తాజా వార్తలు

Karnataka Horror: కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన రోజే విగతజీవులైన నవ దంపతులు.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. భార్యను కొడవలితో నరికిన భర్త.. అనంతరం తనూ ఆత్మహత్య.. కర్ణాటకలో దారుణం

Rudra

‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది.

Viral Video: బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.

Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.

PM Modi’s DP National Flag: ‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్‌ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్ర‌ధాని మోదీ పిలుపు

Rudra

స్వాతంత్ర్య దినోత్స‌వం సమీపిస్తున్న నేపథ్యంలో హ‌ర్‌ ఘ‌ర్‌ తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్‌ గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు.

Advertisement

Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

Rudra

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

Google Doodle 2024: ‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

Rudra

సందర్భానికి అనువుగా తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని, చిత్రాలను ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Advertisement

Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా Photo Greetings ద్వారా మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి..

sajaya

శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు, ఇందులో శివ శంభుని మెడలో చుట్టబడిన నాగదేవత పూజిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకుంటున్నారు.

Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా మీ బంధువులకు స్నేహితులకు ఇక్కడ ఉన్న Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

sajaya

నేడు అంటే 9 ఆగస్టు 2024 నాగ పంచమి. హిందూ క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి పండుగ, నాగదేవతకు అంకితం చేసిన రోజు, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. నాగ పంచమి నాడు, హిందూ గ్రంధాలలో పేర్కొన్న అన్ని రకాల పాములను మరియు ముఖ్యంగా శివుని మెడను అలంకరించే నాగ దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు.

Mahindra Classic BSA Goldstar 650: మోటార్ సైకిల్స్ రంగంలోకి మ‌హీంద్రా కంపెనీ, ఆగ‌స్ట్ 15న తొలి బైక్ ను మార్కెట్లోకి తెస్తున్న మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా

VNS

మినీ ట్రక్కులు.. ట్రాక్టర్లు, కార్ల తయారీలో పేరొందిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra)’ తాజాగా మోటారు సైకిల్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది. బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) బ్రాండ్ మద్దతుతో క్లాసిక్ లెజెండ్స్, వింటేజ్ మోటారు సైకిల్స్‌లతో భాగస్వామ్య ఒప్పందం కల మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మోటారు సైకిల్ తీసుకొస్తున్నది.

Ola To Join Quick Commerce Business: జెప్టోకు పోటీగా స‌ర్వీసులు ప్రారంభించ‌నున్న ఓలా, త్వ‌రలోనే క్విక్ డెలివ‌రీ స‌ర్వీస్ లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్నట్లు స‌మాచారం

VNS

క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) సంస్థలతో పోటీ పడేందుకు ఓలా సిద్ధమవుతున్నది. మరో దఫా క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.

Advertisement

Suma in Real Estate Fraud: రియ‌ల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంక‌ర్ సుమ క‌న‌కాల‌, సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంక‌ర్

VNS

టాలీవుడ్ బుల్లితెరపై టాప్‌ యాంకర్‌ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్‌ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.

PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియ‌న్ సీనియ‌ర్ ఆట‌గాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీల‌క నిర్ణ‌యం

VNS

పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు హై పెర్ఫార్మెన్స్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ టిమ్‌ నీల్సన్‌ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్‌ పేరును పాక్‌ టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జేసన్‌ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్‌ కలిసి గతంలో సౌత్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ అకాడమీలో పని చేశారు

Indian Foreign Ministry Statement: బంగ్లాదేశ్ పౌరుల‌కే మొద‌టి ప్రాధాన్యం, కీల‌క స్టేట్ మెంట్ ఇచ్చిన భార‌త విదేశాంగ శాఖ‌

VNS

బంగ్లాదేశ్‌ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ (Indian Foreign Ministry) కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్‌ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది.

Megastar Chiranjeevi: కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ, కేరళ వరద బాధితులకు సాయంగా రూ. కోటి చెక్ అందజేత

Arun Charagonda

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనవంతు సాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ నేపథ్యంలో స్వయంగా చెక్‌ను అందజేసేందుకు కేరళకు వచ్చారు చిరంజీవి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిశారు. అనంతరం ఆయనతో ముచ్చటించి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.

Advertisement

Pawan Kalyan: స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు..?, పవన్ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవేనా?

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కర్ణాటకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.

Kancheepuram: ఇదేం చోద్యం, దేవాలయం హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో, తమిళనాడులో మండిపడుతున్న భక్తులు

Hazarath Reddy

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు.

Vinesh Phogat: పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్‌ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.

Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు

Hazarath Reddy

మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

Advertisement
Advertisement