సినిమా

KK No More: సినీ సంగీత ప్రపంచంలో మూగబోయిన మరో గొంతుక, లెజెండ్ సింగర్​ కేకే కన్నుమూత, తెలుగులో కృష్ణకుమార్​ కున్నాత్‌ పాడిన పాటలు ఇవే..

Hazarath Reddy

సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్​ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌​ కృష్ణకుమార్​ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Krishna Birthday: సూపర్‌ స్టార్‌ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ట్వీట్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణకు ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ సీఎం జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Brahmastra: వైజాగ్‌లో రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్, గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు

Hazarath Reddy

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకున్నారు. సెప్టెంబరు 9న విడుదలకానున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ ఈవెంట్ లో రణ్ బీర్ తో పాటు 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా పాల్గొననున్నారు.

Kolkata: 15 రోజుల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్య, బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది, కోలకతాలో ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌

Hazarath Reddy

బెంగాలీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్‌(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్‌ కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

Advertisement

Anand Mahindra Tweet: సర్కారుపై ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్, న్యూ జెర్సీలో సినిమా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి చూస్తానని వెల్లడి

Hazarath Reddy

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీత గోవిందం'ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా ట్వీట్‌ చేశారు. అనుపమ్‌ తరేజా పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్‌ చేశారు.

Vijay Meets CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ నటుడు విజయ్‌, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టుగా వార్తలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాదరంగా ఆహ్వానించారు. విజయ్‌కి సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.

Kinnera Mogulaiah: పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట, వెనక్కి ఇచ్చేస్తానంటున్న కిన్నెర మొగులయ్య, నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతదని ఆవేదన వ్యక్తం చేసిన కళాకారుడు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించిన సంగతి విదితమే. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుఅందజేసింది. తాజాగా ఆయన తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు.

Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకమని తెలిపిన కరాటే కళ్యాణీ, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా అంటూ మీడియా ముందు ఫైర్

Hazarath Reddy

కరాటే కల్యాణి ఆదివారం నుంచి కనిపించకుండా పోయిందనే వార్తల నేపథ్యంలో ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చింది. తాను (Karate Kalyani) పారిపోయే రకం కాదని,ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది.

Advertisement

Chethana Raj Dies: కాస్మోటిక్‌ సర్జరీ వికటించడంతో స్టార్ నటి మృతి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించిన కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌

Hazarath Reddy

కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట.

Sarika: రూ. 3 వేల కోసం థియేటర్లో పని చేసిన స్టార్ హీరోయిన్, సంచలన నిజాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక

Hazarath Reddy

కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక లాక్‌డౌన్‌ సమయంలో కేవలం రూ. 3వేల (Earning Less Than Rs 3000) కోసం ఆమె థియేటర్‌ ఆర్టిస్టులతో​ కలిసి వర్క్‌ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. కమల్‌ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది

Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్‌ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు

Naresh. VNS

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Akshay Kumar Tests Positive: అక్షయ్‌ కుమార్‌కు మరోసారి కరోనా, మిస్ అవుతున్నా అంటూ మూవీ టీమ్‌ కు మెసేజ్, ఆందోళన బాలీవుడ్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్లు

Naresh. VNS

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar) మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. ఆయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prudiviraj) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes) కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది.

Advertisement

Sonu Sood: ఆ డబ్బంతా పేదల కోసమే ఖర్చు చేస్తా, తన స్వచ్ఛంద సంస్థ ఎలాంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉందని తెలిపిన సోనూ సూద్

Hazarath Reddy

ఆర్థిక వివరాల గురించి తాజా మీడియా సమావేశంలో సోను (Sonu Sood) వెల్లడించాడు. ఇటీవల కాలంలో తాను ప్రమోట్ చేస్తున్న పలు కంపెనీల నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు లేదా ఆస్పత్రికి నేరుగా ఇప్పిస్తున్నట్లు తెలిపాడు.

Pandit Shivkumar Sharma Dies: భారతీయ సంగీత స్వరకర్త పండిట్ శివకుమార్ శర్మ మృతి, సంతాపం తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రముఖ భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు ముంబైలో మరణించారు. శర్మ గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు మరియు డయాలసిస్ చేయించుకుంటున్నారు. 84 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.అతని దురదృష్టకర మరణం సంగీత పరిశ్రమలో శూన్యతను మిగిల్చింది.

Mahesh on Krishna Biopic: నాన్న బయోపిక్‌లో నటించే సాహసం చేయలేను, ఎందుకంటే ఆయన నా దేవుడు, ఎవరైనా చేస్తే ఫస్ట్‌ నేనే హ్యాపీగా చూస్తానంటున్న మహేష్ బాబు

Hazarath Reddy

నాన్నగారి (సూపర్‌స్టార్‌ కృష్ణ) బయోపిక్‌ (Mahesh on Krishna Biopic) ఎవరైనా చేస్తే ఫస్ట్‌ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి (Superstar Krishna Biopic Movie) ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్‌లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.

Sarkaru Vaari Paata: సర్కార్‌ వారి పాటకే కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సర్కార్‌ వారి పాట’సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు.

Advertisement

Rahul Ramakrishna: లిప్‌లాక్‌ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్‌ రామకృష్ణ, ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించిన అర్జున్ రెడ్డి ఫేం

Hazarath Reddy

Kodali Bosubabu Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి, గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నిర్మాత

Hazarath Reddy

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (Kodali Bosubabu Dies) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస.

Mahesh Gets Teary: వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు, అన్నయ్య, బీ.ఏ. రాజును గుర్తు చేసుకోని ఏడ్చినంత పని చేశాడు, సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్

Naresh. VNS

కరోనా (Corona) వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం చాలు ధైర్యంగా ముందుకెళ్లడానికి. మీ అందరికి నచ్చే సినిమా రాబోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.

Kerala: స్టార్ హీరోయిన్‌ను వేధిస్తున్న మరో స్టార్ డైరక్టర్, పోలీసులను ఆశ్రయించిన మలయాళ నటి మంజు వారియర్‌, దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

మలయాళ స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని (Sanal Kumar Sasidharan) పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement