India
Andhra Pradesh Shocker: చిన్నారిని చిధిమేసిన మూఢనమ్మకం, 40 రోజులుగా ఉపవాసం ఉంటూ చర్చిలో ప్రార్థనలు..చివరకు చర్చిలోనే ప్రాణం విడిచిన చిన్నారి
Arun Charagondaమూఢనమ్మకం చిన్నారిని చిదిమేసింది. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మిల కూతురు భవ్యశ్రీ(8)కి బ్రెయిన్ ట్యూమర్.. వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు.సర్జరీ చేస్తే చిన్నారి బతకదని తల్లిదండ్రులు భయపడ్డారు. దానికి తోడు సర్జరీ చేసేంత డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేశారు. చివరికి చిన్నారి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.
Kakani vs Somireddy: నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా, మూడేండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్న సంజయ్..వీడియో
Arun Charagondaరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.
Syria War: సిరియా నుంచి 75 మంది భారతీయులు సురక్షితంగా బయటకు, లెబనాన్‌కు తరలించామని తెలిపిన భారత విదేశాంగ శాఖ
Hazarath Reddyసిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తిరుగుబాటు దళాలు (Syria rebels) సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్ అసద్ (Bashar Al-Assad) ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Telangana: రైల్వే పట్టాలపై పులి సంచారం, వీడియో తీసిన రైల్వే అధికారులు...కొమురం భీం జిల్లాలో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaకొమురం భీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వేంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రైల్వే సిబ్బందికి పులి కంట పడింది. పులి రైల్వే ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికలను ఒంటరిగానే తేల్చుకుంటాం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, ఇండియా కూటమితో కలిసేది లేదని స్పష్టం
Hazarath Reddyవచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరిదశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కల్తీ పాలదందా...1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాల తయారీ...20 ఏళ్లుగా ఇదే దందా చేస్తున్న వ్యాపారి...వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా గుట్టు రట్టు అయింది. 1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ చేస్తున్నారు ఓ వ్యాపారీ. 20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్నారు వ్యాపారి అజయ్ అగర్వాల్. కెమికల్స్‌తో స్వయంగా పాలను అధికారులు తయారు చేయగా స్థానికులు మండిపడుతున్నారు.
Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి
Hazarath Reddyతండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు.
Siyaram Baba Dies: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సియారామ్ బాబా కన్నుమూత, 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన బాబాగా గుర్తింపు, అంత్యక్రియలకు హాజరుకానున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Hazarath Reddyనర్మదా పుత్రుడు అని పిలువబడే ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు సియారామ్ బాబా మధ్యప్రదేశ్‌లో డిసెంబర్ 11 బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సియారామ్ బాబా ఈరోజు ఉదయం 6:10 గంటలకు తుదిశ్వాస విడిచారు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాబా అని నమ్ముతారు,
Telangana: నల్గొండలో దారుణం, భూ వివాదం..గొడ్డలితో దాడి చేసుకున్న అన్నదమ్ముల పిల్లలు...వీడియో ఇదిగో
Arun Charagondaభూవివాదం నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసుకున్నారు సొంత అన్నదమ్ముల పిల్లలు. ఈ ఘటనలో నలుగురికి గాయాలుకాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఘటన చోటు చేసుకోగా గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తిప్పర్తి పోలీసులు.
Sobhita Dhulipala :పెళ్లికూతురిగా శోభిత ధూళిపాళ మాస్ స్టెప్పులు..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaడిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగిన తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తాజాగా తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రద్ధా, నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోంది అంటూ తన స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం, రొయ్యల చెరువు ఫోటోలు తీస్తున్నారని యువకుడిని స్తంబానికి కట్టేసి కొట్టిన రైతులు..వీడియో ఇదిగో
Arun Charagondaడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. అయితే సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న చిక్కం వీరదుర్గాప్రసాద్ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.
Mohan babu: వీడియో ఇదిగో...ఆస్పత్రిలో మోహన్ బాబు...పోలీస్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం!
Arun Charagondaగచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ఇవాళ ఉదయం పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని పహాడిషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు.
Madhya Pradesh: ఇంటర్ విద్యార్థి అద్భుతం..మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి అద్భుతం సృష్టించాడు. గ్వాలియర్‌కు చెందిన మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారీ చేశాడు. దీనికి MLDT 01 అని పేరు పెట్టారు. ఇది 60 కిమీల వేగంతో 80kgs బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలగదు. 3 నెలల పాటు శ్రమించి రూ.3.5లక్షల వ్యయంతో ఈ డ్రోన్‌ను సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Manchu Family Dispute: మోహన్ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ
Arun Charagondaమీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
Bihar: రీల్స్ పిచ్చిలో ప్రమాదకర స్టంట్లు, రన్నింగ్ బైక్‌పై పుషప్స్..కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్..వీడియో ఇదిగో
Arun Charagondaరీల్స్ పిచ్చితో ప్రమాదకర స్టంట్లు చేశాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం కదులుతున్న బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
India Alliance: ఈవీఎంల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణ
Arun CharagondaEVMల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది INDIA కూటమి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో NDA రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది ఇండియా కూటమి.
Manchu Family Dispute: రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు
Arun Charagondaసినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మనోజ్‌ను భద్రతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత చిరిగిన చొక్కాతో మనోజ్ రావడం, మీడియాను లోపలికి తీసుకెళ్లడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
CM Revanth Reddy: ఢీల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు