తాజా వార్తలు

IAS Transfers in Telangana: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఆరోగ్య శ్రీ సీఈవో శివకుమార్‌ స్థానంలో కర్ణన్‌

VNS

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్‌.శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

VNS

ఇల్లు లేని కుటుంబాలకు ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పకపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, రషిద్‌ బౌలింగ్‌‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద సౌమ్య సర్కార్ కు దొరికిపోయిన భారత్ స్టార్ బ్యాటర్

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ 22 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు 23వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది. రిషద్ హొస్సేన్ ఆఫ్-స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీ వేశాడు. కోహ్లీ బ్యాక్ ఫుట్ ద్వారా కట్ చేయగా బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతంలో సౌమ్య సర్కార్ సులభమైన క్యాచ్ తీసుకున్నాడు

Jaker Ali’s Stunning Pushpa Celebration: వీడియో ఇదిగో, నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్న బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ

Hazarath Reddy

చాంపియన్స్ ట్రోఫీలోనూ బన్నీ మేనియా కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తగ్గేదేలే సెలబ్రేషన్ వైరల్ అయింది. హాఫ్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను హెల్మెట్ కింద నుంచి తీసుకెళ్తూ తగ్గేదేలే పోజ్‌ను దించేశాడు జేకర్ అలీ

Advertisement

Shubman Gill Slams First Century: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, ఆరు వికెట్ల తేడాగో బంగ్లాపై భారత్ ఘన విజయం

Hazarath Reddy

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో సమగ్ర విజయాన్ని సాధించారు.భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ 101 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును ఆధిపత్య విజయానికి నడిపించాడు

Shubman Gill Six Video: వీడియో ఇదిగో, గిల్ కొట్టిన సిక్స్ దెబ్బకు ఒక్కసారిగా షాకైన రోహిత్ శర్మ, ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్

Hazarath Reddy

ఈ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కొట్టిన ఓ షాట్‌కు రోహిత్ షాక్ అయ్యాడు. బౌన్సర్‌ను వెంటనే పిక్ చేసిన గిల్.. లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో పుల్ షాట్‌గా మలిచాడు. నిల్చున్న చోటు నుంచే స్టేడియంలోకి తరలించాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది.

India Beat Bangladesh by Six Wickets: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ శుభారంభం, 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం, శుభ్‌మన్‌గిల్‌ సెంచరీతో రికార్డుల మోత

VNS

Rohit Sharma: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు

Hazarath Reddy

సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. రోహిత్‌ (Rohit Sharma) 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Advertisement

PhonePe to list On Indian Exchange: స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఫోన్ పే, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు సన్నాహాలు

VNS

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఐపీఓకు (IPO) సిద్ధమవుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (Stock market) లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. 2023లో నిర్వహించిన ఫండింగ్‌ రౌండ్‌ ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ 12 బిలియన్‌ డాలర్లుగా ఉందని కంపెనీ తెలిపింది.

Virat Kohli: చరిత్ర తిరగారాసిన విరాట్‌ కోహ్లి, అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆట‌గాడిగా రికార్డు, అజారుద్దీన రికార్డు సమం

Hazarath Reddy

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు.అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆట‌గాడిగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి స‌మం చేశాడు.

PNB Reduced Interest Rates: హోం లోన్‌, కార్‌ లోన్‌ ఉందా? మీకు గుడ్‌న్యూస్‌, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు

VNS

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank) రిటైల్‌ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్‌, ఎడ్యుకేషన్‌, పర్సనల్‌ లోన్స్‌ ఉన్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్‌బీ వడ్డీ రేట్లను సవరించింది

Mohammed Shami: రికార్డుల ఊచకోత కోసిన మొహమ్మద్ షమీ, ఏకంగా నాలుగు రికార్డులకు పాతర, బంగ్లాతో 5 వికెట్లతో దుమ్మురేపిన భారత స్పీడ్ స్టర్

Hazarath Reddy

భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి బంగ్లా వెన్నువిరిచాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లతో ప్రభంజనం సృష్టించాడు. ఈ క్రమంలో 4 పాత రికార్డులను చరిత్ర పుటల్లోకి పంపాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు, నిజం తెలిసి తల పట్టుకున్న షాపు యజమాని

Hazarath Reddy

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Mohammed Shami Wicket Video: వీడియో ఇదిగో, బంగ్లా ఓపెనర్ సౌమ్యను డకౌట్‌గా పెవిలియన్‌కి సాగనంపిన మహమ్మద్ షమీ,అధ్భుతమైన డెలివరీకి బోల్తా పడిన బంగ్లా బ్యాటర్

Hazarath Reddy

మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ అద్భుతమైన ఆరంభాన్ని సాధించింది. ఈ అనుభవజ్ఞుడైన పేసర్ బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్‌ను తొలి ఓవర్‌లోనే డకౌట్ చేయడం (Mohammed Shami Wicket) ద్వారా తక్షణ ప్రభావం చూపాడు.

Modi Fun With Pawan: హిమాలయాలకు వెళ్తున్నారా?..పవన్‌ కళ్యాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదా సంభాషణ, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఢిల్లీ 9వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా . ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

Rohit Sharma Apologises to  Axar Patel: వీడియో ఇదిగో, క్యాచ్ వదిలేసినందుకు అక్షర్ పటేల్‌కు సారీ చెప్పిన రోహిత్ శర్మ, ఈజీ క్యాచ్ డ్రాప్‌తో హ్యాట్రిక్ మిస్ చేసుకున్న భారత బౌలర్

Hazarath Reddy

గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ డెలివరీలో సింపుల్ క్యాచ్ వదిలేసిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా స్పందించాడు. ఈ తప్పు చేసిన తర్వాత, రోహిత్ శర్మ వెంటనే అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పాడు

Advertisement

Harshit Rana's First Wicket Video: వీడియో ఇదిగో, చాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి వికెట్ పడగొట్టిన హర్షిత్ రాణా, కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో

Hazarath Reddy

హర్షిత్ రాణా తన తొలి వికెట్ పడగొట్టాడు. ఇటీవల జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన గాయపడిన ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో గౌతం గంభీర్ మార్గనిర్దేశం చేసిన భారత జాతీయ క్రికెట్ జట్టులో ఈ పేస్ బౌలర్‌ను ఎంపిక చేశారు.

Rohit Sharma Makes Blunder! వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసి తల బాదుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హ్యాట్రిక్ మిస్ చేసుకున్న భారత బౌలర్ అక్షర్ పటేల్

Hazarath Reddy

ఆ ఇద్ద‌రూ కీప‌ర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.అయితే నాలుగో బంతికి జ‌కీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ మిస్ చేశాడు. ఈజీగా వ‌చ్చిన ఆ క్యాచ్‌ను అత‌ను అందుకోలేక‌పోవడంతో అక్ష‌ర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.

NTR - Neel Shoot Begins: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్!

Arun Charagonda

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా మద్యం తాగి నడిరోడ్డు మీద భార్యతో సబ్-ఇన్‌స్పెక్టర్ పాడు పని, వద్దన్నా వినకుండా దగ్గరకు లాక్కుని అసభ్యప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

మద్యం తాగి పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి ఒక మహిళను వేధిస్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. పోలీసులు విడుదల చేసిన సమాచారం తర్వాత ఆ వ్యక్తి సబ్-ఇన్‌స్పెక్టర్ అని, దాడికి గురైన మహిళ అతని భార్య అని తేలింది.

Advertisement
Advertisement