తాజా వార్తలు
Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Astrology:సెప్టెంబర్ 13న శుక్రుని రాశి మార్పు .ఈ మూడు రాశుల వారికి ఐశ్వర్యం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందానికి సంపదకు ఐశ్వర్యానికి బాధ్యత వహించే గ్రహం. శుక్రుడు రాశి మార్పు కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…
No Hidden Cameras: వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్
Hazarath Reddyగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల అంశంపై నారా లోకేష్ స్పందించారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్ ఆగ్రహం వెళ్లగక్కారు.
Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Bomb Threat to IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, నాగ్‌పుర్ లో అత్యవసరంగా దించేసిన అధికారులు
Hazarath Reddyఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో అత్యవసరంగా దించేశారు.
Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా.
sajayaఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
Hazarath Reddyతుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Andhra Pradesh: గాజువాకలో దారుణం, తాను సబ్ ఇన్స్‌పెక్టర్ ని అంటూ డెలివరీ బాయ్‌ని కారుతో ఢీకొట్టి బూతులు తిట్టిన కారు యజమాని
Hazarath Reddyడెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తి. గాజువాక - డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టిన కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి.
Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
sajayaప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.
sajayaమన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
Dallas Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా నలుగురు యువకులు మృతి
VNSఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు
Hazarath Reddyశ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
Hazarath Reddyగతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, నీట మునిగిన విజయవాడ, భారీ వర్షాలకు మంగళగిరిలో విరిగిపడిన చెట్లు , నేలకొరిగిన కరెంట్ స్తంభాలు
Hazarath Reddyభారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి , కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి.
Hyderabad Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, రాష్ డ్రైవింగ్ తో పాదచారుల దూసుకొచ్చిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం ngos కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి కారు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి
Hazarath Reddyతెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కోదాడలో భారీ వర్షానికి రెండు కార్లు కాలువలొ కొట్టుకు వచ్చాయి.. ఓ కారులో ఒకరు మృతి చెంది కనిపించారు
Kalyan Horror: ముంబైలో దారుణం, చాక్లెట్ ఆశ చూపి రెండేళ్ల పసిపాపపై కామాంధుడు అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఇటీవలి కాలంలో చిన్నారులు సహా మహిళలపై అత్యాచారాలు, హత్యలతో సహా నేరాల కేసులు పెరిగిపోతున్నాయి. తాజా ఘటనలో టిట్వాలా సమీపంలో ఓ వ్యక్తి రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. 35 ఏళ్ల నిందితుడిని కళ్యాణ్ రూరల్ పోలీసులు ఆగస్టు 30, శుక్రవారం అరెస్టు చేశారు
CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన
Arun Charagondaరాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు.
RTC Bus Stuck In Water: వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు, కాపాడండి అంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు, రాత్రి నుండి వర్షంలోనే ఉన్నామని ఆవేదన..వీడియో
Arun Charagondaమహబూబాబాద్ - నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్నారు ప్రయాణికులు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.