India
Crown Of Maa Kali Stolen: ప్రధాని మోదీ బహూకరించిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.. బంగ్లాదేశ్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraదేశవ్యాప్తంగానే కాదు బంగ్లాదేశ్ లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. అయితే, బంగ్లాలోని సత్ ఖిరా నగరంలోని శ్యామ్ నగర్ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం చోరీకి గురైంది.
Nampally Exhibition Ground: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉద్రిక్తత, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. మొదట కరెంట్ కటచేసి, సీసీ కెమెరాలు విరగగొట్టి అమ్మవారి విగ్రహం ద్వంసం చేశారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు బేగంబజార్ పోలీసులు.
Cooking Oil At Low Prices: రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు
Rudraపండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.
Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
Man Serves Tea Mixed With His Spit: పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో)
Rudraఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.
Heavy Traffic at Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)
Rudraదసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే.
Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Rudraదక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Star Health Data Breach: మీరు స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ వినియోగదారులా? అయితే మీ వ్యక్తిగత డాటా మొత్తం ఇంటర్నెట్ లో ఉంది. ఏకంగా 3.1 కోటి మంది డాటా బహిర్గతం
VNSస్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు (Star Health) చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా (data breach) ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్‌జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.
Uttar Pradesh Road Accident: వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఎగసిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అక్టోబర్ 9 అర్థరాత్రి రెండు ట్రక్కుల మధ్య ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన అగ్నిప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. చుట్టుపక్కలవారు భయాందోళనతో చూశారు.
Ratan Tata's Beloved Adopted Dog Goa Pays Tribute: రతన్ టాటాను కడసారి చూసేందుకు వచ్చిన గోవా, వీధికుక్కలంటే టాటాకు ఎంత ప్రేమో..ఏకంగా రూ. 165 కోట్లతో ఆస్పత్రి నిర్మించారు, కుక్కలంటే రతన్ టాటాకు ఎంత అభిమానం అంటే..
VNSగోవా నుంచి తెచ్చిన ఆ కుక్కకు ‘గోవా’ అని ఆయన పేరుపెట్టారు. బాంబే హౌస్‌లోని ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క కూడా పెరిగింది. ‘గోవా’తోపాటు ఇతర కుక్కలతో దిగిన ఫొటోను రతన్ టాటా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు.
Dussehra 2024: దసరా రోజున చేసే జమ్మిచెట్టు పూజ ఈ ప్రయోజనాలన్నీ తెస్తుంది, శమీ మొక్కను ప్రత్యేకంగా పూజిస్తే మీకు సకల శుభాలు
Vikas Mహిందూ మతంలో పూజ్యమైన మరియు పవిత్రంగా భావించే మొక్కల వరుసలో షమీ కూడా చేరాడు. దసరా పండుగ సందర్భంగా శమీ మొక్కను (జమ్మి చెట్టు) ప్రత్యేకంగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత శమీ ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు.
Ashwin Maas 2024: అశ్వినీ మాసంలో ఈ 3 మొక్కలు పెడితే మీకు వద్దనుకున్నా డబ్బే డబ్బు
Vikas Mఅశ్విని మాసం హిందూ క్యాలెండర్‌లో ఏడవ నెల, ప్రస్తుతం మనం అశ్విని మాసంలో పండుగలు మరియు ఉపవాసాలు జరుపుకుంటున్నాము. ఈ మాసం ప్రత్యేకించి దేవతను ఆరాధించే మాసం. ఈ మాసంలో దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Ayudha Puja 2024: ఆయుధ పూజ 2024 శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత , మంత్రం వివరాలు ఇవిగో..
Vikas Mఆయుధ పూజ ప్రతి సంవత్సరం అశ్విని మాసం 9వ రోజు అంటే మహానవమి నాడు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజున ఆయుధపూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ 2024 అక్టోబర్ 11, శుక్రవారం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఆయుధపూజకు చాలా ప్రాధాన్యత ఉంది.
Saddula Bathukamma Celebrations: తెలంగాణలో వాడవాడలా సద్దుల బతుకమ్మ కోలాహలం, ట్యాంక్ బండ్ పై 10వేల మందితో ఉత్సవాలు, ఆకట్టుకున్న క్రాకర్ షో
VNSఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు (saddula Bathukamma Celebration).. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు
UPI Transactions Volume Surges: యూపీఐ పేమెంట్స్ విభాగంలో టాప్‌లో ఫోన్‌పే, ఆరు నెలల్లో 78.97 బిలియన్లకు చేరుకున్న యూపీఐ పేమెంట్స్ సంఖ్య
Vikas Mదేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో (జనవరి- జూన్) యూపీఐ పేమెంట్స్ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది నమోదైన 51.9 బిలియన్ల తో పోలిస్తే 52శాతం వృద్ధి నమోదైంది.
Ratan Tata Last Rites: ముగిసిన పారిశ్రామిక దిగ్గజం అంత్యక్రియలు, పార్సి సాంప్రదాయం ప్రకారమే కానీ..నూతన పద్దతిలో అంత్యక్రియల నిర్వహణ
VNSశ్మశానవాటికలో పార్సీ సంప్రదాయాలకు అనుగుణంగా రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల తర్వాత, దక్షిణ ముంబైలోని కొలాబాలోని రతన్ టాటా బంగ్లాలో మరో మూడు రోజుల పాటు సంప్రదాయ ఆచారాలను నిర్వహించనున్నారు.
Bihar Shocker: కూలీ డబ్బులు అడిగినందుకు మొహంపై మూత్రం పోసి, ఉమ్మి అవమానం, దళితుడిపై బీహార్ లో అమానుషం
VNSరమేష్ పటేల్, అతడి కొడుకు, మరో వ్యక్తితో కలిసి రింకూ మాంఝీని రోడ్డు పక్కకు తోసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. అనంతరం యజమాని కొడుకు తన ముఖంపై ఉమ్మి వేశాడని, తనపై మూత్ర విసర్జన చేశాడని రింకూ ఆరోపించాడు.
Revanth Reddy Photo On Bathukamma: బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు