India

Tamil Nadu Rains: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై (Chennai)కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

Tirumala: తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత

Arun Charagonda

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు.

Avanthi Srinivas: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రాజీనామా లేఖను జగన్‌కు పంపించిన అవంతి..జనసేనలో చేరే అవకాశం!

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన...తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.

Manchu Lakshmi: ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మీ వేదాంతం, ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్‌

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి నోట వేదాంతం వల్లించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన మోహన్ బాబు మాటలకు కూతురు లక్ష్మి ఇలా వేదాంతం వల్లిస్తుందని అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Maharashtra: అమానుషం..చనిపోయిన మహిళ చేతి బంగారు గాజులు దొంగతనం, రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి...షాకింగ్ వీడియో

Arun Charagonda

మహారాష్ట్రలో అమానుషం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన మహిళ చేతి గాజులు చోరీకి పాల్పడగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. ముంబై-కుర్లా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి.. 49 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్‌లో సంచలనం, పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికా... మరెన్నో సంచలనలు, వివరాలివిగో

Arun Charagonda

ప్రపంచంలో క్రికెట్‌కు ఉండే ఆదరణ ఇంత కాదు. కోట్లాది మంది క్రికెట్‌ను ఇప్పటికీ వీక్షిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే అంతే. టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇక ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే

Telangana Shocker: ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి, ట్రేడింగ్‌లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి

Arun Charagonda

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి అయింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) అప్పు చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. అందులో నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువవడంతో తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగాడు.వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు.

Warangal: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి, మాదన్నపేట చెరువు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు...వీడియో

Arun Charagonda

వరంగల్ - నర్సంపేట పట్టణంలో నర్సింహులు పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా.. మరో యువకుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

Arun Charagonda

నటుడు మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. సీపీ నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్‌కు వచ్చిన విష్ణును గంటన్నర సేపు విచారించారు సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి...శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు, జర్నలిస్టుపై దాడి ఘటనలో బీఎన్‌ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసుగా మారుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నంగా మారుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు.

CM Revanth Reddy: UPSC విజేతలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ నుంచి #UPSC సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు

KTR Open Letter To Rahul Gandhi: మూట‌ల‌పై ఉన్న శ్ర‌ద్థ‌, మీరిచ్చిన మాట‌ల‌పై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

VNS

చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు.

Advertisement

Manchu Manoj Bindover: మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం, రాచ‌కొండ క‌మిష‌న‌ర్ ముందు మంచు మ‌నోజ్ బైండోవ‌ర్

VNS

మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.

Droupadi Murmu Telangana Tour: తెలంగాణ‌లో రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న ఖరారు, మ‌హిళావ‌ర్సిటీతో పాటూ ప‌లు ప్రాంతాల్లో టూర్

VNS

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు

Cold Wave in Telugu States: హైద‌రాబాద్ గ‌జ‌గ‌జ‌, రాబోయే రోజుల్లో మ‌రింత చలి తీవ్ర‌త పెరిగే అవ‌కాశం, ఏపీలోనూ పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

VNS

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు.

PF Withdrawal from ATMs: వచ్చే ఏడాది నుంచి నేరుగా ఏటీఎంల నుంచే పీఎఫ్‌ విత్‌డ్రా, IT వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోన్న కార్మిక మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

భారత శ్రామికశక్తికి మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన IT వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో చందాదారులు వచ్చే ఏడాది నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్స్ నేరుగా ఏటీఎంల నుంచే విత్‌డ్రా చేసుకోవచ్చని ల్యాబౌట్ సెక్రటరీ సుమితా దావ్రా బుధవారం తెలిపారు.

Advertisement

AP SSC Exam Date 2025: ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలో ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు.

Mohan Babu Health Update: మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు, మరో రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడి

Hazarath Reddy

మోహన్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మోహన్ బాబు ఎడమవైపు కంటి కింద గాయాలు అయ్యాయని తెలిపారు. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్‌కి వచ్చేటప్పటికి మోహన్ బాబు హైబీపీతో బాధ పడుతున్నారు.

Kurla Bus Accident Video: కుర్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంకు నిమిషాల ముందు వీడియో ఇదిగో, ప్రయాణికులకు కండక్టర్ టికెట్లు ఇస్తుండగా ఒక్కసారిగా కుదుపులు

Hazarath Reddy

డిసెంబరు 9, సోమవారం రాత్రి ముంబైలో జరిగిన భయంకరమైన కుర్లా బెస్ట్ బస్సు ప్రమాదం జరగడానికి నిమిషాల ముందు షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ క్లిప్‌లో, ప్రయాణీకులు తమ ప్రయాణం సాగించడం చూడవచ్చు.

Hyderabad Fire: వీడియో ఇదిగో, హైదరాబాద్‌ నాంపల్లి పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, పరుగులు పెట్టిన స్థానికులు, నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత

Hazarath Reddy

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ సమయంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.

Advertisement
Advertisement