India
Jagan Meeting With Party Leaders: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి, ఇకపై కార్యకర్తలతోనే ఉంటానని స్పష్టం చేసిన వైఎస్ జగన్
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు
Hardik Pandya: వీడియో ఇదిగో, ఒకే ఓవర్లో 28 పరుగులు బాదిన హార్ఠిక్ పాండ్యా, కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు
Hazarath Reddyబరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు.ఇటీవల త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పర్వేజ్ సుల్తాన్ వేసిన ఒక ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. ఆఫ్‌సైడ్‌లో మూడు సిక్సర్లు లెగ్ సైడ్‌లో ఒక భారీ హిట్‌తో, పాండ్యా కేవలం నాలుగు బంతుల్లో 24 పరుగులు సాధించాడు
Komatireddy: గురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి ఆగ్రహం..నాసిరకం వంటకాలు, భోజనంలో నాణ్యత లేదని అధికారులపై ఫైర్..
Arun Charagondaగురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం చేశారు.
Thummala Nageswara Rao: రైతు బందు బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వం.. రైతు బంధు స్థానంలో బోనస్...మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు...రైతులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తామని కామెంట్స్
Arun Charagondaరైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు...ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు.. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము అన్నారు.
ICC Champions Trophy 2025: టీమిండియాను పాకిస్తాన్ పంపే ప్రసక్తి లేదు, మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎమ్‌ఈఏ, ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని తెలిపిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
Hazarath Reddyవచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని తెలిపారు
Samantha Father Passes Away: నటి సమంత ఇంట విషాదం..సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..నాన్నను ఇక కలవలేను అని సోషల్ మీడియా ద్వారా సమంత వెల్లడి
Arun Charagondaనటి సమంత ఇంట విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వార స్వయంగా వెల్లడించారు సమంత. నాన్నను ఇక కలవలేను అని కన్నీటి పర్యంతం అయ్యారు.
Smuggling Ration Rice in Kakinada: బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ? కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh: కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్
Hazarath Reddyకాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు
Telangana: డివైడర్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...20 మందికి తీవ్ర గాయాలు, ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు..వీడియో ఇదిగో
Arun Charagondaసంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది,ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫానుతో వణుకుతున్న తమిళనాడు, ఏపీలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం సైక్లోన్ ఎక్కడ ఉందంటే..
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Keerthy Suresh: వచ్చే నెలలో గోవాలో నా పెళ్లి..తిరుమలలో క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం..వీడియో ఇదిగో
Arun Charagondaవచ్చే నెలలో గోవాలో తన వివాహం జరగనుందని తేల్చిచెప్పారు నటి కీర్తి సురేశ్. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల అవుతుందని తెలిపారు. అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని నటి కీర్తిసురేశ్ తెలిపారు.
Cyclone Fengal Live Tracker: రానున్న 3 గంటల్లో ఫెంగల్ తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం, ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తీవ్ర అల్పపీడనం
Hazarath Reddyశుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు IMD విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ఈ వ్యవస్థ ట్రింకోమలీకి ఈశాన్యంగా 290 కి.మీ, నాగపట్టణానికి తూర్పున 290 కి.మీ, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 320 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 340 కి.మీ దూరంలో ఉంది.
Harishrao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..దొంగలను తిరిగి పార్టీలోకి చేర్చుకోమన్న హరీశ్ రావు...కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరం కాదు..టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించామన్న హరీశ్
Arun Charagondaఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు..నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చాం అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకంలో రాశారు అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట దీక్షా దివస్‌లో మాట్లాడిన హరీశ్ రావు..తెలుగుదేశం పార్టీతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అన్నారు.
Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి విగ్రహంతో మాజీ హోంగార్డు దీక్ష, హోంగార్డు వ్యవస్థను పర్మినెంట్ చేయాలని డిమాండ్..వీడియో ఇదిగో
Arun Charagondaహోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని తన నివాసంలో రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ దీక్ష చేపట్టారు.వచ్చేనెల 6వ తేదిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భవ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంచనాలతో జరపాలని, హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరసన తెలియజేసినందుకు సకినాల నారాయణను ఉద్యోగం నుండి తొలగించింది కేసీఆర్ సర్కార్.
Andhra Pradesh: వీడియో ఇదిగో, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పిఠాపురం వాసులు, వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
Hazarath Reddyరాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ, పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగారు..సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమా పై బాధితులు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు .అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు
Honda Activa E Scooter: హోండా నుంచి యాక్టివా ఈ-స్కూటర్, జనవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyహోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలోని EV ద్విచక్ర వాహనాల్లోకి అధికారికంగా ప్రవేశించింది, ఇది దాని ఐకానిక్ యాక్టివా స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను Activa e అని పిలుస్తారు, దానితో పాటు QC1 అని పిలువబడే మరొక మోడల్‌ను బుధవారం ప్రారంభించింది
Nagarkurnool: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత, తిమ్మాజీపేట స్కూల్‌లో ఘటన..వెంటనే డాక్టర్లను పిలిచి చికిత్స చేయించిన టీచర్లు
Arun Charagondaమధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. టమాటో రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స చేయించారు.
Audi Q7 launched in India: ఆడి క్యూ7 భారత మార్కెట్లోకి వచ్చేసింది, ధర రూ. 88.66 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyజర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, ఆడి తన మూడు వరుసల SUV, Q7 యొక్క ఆధునీకరించబడిన వెర్షన్‌ను విడుదల చేసింది. 2025 ఆడి క్యూ7 భారతదేశంలోరూ.88.66 లక్షలకు విడుదల చేయబడింది , ఎక్స్-షోరూమ్ మరియు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.