India
Vijay At Keerthi Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కీర్తి..డ్రీమ్ ఐకాన్ అంటూ ప్రశంసలు
Arun Charagondaఇటీవలె నటి కీర్తి సురేశ్ - ఆంటోని తట్టిల్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సందడి చేశారు దళపతి విజయ్. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటూ విజయ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు కీర్తి. హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకుంది ఈ జంట.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, స్నానం చేసే సమయంలో కాటు వేసిన పాము..పెద్దాపూర్ గురుకులంలో ఘటన, వీడియో
Arun Charagondaగురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు కలకలం రేపింది. జగిత్యాల - పెద్దాపూర్ 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము. హుటాహుటిన విద్యార్దిని ఆస్పత్రికి తరలించగా 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోంది చికిత్స.
Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
‘The Raja Saab’: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్..టీజర్ పై టీం ఏమందంటే?
VNSరాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.
Folk Singer Shruthi Dies by Suicide: వరకట్న వేధింపులకు సింగర్ మృతి, పెళ్లైన 20 రోజులకే అత్తవారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య
VNS20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం (Dowry) తీసుకురావాలని అత్తమామలు వేధించారు.
Sunita Williams Return Delayed Again: సునితా విలియమ్స్ ఇప్పట్లో భూమి పైకి రావడం కష్టమే! మరోసారి సాంకేతిక కారణాలతో మిషన్ ఆలస్యం
VNSభారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams) రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా (NASA) షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే (ISS) నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.
Cherlapally Terminal: చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు. ఈ నెల 28న రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
VNSసికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ (Railway Ministry) అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం
VNSఫేక్ లేదా హానికరమైన క్యూఆర్ కోడ్ అందిస్తారు. తరచుగా లోకల్ స్టోర్లు, డెలివరీ సర్వీసులు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి ప్రదేశాలలో ఈ క్యూఆర్ కోడ్ మోసాలకు ఎక్కువగా అవకాశం ఉంది.
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, జేపీసీ సభ్యులుగా ప్రియాంక గాంధీ వాద్రాతో సహా 31 మంది నియామకం
Hazarath Reddyవన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యులుగా లోక్ సభ నుండి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. వీరిలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ JPC సభ్యులుగా ఉన్నారు.
Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
Hazarath Reddyముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకున్న సంగతి విదితమే. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెట్ ఐలాండ్‌కు 99 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
Hyderabad: విగ్గులు మారుస్తూ 50 మంది యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఘనుడు, మహిళా డాక్టర్ ని రూ.50 లక్షల మేర మోసం చేయడంతో ఘటన వెలుగులోకి..
Hazarath Reddyహైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేశాడు. ప్రస్తుతం అతడి కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్న వంశీ
Folk Singer Dies by Suicide: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఫోక్ సింగర్ ఆత్మహత్య, ప్రేమించి పెళ్ళి చేసుకుంటే భర్త, అత్త మామల నుంచి కట్నం వేధింపులు
Hazarath Reddyఅత్తింటి వేధింపులు తట్టుకోలేక సిద్దిపేటకు చెందిన ఫోక్ సింగ్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన దయాకర్‌ను శృతిని ప్రేమించింది. వారికి 20 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది...
Mufasa: The Lion King: ముఫాసాలానే నన్ను కూడా నాన్న పెంచారు, తండ్రి మహేష్ బాబుపై సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyడిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది.
Rajamouli Dance Video: రాజమౌళి డ్యాన్స్ వీడియో జోరు ఇంకా తగ్గడం లేదుగా, సోషల్ మీడియాని ఊపేస్తున్న జక్కన్న డ్యాన్స్ వీడియోలు
Hazarath Reddyసంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా(Sri Simha Wedding) పెళ్లి వేడుకలో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.
Virender Sehwag Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు
Mumbai Boat Capsize: వీడియో ఇదిగో, ముంబైలో ఘోర పడవ ప్రమాదం, 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా, ఒకరు మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెట్ ఐలాండ్‌కు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
Greater Noida Shocker: వీడియో ఇదిగో, పిల్లల గొడవలో దూరిన తల్లులు, ఓ పిల్లాడిని చెంప దెబ్బ కొట్టడంతో తీవ్ర గాయాలు
Hazarath Reddyరెసిడెన్షియల్ సొసైటీలో పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ త్వరగా షాకింగ్ వాగ్వాదానికి దారితీసింది, ఒక తల్లి ఆరోపించిన 6 ఏళ్ల బాలుడిని చాలా గట్టిగా కొట్టడంతో అది కనిపించే గాయాన్ని మిగిల్చింది. ఇద్దరు పిల్లల మధ్య విబేధాలు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Ghaziabad Shocker: ఆర్థిక ఇబ్బందులతో భార్యతో సహా వ్యాపారవేత్త ఆత్మహత్య, యూపీలో విషాదకర ఘటన
Hazarath Reddyడిసెంబర్ 18, బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వ్యాపారవేత్త, అతని భార్య ఆత్మహత్య చేసుకుని మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మృతులను పంకజ్ గుప్తా మరియు రీనా గుప్తాగా గుర్తించారు. షాలిమార్ గార్డెన్ ప్రాంతంలోని వారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌లకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి
Uttarakhand Girls Fight Video: ప్రియుడు కోసం రోడ్డు మీద తన్నుకున్న అమ్మాయిలు, ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్న వీడియో వైరల్
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బహిరంగంగా ఓ అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు గొడవకు దిగారు. డెహ్రాడూన్‌లో అమ్మాయిల గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇద్దరు అమ్మాయిల మధ్య తీవ్ర వాగ్వాదం, రద్దీగా ఉండే రహదారిపై శారీరక వాగ్వాదానికి దారితీసింది