సినిమా

ED Money Laundering Case: మనీలాండరింగ్ కేసు,శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట, ఈడీ నోటీసులపై స్టే

Hazarath Reddy

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను ఈ నెల 13వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఈడీ ఇచ్చిన నోటీసులను శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే.

Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం

Vikas M

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్‌ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Pushpa 2 Update: రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్‌ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్‌ చేశారంటూ పోస్టర్

Vikas M

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమేదేనా ఉందంటే అది పుష్ప-2: ది రూల్‌ ఒకటే.పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్‌, అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.

Congress on Jani Master Award Revoke: జానీ మాస్టర్‌కు అవార్డు రద్దుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టకూడదని స్పష్టం

Vikas M

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.

Advertisement

Sayaji Shinde Meet Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే, ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు ఇవ్వాలని సూచన

Vikas M

ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది.

NTR Speech At Devara Success Meet: చాలా సాదాసీదాగా దేవర స‌క్సెస్ మీట్, అభిమానుల గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ చెప్పిన మాట‌లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

VNS

ఎన్టీఆర్ క‌థానాయకుడిగా వ‌చ్చిన దేవ‌ర (Devara) చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా చిత్ర‌బృందం తాజాగా స‌క్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వ‌హించింది.

70th National Film Awards: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న రిషబ్ శెట్టి, కాంతార సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం

Hazarath Reddy

'కాంతారా' చిత్రంలో తన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

70th National Film Awards: ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏఆర్ రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I చిత్రానికి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారం

Hazarath Reddy

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ I' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు

Advertisement

70th National Film Awards: ఉంచై సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న సూరజ్ బర్జాత్యా

Hazarath Reddy

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు . 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఆగస్టు 2024లో ప్రకటించారు.

Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

Hazarath Reddy

హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు

Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)

Rudra

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.

Singham Again Trailer Out: అజ‌య్ దేవ్‌గ‌ణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు మూవీ

Vikas M

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్‌ శెట్టి (Rohit Shetty), అజ‌య్ దేవ్‌గ‌ణ్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా వ‌చ్చిన సింగం సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

Advertisement

Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న సినిమా

Vikas M

రంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌.

Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Hazarath Reddy

అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.

Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Big Blow to Jani Master: జానీ మాస్టర్‌ కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం

Rudra

లైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్‌ కు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్‌ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.

Advertisement

Committee Kurrollu Won Prestigious Award: వెండితెర‌, ఓటీటీల్లో అద‌ర‌గొట్టిన క‌మిటీ కుర్రోళ్లు సినిమాకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు, తొలి సినిమాకు అవార్డు కొట్టేసిన యంగ్ టీమ్

VNS

ప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా (Committee Kurrollu) దాదా సాహెబ్‌ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్‌- ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్‌ పీస్‌ ఆఫ్‌ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది.

Subhashree Car Accident: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి బిగ్‌బాస్‌-7 ఫేమ్‌ శుభశ్రీ కారును గుద్దిన బైకర్స్, తృటిలో ప్రాణాలతో బయటపట్ట నటి

Vikas M

బిగ్‌బాస్‌-7 ఫేమ్‌ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్‌ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్‌ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది.

Nagarjun Shiva Movie: శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలు, రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున, నాన్నగారి మాటలను గుర్తుచేసుకున్న కింగ్

Vikas M

తెలుగు చలన చిత్రసీమలో శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్ లో శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అనేలా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. సరిగ్గా ఇవాళ్టికి (అక్టోబరు 6) శివ సినిమా విడుదలై 35 సంవత్సరాలైందంటూ... టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు. "ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.

Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే

Arun Charagonda

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.

Advertisement
Advertisement