తాజా వార్తలు

Telangana Shocker: అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Arun Charagonda

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

BRS MLA Anil Jadav To Joins Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, త్వరలోనే చేరిక ఉండే అవకాశం?, 11వ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి?

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా?, ఓ వైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగడం లేదా?, తాజాగా 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

దొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.

Dancing With Pistol: బాలీవుడ్ సినిమా పాటకు తుపాకీ పట్టుకుని తీహార్ జైలు అధికారి డ్యాన్స్.. వేటు వేసిన ఉన్నత అధికారులు (వీడియో)

Rudra

వృతిధర్మం, విధులు, క్రమశిక్షణను మరిచి కొందరు విపరీత చర్యలకు తెగబడి చిక్కుల్లో పడతారు. ఇదీ అలాంటి ఘటనే. తుపాకీ పట్టుకుని బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్ చేసిన ఓ తీహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది.

Advertisement

Manish Sisodia: 17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో భార్యతో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా.. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛ’ అని వ్యాఖ్య

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు.

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Plane Crash in Brazil: బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)

Rudra

బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.

Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్‌ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు

Rudra

పారిస్ ఒలింపిక్స్‌ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.

Advertisement

Sobhita Dhulipala Insta Post: ఎంగేజ్ మెంట్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్, నాగ‌చైత‌న్య గురించి ఎమోష‌న‌ల్ గా ఏం రాసిందో చూడండి

VNS

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్క‌లు, స‌గానికి పైగా తినడంతో ఆడా? మ‌గా? కూడా గుర్తుపట్ట‌ని రీతిలో శిశువు మృత‌దేహం

VNS

వరంగల్‌ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు

Waqf Amendment Act 2024: వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటీలో స‌భ్యుల పేర్లు ఖ‌రారు, ప్ర‌తిప‌క్షం నుంచి ఎక్కువ మంది స‌భ్యులు, పూర్తి లిస్ట్ ఇదిగో

VNS

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను (Waqf Amendment Act) సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో జేపీసీ కమిటీపై మాట్లాడారు

SC on Hijab: కాలేజీల్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, అమ్మాయిలకు దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

క్యాంపస్‌లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.

Advertisement

Instagram Update: ఇన్ స్టాగ్రామ్ యూజ‌ర్ల‌కు బిగ్ అప్ డేట్, ఇకపై ఒకేసారి 20 ఫోటోలు అప్ లోడ్ చేయ‌వ‌చ్చు

VNS

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు (Instagram) అదిరే అప్‌డేట్.. ఎండ్‌గాడ్జెట్ నివేదిక ప్రకారం.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కరోజల్ పోస్ట్‌లో ఫొటోలు, వీడియోలను రెట్టింపు సంఖ్యలో యాడ్ చేసుకోవచ్చు. అవును.. మీరు చదివింది నిజమే. ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు

Wayanad Landslide: వయనాడ్ విలయం తర్వాత భూమి లోంచి వింత శబ్దాలు, మిస్టరీ ధ్వనులతో హడలిపోతున్న ప్రజలు, జియోలాజికల్ సర్వే ఏం చెప్పిందంటే..

Vikas M

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్నారు.

Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌, 3,000 మందికి ఉపాధి

Vikas M

అమెరికాకు చెందిన బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్‌ సిటీలో RMZ స్పైర్‌ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.

Ola Electric Bike: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రంగంలో ఓలా సంచ‌ల‌నం, త్వ‌ర‌లోనే ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ రిలీజ్ చేయ‌నున్న కంపెనీ, ఫీచ‌ర్స్ ఇవి!

VNS

ఓలా కస్టమర్లకు అదిరే న్యూస్.. భారత మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తోంది. ఆగస్టు 15న తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించే “సంకల్ప్ 2024” అనే వార్షిక కార్యక్రమంలో ఓలా ఈవీ బైక్ ( (Ola Electric Bike)) లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్

Vikas M

ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు

India vs China: చైనాకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న భారత్, ఈ ఏడాది టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేయనున్న ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్‌గా..

Vikas M

ద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.

NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..

Hazarath Reddy

భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది

Reliance Industries Layoffs: ఆదాయం తగ్గిందని 42 వేల మంది ఉద్యోగులను తీసేసిన రిలయన్స్, నియామకాలను కూడా తగ్గించిన ముఖేష్ అంబానీ కంపెనీ

Vikas M

భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం లేదా 42,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకుంది. కంపెనీ తన నియామక వేగాన్ని కూడా తగ్గించింది, ఈ సంవత్సరంలో దాదాపు 171,000 కొత్త ఉద్యోగులను తీసుకువచ్చింది.

Advertisement
Advertisement