India
Karimnagar Shocker: కరీంనగర్ జిల్లా కశ్మీర్ గడ్డలో దారుణం..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaకరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు. అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Honda Amaze 2024: హోండా నుంచి అమేజ్ 2024 వచ్చేసింది, ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyహోండా కార్స్ ఇండియా హోండా అమేజ్ 2024 ను ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. రేంజ్-టాపింగ్ వేరియంట్ రూ. 10.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. అమేజ్ ఇప్పుడు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలను (ADAS) అందిస్తున్న దేశంలోనే అత్యంత సరసమైన కారుగా చెప్పుకోవచ్చు.
Hero Vida V2 E-Scooter: హీరో నుంచి ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు, ధర రూ. 96 వేల నుంచి ప్రారంభం, అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyప్రముఖ వాహన తయారీ దిగ్గజం హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు
Hazarath Reddyనల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్ షోలో పుష్ప 2 ది రూల్ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.
Harishrao: తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట, ఆయన్ని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్‌కు నోటీసులు
Arun Charagondaతెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని క్వాష్ పిటిషన్ దాఖల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం..ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
Chalamalasetty Ramesh Babu: వెనక్కి తగ్గిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్.. పుష్ప 2 సినిమాపై తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన..వీడియో ఇదిగో
Arun Charagondaపుష్ప-2 సినిమా పై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా జనసేన నేత చలమలశెట్టి రమేశ్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పోకడ జనసైనికులు, మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని... పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని లేదంటే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు రమేశ్ బాబు.
Sree Leela At Pushpa 2 Theatre: పుష్ప -2...థియేటర్లో శ్రీలీల సందడి, అభిమానులతో కలిసి సినిమా చూసిన శ్రీలీల...బాలనగర్ విమల్ థియేటర్‌లో అభిమానుల హంగామా..వీడియో ఇదిగో
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా పండగ వాతావరణం నెలకొంది. 'పుష్ప-2' ప్రీమియర్ షో చూసేందుకు హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్ బాలానగర్‌లోని విమల్ థియేటర వెళ్లారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు నగరంలోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు చూస్తున్నారు.
Naga Chaitanya – Shobitha Wedding Video: వీడియో ఇదిగో..శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య...ఈలల వేస్తూ హంగామా చేసిన అఖిల్...కుటుంబ సభ్యుల ఆనందం చూడండి
Arun Charagondaఅక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి వేడుకును చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితుల, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా పండుగ వాతావరణం నెలకొంది.
KTR On Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.
TTD: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు, ఆక్రమణలు గుర్తించిన చైర్మన్..నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaటీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వరాహస్వామి అతిథిగృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించారు. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించారు. అనాధికార హాకర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను అదేశింశారు. టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం..కౌశిక్ ఇంటికి పోలీసులు..వీడియో ఇదిగో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐపై దుర్భాషలాడాడని..ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
SI Suicide Case: ఎస్‌ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు, యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ
Arun Charagondaములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
TDP Vs YCP At Pushpa 2 Theatre: తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ, పుష్ప 2 థియేటర్ వద్ద కొట్టుకున్న ఇరు పార్టీల నేతలు..కర్రలు, రాళ్లతో దాడి వీడియో ఇదిగో
Arun Charagonda'పుష్ప 2' థియేటర్ వద్ద టీడీపీ, వైసీపీ నేతలు కొట్టుకున్నారు. తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద 'పుష్ప-2' సినిమాకు సపోర్టుగా వెలిశాయి వైసీపీ నేతల ఫ్లెక్సీలు. బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో రాళ్లు, కర్రలు, వేడి నీటితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
France: ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కొల్పోయిన మిచెల్ బార్నియర్..60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Arun Charagondaఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ప్రధాని మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి.
Pushpa 2 Review: పుష్ప 2 మూవీ రివ్యూ, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో.. నట విశ్వరూపం చూపించిన బన్నీ, జాతర ఎపిసోడ్ సినిమాకే హైలైట్
Arun Charagondaప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతుండగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోండగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా పుష్ప 2 ప్రేక్షకులను అలరించిందా?, అల్లు అర్జున్ మరోసారి మేజిక్ చేశాడా చూద్దాం..
CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్
Arun Charagondaఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Pushpa 2: పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళా ప్రేక్షకురాలి మృతి...అపస్మారక స్థితిలోకి చిన్నారి..వీడియో ఇదిగో
Arun Charagondaమహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది పుష్ప 2 సినిమా. దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది.
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు..
Principal Forces Teacher To Drink Alcohol: నాతో కలిసి మందు, సిగిరెట్ తాగుతావా? లేదా?.. మధ్యప్రదేశ్ లో టీచర్ ను రెండేళ్లుగా వేధిస్తున్న కీచక ప్రిన్సిపాల్
VNSస్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. (Principal Forces Teacher To Drink Alcohol ) తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్‌లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు. ఆ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేని ఆ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Pushpa 2: The Rule: పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం
Hazarath Reddyఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు.