Kia EV6

New Delhi, JAN 17: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది. న్యూ ఈవీ6 (EV6) కార్ల కోసం బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ కారు ధర రూ.60.97 లక్షల నుంచి రూ.65.95 లక్షల (ఎక్స్ షోరూమ్‌) మధ్య ఉంటుందని తెలుస్తోంది. తొలిసారి 2022లో ఈవీ6 (EV6) కారును కియా ఆవిష్కరించింది. తాజాగా రీ ఫ్రెష్డ్‌ వర్షన్‌ పలు మార్పులతో తీసుకొస్తున్నది. గతేడాది మే నెలలో అప్‌డేటెడ్‌ వర్షన్ కారు దక్షిణ కొరియాలో ఆవిష్కరించింది. న్యూ బ్యాటరీ ఆప్షన్‌తోపాటు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్, ఫీచర్లు జత చేశారు. దేశీయంగా కంప్లీట్‌లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా లభిస్తుంది. అప్‌డేటెడ్‌ కియాఈవీ6 (Kia EV6) కారు అడాస్ 2.0, 27 అడ్వాన్స్డ్‌ సేఫ్టీ, డ్రైవర్ అసిస్టెన్స్‌ ఫీచర్లతో వస్తోంది.

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకీ నుంచి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ లాంచ్‌, ఆటో ఎక్స్‌పోలో ఫీచర్లు, ధర విడుదల చేసిన కంపెనీ 

సిటీలో ప్రయాణానికి వీలుగా ఫ్రంట్‌ కొల్లిషన్‌ అవాయిడెన్స్‌ అసిస్ట్‌ (ఎఫ్‌సీఏ), పెడెస్ట్రెయన్‌, సైకిలిస్ట్‌, జంక్షన్ టర్నింగ్‌ సినారియోస్‌, న్యూ లేన్ చేంజ్ అసిస్ట్‌, ఏవాసింగ్‌ స్టీరింగ్‌ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈవీ కొల్లిషన్‌ సేఫ్టీ, స్ట్రక్చరల్‌ రిజిడిటీ, ప్రయాణికుల రక్షణను మెరుగు పరుస్తాయి. స్పోర్టియర్ డిజైన్‌తో ఈవీ6 (Kia EV6) వస్తోంది. స్టార్ మ్యాప్‌ లైటింగ్‌ విత్‌ కనెక్టెడ్‌ డీఆర్‌ఎల్స్‌, జీటీ-లైన్‌ ఫ్రంట్‌ బంపర్‌, గ్లోసీ 19-అంగుళాల వీల్స్‌, స్టార్‌ మ్యాప్ ఎల్‌ఈడీ రేర్‌ ల్యాంప్స్‌ ఉంటాయి. డబుల్‌ డీ-కట్‌ స్టీరింగ్ వీల్‌తోపాటు ప్రీమియం క్యాబిన్‌ ఉంటుంది.

Auto Expo: ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాలదే హవా! కొత్త మోడల్స్‌ రిలీజ్‌ చేయనున్న టాప్ కంపెనీస్ 

అప్‌డేటెడ్‌ కియాఈవీ6 (Kia EV6) కారు రీ డిజైన్డ్‌ ఫ్రంట్ గ్రిల్లె, రీఫ్రెష్డ్‌ లుక్‌ బంపర్ ఫీచర్లు, న్యూలీ 20-అంగుళాల స్టైల్డ్‌ బ్యాక్‌ అండ్‌ 19- సిల్వర్ అల్లాయ్‌ వీల్స్‌తో వస్తోంది. రేర్‌లో స్లీక్‌ ఫుల్ విడ్త్‌ ఎల్‌ఈడీ లైట్‌ బార్‌ ఉంటాయి. 84కిలోవాట్ల బ్యాటరీ వస్తున్న కియా ఈవీ6 కారు సింగిల్‌ చార్జింగ్‌తో 650 కి.మీ పై చిలుకు దూరం ప్రయాణిస్తుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 325 పీఎస్‌ పవర్‌, 605 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. ఆల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతుగా ఉంటుందీ కారు. 350కిలోవాట్ల డీసీ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 10-80శాతం చార్జింగ్‌ అవుతుంది.

కియా ఇండియా తన ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఈవీ9 (EV9) ని కూడా ప్రదర్శించింది. 99.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌, ఆల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ సామర్థ్యం, సింగిల్‌ చార్జింగ్‌తో 561 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది. కియా కనెక్ట్‌ 2.0, ఓవర్‌ ది ఎయిర్‌ (ఓటీఏ) అప్డేట్స్, ఫ్యూచరిస్టిక్ డిజిటల్‌ డిజైన్‌, 27 అడాస్‌ ఫీచర్లు, 10- ఎయిర్ బ్యాగ్‌ సిస్టమ్‌ ఉంటాయి. వీటితోపాటు కియా సిరోస్‌, కియా ఇండియా ఈ – విజన్ కాన్సెప్ట్‌ ప్రదర్శించింది.