తెలుగు ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ "శివరపల్లి" జనవరి 24న విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు కామెడీ డ్రామా సిరీస్ "శివరపల్లి" ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాదు నుంచి శివరపల్లి అనే తెలంగాణలోని ఒక పల్లెటూరిలో పంచాయతీ కార్యదర్శిగా విరుచుకుపడి తీసుకున్న ఉద్యోగంలో అతను ఎదుర్కొనే నిత్యజీవిత సమస్యలు మరియు ఫన్నీ సంఘటనలతో సాగుతుంది.
ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థ నిర్మాణంలో భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు శన్ముఖ ప్రసాద్ రచయితగా వ్యవహరించారు. ఇందులో రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూపా లక్ష్మీ, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లే, పవని కరణం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ కామెడీ డ్రామా ప్రైమ్ వీడియో ద్వారా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రసారం కానుంది. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్...ఇరవై నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేసిన మేకర్స్, అద్భుత స్పందన
Telugu Original Comedy Drama Series Sivarapalli streaming on January 24
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)