Entertainment

Bigg Boss Telugu 4 Launched: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వచ్చేశారు, మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు అంటూ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ స్టార్ట్, హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ

Hazarath Reddy

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఆదివారం సాయంత్రం (Bigg Boss Telugu 4 Launched) ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో.. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి బిగ్‌బాస్‌ (Bigg Boss (Telugu season 4) వచ్చేశాడు. స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు.

Bigg Boss (Telugu season 4): బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నేటి నుంచే, కంటెస్టెంట్ వివరాలు లీక్, కరోనావైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్

Hazarath Reddy

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు నేటినుంచి స్టార్ మా చానల్‌లో బిగ్‌బాస్ 4 సీజన్ (Bigg Boss 4 Telugu) ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా (Nagarjuna's Bigg Boss Telugu 4) వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో (Bigg Boss Telugu Season 4) ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.

Sushant Death Case: ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో

Hazarath Reddy

సినీనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు (Sushant Singh Rajput Death Case) ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని విచారణకు హాజరకావాలని(Rhea Chakraborty Summoned) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆదివారం ఆదేశించింది. నార్కోటిక్స్ (Narcotics) అధికారుల బృందంతో పాటు ముంబై పోలీసులు ఆదివారం ఉదయం రియా చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు.

Ram Charan: మీ లోటు పూడ్చలేం, మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల సాయం ప్రకటించిన రాంచరణ్, రూ. 2 ల‌క్ష‌ల సాయం ప్రకటించిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఈ బాధాకర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం తప్ప మనం మరేమీ చేయలేమని... వారి లేని లోటును మనం పూడ్చలేమని రాంచరణ్ అన్నాడు. ముగ్గురి కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు.

Advertisement

Three Pawan Fans Electrocuted: పవన్ పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, ఘటనపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, చిరంజీవి, వకీల్ సాబ్ చిత్ర యూనిట్

Hazarath Reddy

జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, పెను విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ (Three Pawan Fans Electrocuted) తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

SP Balu Health Condition: కోలుకుంటున్న బాలు, ఫిజియోథెరపీ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, అసత్య ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని మాళవిక

Hazarath Reddy

కొద్ది రోజులుగా క‌రోనాతో ఫైట్ చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) కోలుకుంటున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన (S P Balu Health Update) విడుదల చేశాయి. బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. (Fully Awake And Responsive) ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

#IntoTheWildWithBearGrylls: అడవిలో అక్షయ్ కుమార్ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, into the wild with bear grylls కోసం బేర్ గ్రిల్స్‌తో కలిసి రిస్క్ చేస్తున్న అక్షయ్, సెప్టెంబ‌ర్ 14న డిస్క‌వరీ ఛానెల్‌లో ఎపిసోడ్ ప్ర‌సారం

Hazarath Reddy

అక్షయ్ కుమార్ నటించిన బేర్ గ్రిల్స్ ఇంటు ది వైల్డ్ ( Bear Grylls’ Into The Wild) ఎపిసోడ్ యొక్క కొత్త టీజర్ వచ్చింది. ప్రత్యేక ఎపిసోడ్ అడవిలో ‘పిచ్చి సాహసం’ పై ‘డేర్‌డెవిల్ ద్వయం’ చూడండి అంటూ చిన్న వీడియో టీజర్ లో ప్రారంభం అవుతోంది. బేర్ తన యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ‘లెజెండ్’ గా అక్షయ్‌ను పరిచయం చేయడంతో. "నేను రీల్ హీరో, అతను నిజమైన హీరో" అని నటుడు అంటాడు. వీడియోలో బేర్ మరియు అక్షయ్ (Akshay Kumar) దీనిని అడవిలో రఫ్ చేయడం మరియు మొసలి ఉన్న నీటి పై నుంచి వెళ్లడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, నటుడు ‘ఏనుగు పూప్ టీ’ పై సిప్ చేస్తాడు.

SP Balu Health Update: పాడేందుకు నాన్న ప్రయత్నిస్తున్నారు, ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, బాలు ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపిన కుమారుడు ఎస్పీ చరణ్

Hazarath Reddy

కోవిడ్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్‌ వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. చికిత్సకు బాలు (SP Balasubrahmanyam) బాగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. బాలు స్పృహలోకి వచ్చారని, ఆయన శ్వాస ప్రక్రియ బాగా మెరుగైందని వెల్లడించారు. ఇలాగే నిలకడగా ఉంటే మరో వారం రోజుల్లో ఎక్మో పరికరాన్ని తొలగించే వీలుందని తెలిపారు.

Advertisement

Sushant Death case: విష ప్రయోగం వల్లే సుశాంత్‌ మరణించాడు, సంచలన ఆరోపణలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపణ

Hazarath Reddy

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajput Death case) నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్‌ నేత సంచలన ఆరోపణలు చేశారు.

Sonu Sood on AP Villagers: ఏపీకి రానున్న సోనూ సూద్, ఆ రెండు గ్రామాల ప్రజలను చూడాలని ఉందంటూ ట్వీట్, 20 వేల మంది వలస కార్మికులకు నోయిడాలో ఆశ్రయం కల్పించనున్న రియల్ హీరో

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో (Vizianagaram) తమ ఊరి రోడ్లను తామే నిర్మించుకున్న రెండు గ్రామాల ప్రజలపై సోనూ సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ సోనూ భాయ్ ని పొగిడితే ఆయన మాత్రం ఏపీలోని రెండు గ్రామాల ప్రజలను ఆకాశానికి ఎత్తేశాడు. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్‌ హీరోస్‌’ ’అంటూ ట్విటర్‌ వేదికగా కొనియాడారు. త్వరలోనే మీ ఊరికి వస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్, రాముడి పాత్రకు సరిగ్గా సెట్ అవుతాడని తెలిపిన రాజమౌళి, సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అంటూ పుకార్లు

Hazarath Reddy

‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ (Adipurush) ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు (Lord Ram) ప్రభాస్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం.

SP Charan on SPB's Health: బాలుకి కరోనా నెగిటివ్ వార్త అబద్దం, నా తండ్రి ఇంకా లైప్ సపోర్ట్ మీదే ఉన్నారు, వీడియో విడుదల చేసిన ఎస్పీ చరణ్‌, తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి, అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) కరోనా వైరస్‌ను జయించినట్లు వచ్చిన వార్తలను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ (SP Charan on SPB's health) ఖండించారు. ఎస్పీకి కరోనా నెగిటివ్‌ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, కొందరు తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు.

Advertisement

Sonu Sood: ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

Hazarath Reddy

సోనూ ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ (Chhattisgarh chief minister Bhupesh Baghel) సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Kamalakar Reddy Dies: తెలుగు సినీ నిర్మాత కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి, కరోనా సోకిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా విషాద ఘటన

Hazarath Reddy

టాలీవుడ్‌ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) (Telugu Distributor Kamlakar Reddy Dies) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (Kamlakar Reddy Father Nandagopal Reddy) సైతం అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.

Sushant Singh Rajput Death Case: సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసు సీబీఐకి, కేసు విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసులు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు (Sushant Singh Rajput Death Case) విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

Plasma Donation Awareness: కరోనాపై భయం వద్దు, అందరూ ప్లాస్మా దానం చేయాలని కోరిన సీపీ సజ్జనార్, ప్లాస్మా దానంపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాజమౌళి, కీరవాణి తదితరులు

Hazarath Reddy

ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు(Plasma Donation Awareness) జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Rajamouli, Keeravani), సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ( V. C. Sajjanar) తదితరులు పాల్గొన్నారు. ప‌్ర‌జ‌ల్లో ప్లాస్మాపై అనేక అపోహ‌లుండేవ‌ని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని సైబ‌రాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు.

Advertisement

Sushant Suicide Case Update: సుశాంత్ నా కొడుకు లాంటివాడు, అతని కుటుంబానికి న్యాయం జరగాలి, సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ రెండో పెళ్లి వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు తండ్రితో సత్సంబంధాలు లేవని, తండ్రి రెండో వివాహం చేసుకోవడం పట్ల సుశాంత్‌ సంతోషంగా లేరని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి విదితమే. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) తన కొడుకు లాంటివాడని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై సుశాంత్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే అయిన నీరజ్‌ కుమార్‌ సంజయ్‌ రౌత్‌కు నోటీసులు పంపారు. కేకే సింగ్‌ రెండో పెళ్లి అవాస్తవమని, అనవసర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్‌ 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చేప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

Kathi Mahesh Arrested: కత్తి మహేష్‌కి 14 రోజుల రిమాండ్, శ్రీరాముడుపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సైబైర్ క్రైమ్ పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు

Hazarath Reddy

టాలీవుడ్‌ వివాదాస్పద సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ (Kathi Mahesh Arrested) చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై (Lord Sriram)అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Yuvraj on Sanjay Dutt Health: నీ బాధ నాకు తెలుసు దత్, క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలి, ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ యువరాజ్ సింగ్ ట్వీట్

Hazarath Reddy

'సంజయ్‌ దత్‌.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.

Web Series on Vikas Dubey: వికాస్ దూబేపై వెబ్ సిరీస్‌, పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్‌ను చూపిస్తానంటున్న దర్శకుడు హన్సల్ మెహతా, ప్రాజెక్ట్ కోసం హక్కులను కొనుగోలు చేసిన శైలేష్ కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్

Hazarath Reddy

గత నెలలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారంగా వెబ్ సిరీస్‌ను (Web Series on Vikas Dubey) నిర్మించి, దర్శకత్వం వహించడానికి చిత్రనిర్మాత హన్సల్ మెహతా (Filmmaker Hansal Mehta) సిద్ధమయ్యారు. కాన్పూర్‌లోని చౌబేపూర్ ప్రాంతంలోని బిక్రూ గ్రామంలో దుబేను (Vikas Dubey) అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో పోలీసులపై దూబే గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డిఎస్‌పి దేవేంద్ర మిశ్రాతో (DSP Devendra Mishra) సహా ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

Advertisement
Advertisement