Food Tips: సాయంత్రం పూట కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే అది కొంచెం వేడివేడిగా చాలా ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఉంటే ఇంకాస్త బెటర్ అనిపిస్తుంది. అలాగే అలాంటిదే ఇప్పుడు ఒక స్లాక్ ఐటమ్స్ చూద్దాం. దాన్ని దీని కోసం కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదేంటి అంటే బోండాలు. వేడివేడిగా బోండాలు అప్పటికప్పుడు ఈజీ ప్రాసెస్ తో తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు.
మైదా- పావు కేజీ
పెరుగు- ఒక కప్పు
వాము- ఒక స్పూను
ఆయిల్- డీప్ ఫ్రై కి సరిపడినంత
ఉప్పు- తగినంత
వంట సోడా -చిటికెడు..
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
తయారీ విధానం.. అరకేజీ మైదా పిండి తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. పుల్లటి పెరుగు అయితే రుచి మరింత బాగుంటుంది. దీన్ని కలుపుకొని ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వాము ,చిటికెడు వంట సోడా రుచికి తా సరిపడా ఉప్పు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. వంట సోడా వేయడం వల్ల కాస్త పులుస్తుంది. బోండాలు క్రిస్పీగా లోపట మొత్తం కూడా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. 15 నిమిషాల తర్వాత స్టౌ పైన కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడినంతగా నూనె పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాండిలో వేసి బోండా లాగా చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపట మెత్తగా ఉంటాయి. ఎంతో వాము వేయడం ద్వారా జీర్ణ సమస్యలు కూడా ఏవి ఉండవు. ఎంతో ఈజీగా సింపుల్ గా తయారయ్యే ఈ రెసిపీ ఈవినింగ్ చాలా రుచిగా ఉంటుంది. దీని కాంబినేషన్ గా టమాటా చట్నీ లేదా అల్లం చట్నీ వేసుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది .బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసే ఈ బోండాలు రెసిపీ ని మీరు కూడా ట్రై చేయండి.