సినిమా

KTR On Balagam: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలతో అద్భుతమైన సినిమా తీశావ్‌.. బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

Rudra

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చక్కగా చూపించిన ‘బలగం’ సినిమా డైరెక్టర్‌ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తాను 'బలగం' సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

Keeravani on RGV: గురుభక్తి అంటే ఇదే, వర్మ లేకుంటే ఈ కీరవాణి లేడు, నా ఫస్ట్ ఆస్కార్ రామ్ గోపాల్ వర్మేనని తెలిపిన కీరవాణి, ఆర్‌జీవీ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

RRR నాటు నాటు' పాట ద్వారా మన దేశానికి ఆస్కార్ తీసుకొచ్చిన సంగీత సామ్రాట్ కీరవాణి తన గురుభక్తిని చాటుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన తొలి ఆస్కార్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను భావిస్తానని చెప్పారు.

Game Changer: 'గేమ్ చేంజర్'గా రానున్న రామ్ చరణ్.. శంకర్-చరణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించిన చిత్రబృందం

Rudra

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ15 చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది.

Nandamuri Balakrishna: మరో కొత్త అవతారమెత్తిన నందమూరి బాలకృష్ణ, ఈ సారి ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించనున్న నటసింహం

VNS

హీరో బాల‌కృష్ణకి క్రికెట్ అంటే అభిమానం. ఆయన తన కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌తో క‌లిసి క్రికెట్ ఆడారు. అటు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Advertisement

SSMB28 Update:ఈ సారి త్రివిక్రమ్‌ గట్టిగానే ప్లాన్ చేశాడు, సూపర్‌స్టార్ కొత్తమూవీ క్రేజీ అప్‌డేట్, మాస్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న మహేష్ బాబు

VNS

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ (SSMB28) వస్తుందని తెలిసినప్పటి నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్-త్రివిక్రమ్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి.

NTR Bollywood Movie: బాలీవుడ్‌ కి మన జూనియర్.. ‘ఆది పురుష్‌’ నిర్మాత భూషణ్‌ కుమార్‌తో ఎన్టీఆర్‌ మూవీ?

Rudra

తెలుగు స్టార్‌ హీరోల స్థాయి పాన్‌ ఇండియాకు చేరింది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ ఓ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Khushboo Tweet Viral: మోదీ ఇంటిపేరుపై గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఖుష్బూ.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే??

Rudra

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి.

Upasana: మెగా కోడలుకి అరుదైన గౌరవం.. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన.. విశిష్ట గుర్తింపునిచ్చిన ఎకనామిక్ టైమ్స్

Rudra

మెగా కోడలు ఉపాసన అరుదైన ఘనత సాధించారు. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది.

Advertisement

Pavan-Sai Tej Movie Update: పవన్ .. సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు.. జులై 28వ తేదీన సినిమా విడుదల

Rudra

మెగా అభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ – సాయితేజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్ లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.

Dasara Movie Promotions: నానితో కలిసి ధూమ్ ధామ్ దోస్తాన్ పాటకు స్టెప్పులేసిన రవితేజ, దసరా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న టీం

Hazarath Reddy

దసరా సినిమా ప్రమోషన్లలో నానితో పాటు హీరో రవితేజ పాల్గొన్నాడు. నానితో కలిసి చిన్న స్టెప్ వేశాడు. దసరా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు కాలు కదిపాడు. కుర్చీపై కూర్చుని ఇద్దరు హీరోలు వేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

Malli Pelli Movie: నరేశ్, పవిత్ర లోకేశ్ మళ్లీ పెళ్లి సినిమా, పోస్టర్, గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన మేకర్స్

Hazarath Reddy

టాలీవుడ్ సీనియర్ లవర్స్ నరేశ్, పవిత్ర లోకేశ్ లు జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నరేశ్ స్వయంగా తన సొంత బ్యానర్ విజయకృష్ణ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతోంది. ఈ సినిమా కన్నడలో కూడా విడుదల కానుంది.

Manchu Family War: మంచు కుటుంబంలో వార్, కొడుకు వీడియోపై మోహన్ బాబు ఆగ్రహం, వెంటనే డిలీట్ చేసిన మంచు మనోజ్, వీడియో ఘటనపై స్పందించిన మంచు విష్షు, లక్ష్మీ

Hazarath Reddy

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి కారణం మంచు మనోజ్..విష్ణు వీడియోని షేర్ చేయడమే. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది.

Advertisement

Dima Nova Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందిన ప్రముఖ పాప్ సింగర్ దిమా నోవా

Hazarath Reddy

రష్యా పాప్‌ సింగర్‌ సింగర్ దిమా నోవా(34) నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు

Ajith Kumar Father Dies: స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణ్యం మృతి, దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న సినీ ప్రముఖులు

Hazarath Reddy

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి

Pradeep Sarkar Passes Away: ‘పరిణీత’ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత.. జీర్ణించుకోలేకపోతున్నానన్న అజయ్ దేవగణ్

Rudra

బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాప్యులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Dhoom Dhaam Dhosthaan: ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్‌కు రవితేజ, నాని కలిసి డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో.. మీరూ చూడండి

Rudra

ఇద్దరు సెల్ఫ్‌ మేడ్‌ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే. ఆ ఇద్దరు హీరోలే.. రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్‌ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది.

Advertisement

Rangamartanda: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు

Rudra

'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఆయన నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.

Keerthy Suresh Drinking Video: వామ్మో కీర్తి సురేష్, ఎత్తిన కళ్లు బాటిల్‌ను దించకుండా తాగి షాకిచ్చిన మహానటి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హీరోయిన్‌ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండా తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది

Paul Grant Dies: రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన ప్రముఖ నటుడు, బ్రెయిన్ డెడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్

Hazarath Reddy

హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌ రైల్వే స్టేషన్ సమీపంలో కుప్పకూలిన ఆయన్ను.. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మార్చి 16న రైల్వే స్టేషన్ బయట పాల్ గ్రాంట్ ఉన్నట్టుండి పడిపోయారు.

Anand Mahindra Naatu Naatu Video: నాటు నాటు ఫీవర్, ఇదే లాస్ట్ ట్వీట్ అంటూ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

పారిశ్రామిక వేత్త , ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement