India
Jio Diwali Offer: జియో నుంచి దీపావళి స్పెషల్ ఆఫర్, 28 రోజుల వ్యాలిడిటీతో రూ.153 రీఛార్జ్ ప్లాన్, అపరిమిత ఉచిత కాల్స్
Vikas Mదేశీయ టెలికం దిగ్గజం జియో దీపావళి సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జియోఫోన్ యూజర్లకు సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో యూజర్లు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.
Visa Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1,400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డిట్ కార్డ్ సర్వీస్ కార్పొరేషన్ వీసా ఇంక్
Vikas Mఅమెరికాకు చెందిన క్రెడిట్ కార్డ్ సర్వీస్ కార్పొరేషన్ వీసా ఇంక్.. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,400 మంది ఉద్యోగులు, కాంట్రాక్టర్లను తొలగించాలని యోచిస్తోంది. US బహుళజాతి చెల్లింపు కార్డ్ సేవల ప్రదాత తన అంతర్జాతీయ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా ఈ వ్యక్తులను తొలగిస్తుంది
Dropbox Layoffs: ఆగని లేఆప్స్, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డ్రాప్‌బాక్స్
Vikas Mడ్రాప్‌బాక్స్ తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నిర్ణయం వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. నివేదికల ప్రకారం, ప్రభావిత ఉద్యోగులు విభజన, ఈక్విటీ మరియు పరివర్తన చెల్లింపులను అందుకుంటారు.
Nishadh Yusuf Dies: అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించిన స్టార్ ఎడిటర్, నిషాద్ యూసుఫ్ మృతిపై సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mతమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Flash Floods in Spain: వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియో ఇదిగో, స్పెయిన్ దేశాన్ని వణికించిన ఆకస్మిక వరదలు
Vikas Mస్పెయిన్‌లోని వాలెన్సియాలో సంభవించిన ఆకస్మిక వరదలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. మరెంతోమంది గల్లంతయ్యారు. వందలాది కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
B.R. Naidu as TTD chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు,పూర్తి లిస్టు ఇదిగో..
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో TTD పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Ayodhya Deepotsav 2024: వీడియో ఇదిగో, లక్షలాది దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య రామాలయం, సరయూ నది ఒడ్డున ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలు
Hazarath Reddyదీపావళి పండగకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ (బుధవారం) ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. గిన్నీస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు.
Ayodhya Deepotsav 2024: అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద లేజర్ మరియు లైట్ షో జరుగుతోంది. ఘాట్ దీపాలు మరియు రంగురంగుల లైట్లతో, రామ్ లీలా గురించి సౌండ్-లైట్ షో ద్వారా వివరించబడుతోంది. డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
Diwali 2024: భారత ఆర్మీ సైనికులు దీపావళి సెలబ్రేషన్స్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తూ క్రాకర్లు పేల్చి మట్టి దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్న ఇండియన్ ఆర్మీ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారత ఆర్మీ సైనికులు క్రాకర్లు పేల్చి మట్టి దీపాలను వెలిగించి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
Youtuber Harsha Sai: లైంగిక వేధింపుల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్, తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి
Arun Charagondaయూట్యూబర్ హర్షసాయికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్ట్‌ను ఆశ్రయించారు హర్షసాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Free Gas Cylinders Scheme: ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Hazarath Reddyదీపం-2 కింద నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయి, నాలుగు నెలల వ్యవధిలో ఇవి అందించబడతాయి. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ముందస్తుగా చెల్లించాలని భావిస్తున్నారు. రాష్ట్రం వాటిని 48 గంటల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రీయింబర్స్‌మెంట్‌లో రూ. 876 ఉంటుంది, మిగిలిన రూ. 25 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా కవర్ చేస్తుంది
TSPSC Group 3 Exam Date 2024: వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది.
Telangana: లోక కళ్యాణం కోసం ఆత్మార్పణం చేసుకుంటా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని మహిళా అఘోరీ సంచలన కామెంట్
Arun Charagondaలోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది మహిళా అఘోరీ. వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడిన మహిళా అఘోరీ..వేములవాడ ఆలయంలో చాలా ఏళ్లుగా ఉన్న దర్గాని కూలగొట్టాలని కామెంట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని ప్రకటించారు.
Minister Komatireddy: మనసున్న మారాజు మంత్రి కోమటిరెడ్డి, పేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచిన వెంకట్‌రెడ్డి, ఎంబీబీఎస్ చదువుకు చేయూత
Arun Charagondaపేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ కి చెందిన కాట్రాజ్ సుమలత ఇటీవల MBBS సీటు సాధించింది. కాలేజీ ఫీజు కట్టేందుకు సుమలత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసుకున్నారు. సుమలత చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కోమటిరెడ్డి హామీనిచ్చారు
Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.
Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్
Hazarath Reddyనిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
Telangana Caste Census: నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో హస్తం నేతలు!
Arun Charagondaదేశంలో తొలిసారిగా నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
MLA Medipalli Satyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్, రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తి, లండన్ నుండి ఫోన్..లుక్ ఔట్ నోటీసులు జారీ
Arun Charagondaకరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ అందుకున్నారు ఎమ్మెల్యే సత్యం. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ హెచ్చరించారు.
Harishrao: హైదరాబాద్‌లో సముద్రమా?, ప్రజలంతా నవ్వుకుంటున్నారు..రేవంత్ రెడ్డి సీఎం కాదు జోకర్ మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ భిక్షతోనే సీఎంగా రేవంత్ రెడ్డి
Arun Charagondaకేసీఆర్ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్ రావు...రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు...దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు...తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు.