తాజా వార్తలు
YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్
Hazarath Reddyవిశాఖపట్నానికి చెందిన యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
Hyderabad: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి నడిరోడ్డు మీద మూవీ ఆర్టిస్ట్ పాడు పని, అడిగినందుకు మహిళా హోంగార్డ్‌పై దాడి
Hazarath Reddyమద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి నానా రభస చేసింది యువతి. తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతిని చూసి స్థానికులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మధురానగర్‌లో నడి రోడ్డుపై పుల్లుగా తాగి మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత పోలీసులకు చుక్కలు చూపించింది.
Kerala Horror: వీడియో ఇదిగో, గంట వ్యవధిలో కుటుంబంలో ఆరుమందిని చంపిన యువకుడు, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
Hazarath Reddyకేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ
Telangana: వీడియో ఇదిగో, పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన రూ.20 లక్షల నగదు, తీరా అవి నకిలీవని తెలిసాక..
Hazarath Reddyపంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు తన పొలంలో రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.
Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)
Rudraఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్ఐసీసీలో ప్రారంభమైంది.
Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు
Rudraఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.
Elephant Attack Update: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన
Rudraఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)
Rudraఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది.
World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!
Rudraయువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ను అభివృద్ధి చేశారు.
Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్ కతా, భువనేశ్వర్ ను తాకిన ప్రకంపనలు
Rudraబంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.
Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Rudraఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.
Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో సోమవారం (ఫిబ్రవరి 24) నాడు వృద్ధ దంపతులను రోడ్డు మధ్యలో దారుణంగా కొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని దారుణమైన చర్య కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి జనసమూహం ముందు వృద్ధుడిని, స్త్రీని అమానుషంగా తన్నడం మరియు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు
SLBC Tunnel Collapse Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, బిగ్గరగా అరిచినా 8 మంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Hazarath Reddyశ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి రప్పించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను సైతం రప్పించింది తెలంగాణ ప్రభుత్వం.
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్, గ్రూపు - ఎ నుంచి సెమీస్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు, బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర 112 (105) సెంచరీతో ఆకట్టుకోగా లేథమ్ 55(76) పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు.
Anjan Kumar Yadav: వీడియో ఇదిగో, సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయిన అంజన్ కుమార్ యాదవ్, రెడ్డి కొడుకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు.
Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనకకి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న న్యూజిలాండ్ స్టార్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నాయి.టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు మాత్రమే చేసింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇలాకాలో జల్లికట్టు పోటీలు, ఎద్దు ఢీకొట్డడంతో యువకుడు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.
Telangana Horror: జగిత్యాలలో దారుణం, ఆస్తి కోసం సొంత అన్నను చంపిన ఇద్దరు చెల్లెళ్లు, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు మహిళలు
Hazarath Reddyతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అన్నను ఇద్దరు చెల్లెళ్లు మట్టుబెట్టిన ఘటన పోచమ్మవాడలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు.. దాడి చేసి, హత్య చేశారు.
Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం, పూడిక తీస్తుండగా కరెంట్ షాక్, నలుగురు అక్కడికక్కడే మృతి, పెదకాకానిలో అలుముకున్న విషాద ఛాయలు
Hazarath Reddyగుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు
GV Reddy Resigns: టీడీపీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా, ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడి
Hazarath Reddyఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.