దేశంలో శుక్రవారం ఒక్కరోజే 68,898 పాజిటివ్‌ కేసులు (Corona Cases in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823 కు (2020 Novel Coronavirus) చేరింది. గడిచిన 24 గంటల్లో 983 కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు (Coronavirus Deaths in India) చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు సెరోలాజికల్‌ సర్వే తెలిపింది. ఢిల్లీలో 29.1 శాతం మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు (వ్యాధి నిరోధక ప్రతిరక్షకాలు) వృద్ధి చెందినట్టు తెలిసింది.

Advertisement

Nuclear Battle: భారత్‌తో అణుయుద్ధం తప్పదంటున్న పాకిస్తాన్, ముస్లింలను కాపాడుకుంటూ భారత భూభాగాన్ని టార్గెట్ చేస్తాం, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌

Hazarath Reddy

దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వేందుకు రెడీ (Pakistan vs India) అవుతోంది. ముఖ్యంగా కాశ్మీర్ (Kashmir) విషయంలో ఆగ్రహంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇండియాపై (India-Pak Tensions) యుద్ధం చేయడానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని ఆయన (Pakistan minister Sheikh Rasheed) హెచ్చరించారు. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని ( Pakistan warns of nuclear battle with India) తెలిపారు.

India Coronavirus: దేశంలో కరోనాపై భారీ ఊరట, 21 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 69,652 కేసులు నమోదు, యాక్టివ్‌గా 6,86,395 కేసులు, 53,866 మంది వైరస్‌‌తో మృతి

Hazarath Reddy

దేశంలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు (India Coronavirus Cases) నమోదు కాగా.. 977 మంది వైరస్‌ బారిన పడి మృతి (Covid Deaths) చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా (Coronavirus in India) ఉండగా 53,866 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్‌ (Covid virus) నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది.

Mali President Resigns: మాలి దేశంలో సైనికుల తిరుగుబాటు, రక్తపాతం వద్దంటూ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా రాజీనామా, రద్దయిన పార్లమెంట్

Hazarath Reddy

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశంలో సైనికులు తిరుగుబాటను లేవదీశారు. వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా మాలిలో నిరంతర ఆందోళనల ఫలితంగా మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా మంగళవారం అర్దరాత్రి తన పదవికి రాజీనామా (Boubacar Keita resigns) చేశారు. తన పదవీకాలం ముగియడానికి మూడు సంవత్సరాల ముందే ఇబ్రహీం తన పదవి నుంచి దిగిపోయారు. మాలి దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకునే ముందు అతని ఇంటి బయట విజయ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

US Presidential Elections 2020: అమెరికాను ఈ సారి నడిపించేదెవరు? జో బిడెన్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసిన డెమోక్రటిక్‌ పార్టీ, నవంబర్‌ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Hazarath Reddy

నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్‌ పార్టీ జో బిడెన్‌ను (Democrat Joe Biden) తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. ఇది జో బిడెన్‌ (Joseph Biden) రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బిడెన్‌ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి తలపడ్డారు. డెమోక్రటిక్‌ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్‌ చేసినందుకు బిడెన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు (US Presidential Elections 2020) జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

Coronavirus in India: భారతీయుల్లో కరోనాని తరిమేసే యాంటీబాడీలు ఎక్కువే, దేశంలో తాజాగా 64,531 మందికి కోవిడ్-19, తమిళనాడు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్‌‌కు కరోనా

Hazarath Reddy

దేశంలో 24 గంటల్లో 64,531 మందికి కరోనా (Coronavirus in India) సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి (Coivd Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic India) ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టిర‌వ‌కు 3,17,42,782 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఆగ‌స్టు 18న 8,01,518 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది. ‌

No Masks in Wuhan: కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే వుహాన్‌ ఎంజాయ్ చేస్తోంది, మాస్క్ లేకుండా వుహాన్‌ వాటర్ పార్కులో వేలాది మంది జనం, మాయా బీచ్ పార్క్‌లో విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ

Hazarath Reddy

కరోనాకు పుట్టినిల్లు ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం చైనాలోని వుహాన్ నగరం (Wuhan Coronavirus). అక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తూనే ఉంది. మరి అలాంటి వుహాన్ నగరంలో ప్రజలు ఎలా ఉండాలి. కరోనా అంటే భయపడుతున్నారా..అబ్బే అదేం లేదు.. ఇప్పుడు వుహాన్ నగరంలో వాటర్ పార్కులు కిటకిటలాడిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనాతో ఖాళీగా వెలవెలబోయిన వాటర్ పార్కులన్నీ జనంతో నిండిపోయాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో వేలాది మంది పార్టీలు (Partygoers Crowd) చేసుకుంటున్నారు.

North Korea's Food Shortage: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం, పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డర్ జారీ చేసిన కిమ్ జాంగ్, కుదేలైన వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు

Hazarath Reddy

ఉత్తర కొరియాలో ఇప్పుడు ఆహార సంక్షోభ ఛాయలు (Food Shortages) కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ సంచలన నిర్ణయం (Kim Jong Un Orders) తీసుకున్నారు. దేశంలో మాంసం కొరతను.. ప్రజలు ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్కలతో ( Pet Dogs) భర్తీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జులై నెలలో కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఇకపై నేరమని కిమ్ (Kim Jong Un) ఆదేశించాడు. దీంతో కుక్కలను పెంచుకుంటున్న ప్రజల ఇళ్లను గుర్తించిన అధికారులు.. వారి నుంచి బలవంతంగా కుక్కలను లాక్కుంటున్నారు. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తున్న జూలకు, కుక్క మాంసాన్ని వండే రెస్టారెంట్లకు తరలిస్తున్నారు.

Clean Your Plate: చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ సంక్షోభం, తరుముకొస్తున్న కరువు ఛాయలు, క్లీన్ యువర్‌ ప్లేట్‌ ఉద్యమం మొదలుపెట్టిన చైనా అధినేత జీ జిన్‌పింగ్‌

Hazarath Reddy

చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ భయంకరమైన సంక్షోభం (facing food crisis) రానుందనే వార్తలు ఆ దేశాన్ని నిదరపోనీయడం లేదు. భయంకరమైన దుర్భిక్షం దేశాన్ని మళ్ళీ కమ్ముకోబోతోంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం అంటే 1959లో అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్‌ దేశ ప్రజలందరినీ తక్కువగా తినాలని, ఖాళీ సమయాలో ఏదో ఒకటి తినడం ఆపేయాలని ఆయన కోరారు. ఆహార పదార్థాల రేషనింగ్‌ కూడా చేశారు. అయితే ఈ ఇప్పుడు అదే పరిస్థితులు చైనాను (China) చుట్టిముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి చైనా అధినేత జీ జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping) స్వయంగా- క్లీన్‌ ప్లేట్‌ పేరిట ఓ ఉద్యమాన్ని (Clean Your Plate Campaign) ఆరంభించారు. ఆహార వృథాను తగ్గించాలని దేశప్రజలకు పిలుపునిస్తున్నారు.

Advertisement

Coronavirus in India: మనిషికి తెలియకుండానే కరోనా వచ్చి..వెళుతోంది, ఏపీలో సీరో సర్వైలెన్స్‌ పరీక్షలో ఆసక్తికర నిజాలు, దేశంలో తాజాగా 55,079 మందికి కరోనా, 27 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కరోనా పాజిటివ్‌ కేసులు (India’s Coronavirus) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,02,743 కు (COVID-19 Tally) చేరింది. తాజాగా 876 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య సంఖ్య 51,797 కు (Covid Deaths) చేరింది. ఇప్పటి వరకు 19,77,780 వైరస్‌ నుంచి కోలుకున్నారు. 6,73,166 బాధితులు ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.దేశంలో సోమవారం 8,99,864 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3,09,41,264 మందికి కరోనా పరీక్షలు చేసిందని ఐసీఎంఆర్‌ వివరించింది.

Russian Vaccine: రష్యా వ్యాక్సిన్‌పై షాకింగ్ న్యూస్, ఆ టీకా వేసుకునేందుకు నిరాకరిస్తున్న రష్యన్ డాక్టర్లు, సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన ఆర్‌బీసీ న్యూస్‌

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దానికి విరుగుడును రష్యా (Coronavirus Russian Vaccine) కనిపెట్టి గ్లోబల్ వ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన సంగతి విదితమే. అయితే దానికి సొంత దేశంలోనే ఎదురుదెబ్బ తగులుతోందని విషయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్ పై (Sputnik V) రష్యాలో సగం మంది డాక్టర్లు (Russian Doctors) నిరాసక్తత చూపిస్తున్నారట.

Citigroup ‘Clerical Error’: చిన్న తప్పుతో రూ. 6700 కోట్లు రుణదాతల ఖాతాల్లోకి, తిరిగి రాబట్టుకునేందుకు నానా కష్టాలు పడుతున్న సిటీ గ్రూపు, దివాళా దిశగా రెవ్లాన్ కంపెనీ

Hazarath Reddy

బ్యాకింగ్ రంగ దిగ్గజం సిటీబ్యాంక్‌లో పని చేసే ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు (Citigroup Mistakenly Pays $900 Million) కారణంగా సిటీబ్యాంక్‌ భారీ వివాదంలో (Citigroup Clerical Error) చిక్కుకుంది. న్యూయార్క్‌ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్‌‌, సుమారు బిలియన్‌ డాలర్ల మేరకు రుణదాతలకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై (Revlon) దావా వేసింది.

D614G Virus in Malaysia: మలేషియాలో డేంజర్ వైరస్, కరోనా కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరం‌తో D614G వైరస్, మొత్తం 45 కేసులు నమోదు, రూల్స్ బ్రేక్ చేసినందుకు పేషెంట్‌కి ఐదు నెలల జైలు శిక్ష

Hazarath Reddy

మలేషియాలో ప్రమాదకరవైరస్ (D614G in Malaysia) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది యూరప్, ఉత్తర అమెరికా ఖండంలో కనిపించింది. దానికి D614G అని పేరు కూడా పెట్టారు. తాజాగా మలేషియాలో కూడా ఈ వైరస్ బయటపడింది. అయితే ఇది కరోనా వైరస్ లాగానే ఉంది. అయితే లక్షణాలు కరోనా( Coronavirus) కన్నా 10 రెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇండియాకి వెళ్లి మలేసియా తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్ ఓనర్‌కి కరోనా వచ్చింది. ఆయన ద్వారా మరికొంత మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఇలా మొత్తం అక్కడ 45 కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement