తాజా వార్తలు

Kidambi Srikanth With Sravya Varma: బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఆర్జీవీ మేనకోడలు-నిర్మాత ఎంగేజ్‌మెంట్, శ్రావ్య వర్మతో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్థం

Arun Charagonda

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు సినీ నిర్మాత శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఒక్కటికానున్నారు. తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు శ్రావ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు అంతా అభినందనలు చెబుతున్నారు.

Andhra Pradesh: అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!

Arun Charagonda

తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఓ అత్త. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయి ఆషాడం మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Cyber Police: ముంబై సైబర్ క్రైం పోలీస్‌ పేరుతో సైబర్ మోసం, 13 రాష్ట్రాల్లో నేరాలు, మోసగాడిని వలవేసి పట్టుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Arun Charagonda

ముంబై సైబర్ క్రైం పోలీస్‌గా నటిస్తున్న సైబర్ నేరగాన్ని వల వేసి పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. విశాఖపట్నంకు చెంది 39 ఏళ్ల షేక్ ఖలీల్ ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో డబ్బులు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

Natwar Singh Passes Away: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత.. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్‌ లో తుదిశ్వాస

Rudra

గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ (95) శనివారం రాత్రి కన్నుమూశారు.

Advertisement

Robbers Attack On Narsapur Express:నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దొంగల రాళ్లదాడి, రైల్వే బోగిల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం, లాక్ చేసి ఉండటంతో వెనుదిరిగిన దొంగలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి ప్రయత్నించారు దొంగలు. నర్సాపూర్ రైలుపై రాళ్లు రువ్వి, B1, S11, S12 కోచ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కోచ్‌ల డోర్లు లాక్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు.

Attack On YSRCP Leader: అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబ సమేతంగా దర్శనం..వీడియో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అంతకముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భట్టికి అనుకోకుండా తారసపడ్డారు మోహన్ బాబు. వీరిద్దరి కాసేపు ముచ్చటించుకున్నారు.

Nalgonda: నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు, ఈ నీటిని ఎలా త్రాగాలని స్థానికుల ఆందోళన, ఎనమిది నెలలుగా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని మండిపాటు

Arun Charagonda

నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు కలకలం రేపాయి. నల్లగొండ - నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండల కేంద్రంలో త్రాగు నీటిలో వానపాములు వచ్చాయి. వాటర్ ట్యాంకును ఎనిమిది నెలలుగా శుభ్రం చేయలేదని.. ఈ నీరు మేము తాగేదెలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

Telangana Youth Congress Elections: నేతలందరి టార్గెట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పైనే, ఆసక్తిక రంగా యూత్ కాంగ్రెస్‌ ఎన్నికలు, బహిరంగంగానే బల్మూరికి ఓటేయొద్దని చెబుతున్న ఎమ్మెల్యేలు, గెలిచేది ఎవరో!

Arun Charagonda

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులకు గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ విద్యార్థి, యువజన సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనవాయితీ.

Sircilla Viral Video: ఇదేందయ్యా.. మగవాళ్లను మాత్రమే కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు.. సిరిసిల్ల బస్టాండ్ లో ఘటన

Rudra

సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన కనిపిస్తున్నది. బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై మాత్రమే కొన్ని కాకులు దాడి చేస్తున్నాయి.

Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Rudra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది.

Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

Rudra

అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Advertisement

Sitarama project: ఆదివారం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్,15న పంప్‌హౌస్‌లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భారీ బహిరంగసభ

Arun Charagonda

ఈనెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి సీతారామ ప్రాజెక్ట్ లోని మూడు పంప్ హౌస్ లు. ఈ ఆదివారం ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ కు 67 TMC నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు చేశారు.

CM Revanth Reddy: స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు రేవంత్. తాజాగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు

Balakrishna With Chiranjeevi: ఒకే వేదికపై చిరంజీవి - బాలయ్య, అన్‌స్టాపబుల్‌ షోకి అతిథిగా మెగాస్టార్, అభిమానులకు ఖచ్చితంగా కన్నుల పండగే!

Arun Charagonda

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో టాప్ రేటింగ్‌లో ఉంది. ప్రభాస్ , పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్ వంటి ప్రముఖులు రాగా అద్భుత స్పందన వచ్చింది. ప్రతీ సీజన్‌కు రెట్టింపు రేటింగ్ రావడంతో తాజాగా నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

Health Tips: వాములో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.

sajaya

వాము మనందరికీ తెలిసిందే. వామును ప్రతి ఒక్క వంటలో వాడుకుంటా ఉంటాం. ముఖ్యంగా చిరుతిళ్ళు, పిండి వంటల్లో ఇది వాడుతూ ఉంటాం. దీన్ని ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Advertisement

Khammam: నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపు, హోటల్‌ యజమానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Arun Charagonda

ఖమ్మంలోని ఓ హోటల్ యజమానికి నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపులు కలకలం రేపాయి. మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ యాజమానిని బెదిరించిన నలుగురు దుండగులు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి సమాచారం అందించిన హోటల్ యజమాని. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు.

Google Chrome: క్రోమ్ బ్రౌజ‌ర్ యూజ‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌, అనేక బ‌గ్ లు ఉన్నాయ‌ని యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం

VNS

గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లు (Chrome BUG) ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది. గూగుల్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ను (Chrome Browser) వెంటనే అప్‌డేట్‌ చేయాలని సెర్ట్‌ ఇన్‌ (CERT-in) సూచించింది.

Ashwini Vaishnaw About New Rail Projects: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, బెంగాల్ టూ వరంగల్, భద్రాచాలం టూ తూర్పుగోదావరి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే కారిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

Romania Wrestler Injured: పారిస్ ఒలింపిక్స్ లో విషాదం, అమాంతం ఎత్తి ప‌డేసిన ప్ర‌త్య‌ర్ధి, మ‌హిళా రెజ్ల‌ర్ విరిగిపోయిందా? ఆస్ప‌త్రిలో సీరియ‌స్ కండిష‌న్ లో రెజ్ల‌ర్

VNS

ఒలింపిక్స్‌లో దేశానికి పత‌కం అందించాల‌నే ఓ రెజ్ల‌ర్ (Wreaslig) క‌ల చెదిరింది. ప్రత్య‌ర్థి అమాంతం ఎత్తి ప‌డేయంతో ఊహించ‌ని విధంగా ఆమె గాయ‌ప‌డింది. మ‌హిళ‌ల ఫ్రీ స్ట‌యిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ క‌ట‌లినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాల‌పాలైంది

Advertisement
Advertisement