New Delhi, DEC 27: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లో హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) ఆవిష్కరించింది. దీని ధర రూ.1,19,481 (EX Showroom) పలుకుతుంది. ఓబీడీ2బీ కంప్లియంట్ ఇంజిన్, అదనపు ఫీచర్లతో ఈ మోటారు సైకిల్ అప్ డేట్ చేశారు. హోండా యూనీకార్న్ 2025 మోటారు సైకిల్ 162.71సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యుయల్ – ఇంజెక్టెడ్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 13 హెచ్పీ విద్యుత్, 14.58 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో రూపుదిద్దుకున్నదీ బైక్.
Honda SP 160: హోండా నుంచి ఎస్‌పీ160 బైక్ వచ్చేసింది, హైదరాబాద్‌లో దీని ధర ఎంతంటే..
హోండా యూనికార్న్ 2025 (Honda Unicorn 2025) మోటారు సైకిల్ న్యూ ఆల్ -ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ క్రోమ్ ఎంబెల్లిష్ మెంట్స్‌తో వస్తోంది. న్యూ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కలిగి ఉంటుంది. సింగిల్ వేరియంట్‌గా వస్తున్న హోండా యూనికార్న్ 2025 మోటారు సైకిల్ పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్టె యాక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.