జాతీయం
Sangareddy Horror: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్.. సంగారెడ్డిలో ఘటన
Rudraఅభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.
Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే
Arun Charagondaసింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేశాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తె..మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది.
Petition Filed In High Court Against KCR: కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని అభ్యర్ధన
Rudraమాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకి రావడంలేదని, దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు పిటిషనర్ కోరారు.
Taj Banjara Hotel Seized: హైదరాబాద్ లోని ప్రఖ్యాత తాజ్ బంజారా హోటల్ సీజ్.. పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. వీడియోలు వైరల్
Rudraతాజ్ బంజారా.. ఈ పేరు వింటే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దక్షిణ భారత దేశంలోనే ఓ టాప్ రేటెడ్ హోటల్ అన్న స్ఫురణకు వస్తుంది. హైదరాబాద్ కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఈ ప్రఖ్యాత హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.
School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన
Rudraగతంలో గుండెపోటు అంటే 60-70 ఏండ్లు దాటిన వారికి అదీ ఊబకాయంతో బాధపడే వారికి వచ్చేది. అయితే, ఇప్పుడు యువతీయువకులతో పాటు స్కూల్ పిల్లలకు కూడా గుండెపోటు రావడంతో పాటు కొన్ని మరణాలు కూడా సంభవించడం నిత్యకృత్యంగా మారింది.
Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?
Rudraభారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది.. సాత్విక్ సాయిరాజ్ కి పితృవియోగం నెలకొంది.
24*7 Shops In Ramadan Month: 24 గంటలూ దుకాణాలు ఓపెన్.. మార్చి 2వ తేదీ నుండి 31 వరకు తెరుచుకోవడానికి అనుమతి.. రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు
Rudraముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Transfers in Telangana: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఆరోగ్య శ్రీ సీఈవో శివకుమార్ స్థానంలో కర్ణన్
VNSతెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్.శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
VNSఇల్లు లేని కుటుంబాలకు ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పకపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, రషిద్ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద సౌమ్య సర్కార్ కు దొరికిపోయిన భారత్ స్టార్ బ్యాటర్
Hazarath Reddyభారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ 22 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు 23వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది. రిషద్ హొస్సేన్ ఆఫ్-స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీ వేశాడు. కోహ్లీ బ్యాక్ ఫుట్ ద్వారా కట్ చేయగా బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతంలో సౌమ్య సర్కార్ సులభమైన క్యాచ్ తీసుకున్నాడు
Jaker Ali’s Stunning Pushpa Celebration: వీడియో ఇదిగో, నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్న బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీలోనూ బన్నీ మేనియా కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తగ్గేదేలే సెలబ్రేషన్ వైరల్ అయింది. హాఫ్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను హెల్మెట్ కింద నుంచి తీసుకెళ్తూ తగ్గేదేలే పోజ్‌ను దించేశాడు జేకర్ అలీ
Shubman Gill Slams First Century: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్, ఆరు వికెట్ల తేడాగో బంగ్లాపై భారత్ ఘన విజయం
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో సమగ్ర విజయాన్ని సాధించారు.భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ 101 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును ఆధిపత్య విజయానికి నడిపించాడు
Shubman Gill Six Video: వీడియో ఇదిగో, గిల్ కొట్టిన సిక్స్ దెబ్బకు ఒక్కసారిగా షాకైన రోహిత్ శర్మ, ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్
Hazarath Reddyఈ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కొట్టిన ఓ షాట్‌కు రోహిత్ షాక్ అయ్యాడు. బౌన్సర్‌ను వెంటనే పిక్ చేసిన గిల్.. లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో పుల్ షాట్‌గా మలిచాడు. నిల్చున్న చోటు నుంచే స్టేడియంలోకి తరలించాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది.
Rohit Sharma: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు
Hazarath Reddyసచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. రోహిత్ (Rohit Sharma) 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
PhonePe to list On Indian Exchange: స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఫోన్ పే, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు సన్నాహాలు
VNSవాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఐపీఓకు (IPO) సిద్ధమవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Stock market) లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. 2023లో నిర్వహించిన ఫండింగ్ రౌండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ తెలిపింది.
Virat Kohli: చరిత్ర తిరగారాసిన విరాట్ కోహ్లి, అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు, అజారుద్దీన రికార్డు సమం
Hazarath Reddyఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లి సమం చేశాడు.
PNB Reduced Interest Rates: హోం లోన్, కార్ లోన్ ఉందా? మీకు గుడ్‌న్యూస్, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు
VNSప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎన్‌బీ వడ్డీ రేట్లను సవరించింది
Mohammed Shami: రికార్డుల ఊచకోత కోసిన మొహమ్మద్ షమీ, ఏకంగా నాలుగు రికార్డులకు పాతర, బంగ్లాతో 5 వికెట్లతో దుమ్మురేపిన భారత స్పీడ్ స్టర్
Hazarath Reddyభారత ఏస్ పేసర్ మహ్మద్ షమి బంగ్లా వెన్నువిరిచాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లతో ప్రభంజనం సృష్టించాడు. ఈ క్రమంలో 4 పాత రికార్డులను చరిత్ర పుటల్లోకి పంపాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి'లేడీ'లు, నిజం తెలిసి తల పట్టుకున్న షాపు యజమాని
Hazarath Reddyనెల్లూరు జిల్లా ఉదయగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.