India
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
Tirupati Laddu Row: జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసిన వారిని స్వామివారే శిక్షిస్తారన్న జగన్..సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా? అని ప్రశ్న
Arun Charagondaసుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మాజీ సీఎం జగన్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ తో విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగా వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు అని తెలిపారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్.
Harishrao On Runa Mafi: హైడ్రా పేరుతో అరాచకం, రైతులు డిక్లరేషన్ ఏమైంది?, తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమంలో మాట్లాడిన హరీశ్..రేవంత్ తీరును ఎండగట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుందని...హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోం అని తేల్చిచెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు అని ప్రశ్నించారు.
Boat Capsize in Congo: సరస్సులో మునిగిపోతున్న బోటు వీడియో ఇదిగో, 87 మంది మృతి, వందల మంది గల్లంతు
Hazarath Reddyకాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో సరస్సులో బోల్తా పడింది
DMK Vs Pawan Kalyan: సనాతన ధర్మానికి మీరే పెద్ధ శత్రువులు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ విసిరిన డీఎంకే, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyతిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ (DMK Vs Pawan Kalyan) ఇచ్చింది.
Maharashtra Deputy Speaker: మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన, సచివాలయంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి, తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్ర సచివాలయం పైనుండే దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్. అయితే బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు. గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
KVP Ramachandra Rao On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ, పార్టీకి చెడ్డ పేరు రావొద్దు...అక్రమమైతే నేనే కూలుస్తానని కామెంట్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని ...ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించాలన్నారు. అక్రమమైతే నా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని లేఖలో పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని... కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు..అలా వస్తే నా రక్తం సహించదు అని తెలిపారు కేవీపీ.
Sanatan Dharma Row: వేచి చూడండి అంటూ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Deoria: వీడియో ఇదిగో, కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న విద్యార్థులను అది చూపాలంటూ వేధించిన కామాంధులు, పొలాల్లో గుండా పెరిగెడుతూ..
Hazarath Reddyఉత్తర ప్రదేశ్ డియోరియాలోని నారాయణ్‌పూర్‌లో కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న పాఠశాల విద్యార్థినులను కొందరు వ్యక్తులు వేధించిన సంఘటన కలకలం రేపింది. దుండగులు బాలికలను వెంబడించడంతో వారు కేకలు వేసి భయాందోళనకు గురై పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Virat Kohli With Anushka Sharma: బ్యాటు పట్టిన అనుష్క శర్మ, బాల్ పట్టిన విరాట్ కోహ్లీ...ఫన్నీ అండ్ వైరల్ వీడియో
Arun Charagondaభారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి క్రికెట్ ఆడారు. ముందుగా అనుష్క బ్యాటింగ్ చేయగా కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అనుష్క రెండు సార్లు అవుట్ చేయగా అనుష్క శర్మ బుంగమూతి పెట్టింది. ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడిన కోహ్లీకి బిగ్ షాక్ ఇచ్చింది అనుష్క. బాల్ దూరంగా ఎవరు కొడితే వాళ్ళే తీసుకురావాలంటూ చెప్పగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Google Pay personal Loan: గుడ్ న్యూస్...ఇకపై గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల పర్సనల్ లోన్, రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్..వివరాలివే
Arun Charagondaప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి గూగుల్ పే ద్వారా ఇక నుంచి గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ తో జత కట్టినట్లు తెలిపింది. అలాగే తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.
Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ట్వీట్
Hazarath Reddyతిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
Odisha: హదయాన్ని కదిలించే సంఘటన, హార్ట్ ఎటాక్‌తో తినుబండారాలు అమ్మే బండిపైనే ఓ వ్యక్తి మృతి..కలిచివేస్తున్న వీడియో
Arun Charagondaఒడిషాలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ 40 ఏండ్ల ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు. ఎప్పటిలాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి వర్షం పడుతుండడంతో ఒక దగ్గర ఆగాడు. ఇంతలోనే గుండెపోటు రావడంతో బండి మీదే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి, తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
Nimishamba Devi Temple: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపచారం, అమ్మవారికి చీర కట్టకుండా ప్రాక్ వేసిన పూజారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaమేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ప్రాక్ వేసారని పూజారులపై మండిపడుతున్నారు మహిళలు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ప్రాక్ ఎలా వేస్తారంటు నిలదీశారు. ఇక ప్రశ్నించిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Video: షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు
Hazarath Reddyకడలూరుకు చెందిన పి బాలమురుగన్ (24) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్‌లో వైగై ఎక్స్‌ప్రెస్ ఫుట్‌బోర్డ్ నుండి పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యాహ్నం 2:30 గంటలకు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ మెట్లపై కూర్చున్న బాలమురుగన్ తన బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ 4 పై పడిపోయాడు.
Jangaon: మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులపై పోక్సో కేసు నమోదు
Arun Charagondaతెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై.. ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా.. వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.
Nagaruna Petition On Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా, సోమవారం మరోసారి విచారించనున్న న్యాయస్థానం
Arun Charagondaమంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా వేసింది న్యాయస్థానం. సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో వాయిదా వేయగా సోమవారం రోజు పిటిషన్ పై విచారించనుంది మనోరంజన్ కోర్టు.
Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Arun Charagondaసంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సీనియర్ అధికారి ఉండాలని న్యాయస్థానం సూచించింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Viral Video: ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారి హరినేత్రపై తాజాగా ఓ వీధి కుక్క దాడికి పాల్పడింది.