Entertainment

Love Story: నాగ చైతన్య సినిమాకు కొరియోగ్రఫీ చేయనున్న సాయి పల్లవి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'లవ్ స్టోరీ'!

Team Latestly

సాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు, తన డాన్సింగ్ స్కిల్స్ తో కూడా ఎంతో మందిని ఫిదా చేసింది, తాను స్వతహాగా మంచి శిక్షణ పొందిన డాన్సర్ కూడా. దీనిని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీలో...

Chiranjeevi's 'Acharya': మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆసక్తికరం, చెర్రీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ఫిక్స్, మరిన్ని విశేషాలు చదవండి

Team Latestly

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. మరోవైపు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఎస్.ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాపై కూడా అభిమానుల్లో ఆత్రుత నెలకొని ఉంది...

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల సంఘీభావం

Team Latestly

నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో....

Radhe Shyam First Look: ప్రభాస్ న్యూ లుక్ వెరీ రొమాంటిక్, అదరగొడుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే, రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల

Hazarath Reddy

అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ (Prabhas 20 First Look) రానే వ‌చ్చింది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏమాత్రం మెరుపు త‌గ్గ‌ని ప్ర‌భాస్ (Prabhas) రాయ‌ల్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బాహుబలి' తరువాత గత సంవత్సరం 'సాహో'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి 'రాధే శ్యామ్' అనే (Radhe Shyam First Look) టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

Advertisement

Suddala Ashok Teja: నేను మీ దయతో బాగానే ఉన్నాను, పుకార్లు నమ్మకండి, వీడియో ద్వారా సందేశాన్ని పంపిన గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ

Hazarath Reddy

ప్రముఖ తెలుగు సినిమా గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో (health condition) ఎలాంటి నిజం లేదని అలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Dil Bechara: 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్

Team Latestly

ఒక రాజు.. ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌ షో వేయబడుతోంది...

Bigg Boss 14: రేటు పెంచేసిన సల్మాన్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు, అక్టోబర్‌ నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 14..!

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షోకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న విషయం విదితమే. ఈ షోకి కర్త,కర్మ,క్రియ అన్నీ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) అని చెప్పవచ్చు. 2010 నుంచి దాదాపు 10 సీజన్‌లుగా సల్మాన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్‌బాస్‌ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బిగ్‌బాస్‌ షో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nick Cordero Dead: కరోనాతో హాలీవుడ్ న‌టుడు మృతి, కోవిడ్-19తో పోరాడి ఓడిన నిక్ కార్డెరో, బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే చిత్రానికి సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డు అందుకున్న కెనడా సూపర్ స్టార్

Hazarath Reddy

హాలీవుడ్ న‌టుడు టోనీ అవార్డు గ్రహిత నిక్ కార్డెరో క‌రోనా కార‌ణంగా తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. కోవిడ్-19 వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆదివారం ఆయ‌న (Nick Cordero Dead) శాశ్వ‌త విశ్రాంతి తీసుకున్నారు. 41 ఏళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో క‌రోనా సోకడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తీసేశారు. తాజాగా అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత‌ విష‌మించ‌డంతో ఆదివారం తుది శ్వాస విడిచారు.

Advertisement

Tuticorin Deaths: అవి క్రూర‌మైన హ‌త్య‌లు, తూత్తుకుడి తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనపై స్పందించిన రజినీకాంత్, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రభుత్వాన్ని కోరిన తలైవార్

Hazarath Reddy

త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు (Tuticorin father-son) పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌నపై సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను ర‌జ‌నీకాంత్ ‘క్రూర‌మైన హ‌త్య‌లు’గా (brutal killing) ప‌రిగ‌ణించారు. నిబంధ‌న‌లకు విరుద్ధంగా కొంత‌మంది పోలీసులు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ర‌జ‌నీకాంత్ మండిప‌డ్డారు. ఇలాంటి త‌ప్పు చేసిన‌వారిని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని ఆయన డిమాండ్ చేశారు.

Vikas Gupta: ఈ బాలీవుడ్‌ నిర్మాత బైసెక్సువల్‌, తనను ద్విలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి

Hazarath Reddy

బాలీవుడ్‌ నిర్మాత, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా (Vikas Gupta) పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటారా.. ట్విట్టర్లో (Twitter) ఆయన ఓ సంచలన ట్వీట్ చేశారు. తన జీవితం గురించి ఓ నిజాని బయటపెట్టారు. ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా తాను బైసెక్సువల్‌ (I am bisexual) అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Thalapathy Vijay Birthday: తమిళనాడులో వైయస్ జగన్ హవా, విజయ్ బర్త్‌డే సంధర్భంగా పోస్టర్లలో ఏపీ సీఎం ఫోటో, విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్

Hazarath Reddy

నేడు తమిళ్ తలపతి విజయ్ పుట్టిన రోజు (Thalapathy Vijay Birthday). ఆయన పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. విజయ్ పుట్టిన రోజుపై బ్యానర్లను ఏర్పాటు చేసిన అబిమానులు అంందులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఫోటోని పెట్టారు. ఇది సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు ( Happy Birthday Thalapathy) సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలు ముద్రింపబడ్డాయి.

Hoax Bomb Threat: రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు, అణువణువునా గాలించిన బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలు, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు (Rajinikanth hoax bomb threat) వచ్చింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ (bomb threatening call) రావడంతో పోలీసులు పరుగు పరుగున తలైవా ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో ఫేక్ కాల్‌గా గుర్తించారు.

Advertisement

Sushant Singh Rajput's Death: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని మర్డర్ చేశారు, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, సిబీఐ విచారణ జరిపించాలని కోరిన జ‌న్ అధికార్ పార్టీ చీఫ్ ప‌ప్పూ యాద‌వ్

Hazarath Reddy

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని త‌న నివాసంలో నిన్న ఉరి వేసుకుని చ‌నిపోయిన (Sushant Singh Rajput's Death) విష‌యం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ చేసుకున్న‌ట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ హీరో మ‌ర‌ణంపై కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్‌ను మ‌ర్డ‌ర్ చేశార‌ని జ‌న్ అధికార్ పార్టీ (Jan Adhikar Party) చీఫ్ ప‌ప్పూ యాద‌వ్ ఆరోపించారు. పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లిన ప‌ప్పూ యాద‌వ్‌ (Pappu Yadav) అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ హీరో సుశాంత్‌ ఆత్మ‌హ‌త్య చేసుకునే వ్య‌క్తి కాద‌న్నాడు. సుశాంత్ మ‌ర‌ణం కేసులో సీబీఐ విచార‌ణ (CBI Inquiry) చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Sushant Singh Rajput: కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్

Team Latestly

ఒక బాలీవుడ్ యంగ్ హీరో, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరం అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాని, అతడి కుటుంబ సభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని బాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు...

Tollywood Rain Songs: ఈ వర్షాకాలంలో టాలీవుడ్ వానపాటలతో ఎంజాయ్ చేయండి.

Team Latestly

ఈ వానాకాలంలో ప్రతీ సందర్భంలో మీ మదిలోని భావాలకు అనుగుణంగా వాన పాటలు వింటూ ఉంటే ఆ మజానే వేరు. మరి ఇంకేం.. మీ ప్లేలిస్ట్ ని వాన పాటలతో నింపేయండి, సంగీత వర్షంలో తడిసి మురిసిపోండి.

S. S. Rajamouli: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి, సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్

Hazarath Reddy

తెలుగురాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి AP CM SY Jagan), కె చంద్రశేఖర్ రావులకు (TS CM KCR) టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli) ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి.. అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీల రద్దు చేయడం గొప్ప విషయమని ఏపీ సీఎంని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా రాజమౌళి పోస్ట్‌ చేశాడు.

Advertisement

#HappyBirthdayNBK: చిన్న పిల్లల మధ్య బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకను (Happy birthday Nandamuri Balakrishna) ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లలతో కలిసి ఆయన కేక్‌ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ...ఆసుపత్రి సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. వారు గొప్ప సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

Tollywood Team to Meet AP CM: విజయవాడ చేరుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఏపీ సీఎం వైయస్ జగన్‌తో మరి కాసేపట్లో భేటీ

Hazarath Reddy

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ (Tollywood) సిని పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి సినీ ప్రముఖుల బృందం రెడీ అవుతున్న సంగతి విదితమే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ షూటాంగ్ లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (AP CM YS Jagan) భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది.

Film Shootings in TS: తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు

Hazarath Reddy

కోవిడ్ 19 లాక్‌డౌన్ (COVID-19 Lockdown) కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సినిమా షూటింగ్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం (TS Govt) ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ఇచ్చింది. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు (Film Shootings in TS) కొనసాగించుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సోమవారం సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.

Meera Chopra Issue: మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి, ధన్యవాదాలు తెలిపిన టాలీవుడ్ నటి

Team Latestly

సినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని...

Advertisement
Advertisement