తాజా వార్తలు
Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు
Hazarath Reddyబిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
Independence Day 2024: ఎర్రకోట నుండి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, నాయకత్వం వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేక అతిథులుగా 6 వేల మంది
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దేశానికి నాయకత్వం వహిస్తారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ 'విక్షిత్ భారత్ @ 2047'
Telangana Governor Quota MLC: బీఆర్ఎస్కు బిగ్ షాక్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య
Arun Charagondaసుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత
Arun Charagondaహైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‌లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ
Arun Charagondaఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్‌లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Independence Day 2024: తెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్, ఎందుకు ప్రదానం చేశారంటే..
Hazarath Reddyతెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం
Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..
Vikas Mబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్రధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.
Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Vikas Mబ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Jr NTR Road Accident: జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్, వదంతులు నమ్మొద్దని వినతి
Arun Charagondaజూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.
Independence Day Wishes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Vikas Mభారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Independence Day 2024 Wishes in Telugu: మీ స్నేహితులకు బంధుమిత్రులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి
sajayaఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఎందరో వీరుల త్యాగఫలం 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా పరిపాలించారు. వారి నుంచి మన దేశం జాతీయోద్యమం ద్వారా ఈ స్వాతంత్రాన్ని పొందడంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించింది.
Har Ghar Tiranga railey:హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, చాంద్రయణగుట్ట నుండి చార్మినార్ వరకు ర్యాలీ, వీడియో
Arun Charagondaదేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సిఆర్‌పిఎఫ్ క్యాంపస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఫలకనుమ, శాలిబండ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌పిఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.
sajayaవర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.
Independence Day 2024 Speech in Telugu: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసం
sajayaఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్కూల్లోనూ కాలేజీలోనూ కార్యాలయంలోనూ లేదా బహిరంగ ప్రదేశాల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ సులభమైన పదాలతో ఒక చక్కటి స్పీచ్ను మేము రూపొందించాం.
Independence Day 2024: హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి, అయితే మీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Arun Charagondaభారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా ప్రతి వ్యక్తి తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Delhi Excise Policy Scam Case: మధ్యంతర బెయిల్ ఇవ్వలేం, ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.
Health Tips: ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaబార్లీలో గింజలలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి, తక్షణ శక్తిని అందించడానికి ఈ బార్లీ సహకరిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Mumbai Horror: ప్రియుడు మోజులో ఘాతుకం, శివసేన సీనియర్ నేతను దారుణంగా చంపిన భార్య, డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని మరీ..
Hazarath Reddyమహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖందేశ్వర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత విష్ణు గౌలి (58) దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Telangana Shocker: దారుణం, కొడుకు జైలుకు వెళ్లాడని తల్లీకూతుళ్లతో మాట్లాడని గ్రామస్తులు, తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
Hazarath Reddyమెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఎవరూ మాట్లాడటం లేదని తల్లీకూతుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు.కాగా పది నెలల క్రితం కోడలిని హత్య చేసిన కొడుకు జైలుకు వెళ్లాడు. ఇదే కేసులో జైలుకి వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు
CM Revanth Reddy In Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెట్టుబడులే లక్ష్యంగా సాగిన రేవంత్ టూర్
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన సాగింది.