జాతీయం

JioPhone Prima 2 4G: తొలి సారి ఫ్రంట్‌ కెమెరాతో జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, జియో ఫోన్ ప్రైమా 2 ఫీచర్లు, ధర గురించి ఓ సారి తెలుసుకోండి

Vikas M

దేశీయ టెలికాం దిగ్గజం జియో భారత మార్కెట్లోకి జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో జియో ఆవిష్కరించిన జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా జియో ఫోన్ ప్రైమా 2 వస్తోంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.

GNSS: ప్రైవేటు వాహనదారులకు గుడ్‌న్యూస్, హైవేపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు ఉండవు, టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం

Vikas M

ప్రైవేటు వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వాహనానికి జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని ప్రకటించింది.

ISRO Warning on Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్

Vikas M

ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.

Yuzvendra Chahal Five-Wickets Video: యుజ్వేంద్ర చాహల్ 5 వికెట్ల వీడియో ఇదిగో, కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో అదరగొట్టిన భారత స్పిన్నర్

Vikas M

కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు, అతను డెర్బీషైర్‌పై నార్తాంప్టన్‌షైర్‌కు ఐదు వికెట్లు పడగొట్టాడు. చాహల్ బాధితుల్లో వేన్ మాడ్‌సెన్, అన్యూరిన్ డొనాల్డ్, జాక్ చాపెల్, అలెక్స్ థాంప్సన్ మరియు జాక్ మోర్లే ఉన్నారు.

Advertisement

Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు మృతి, కారణం ఏంటంటే..

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో, పిల్లలను ఎత్తుకెళ్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తి ఎనిమిది గంటలపాటు తీవ్ర ప్రతిష్టంభన తర్వాత 40 అడుగుల ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకి మృతి చెందాడు. అవినాష్ కుమార్ అనే వ్యక్తి పిల్లల దొంగ అని భావించిన గ్రామస్థులు, రాత్రంతా అతడిని వెంబడించడంతో ఘటన మొదలైంది. ప్రాణభయంతో కుమార్ జాన్‌పూర్-వారణాసి హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపైకి ఎక్కాడు.

Hertz Tower Demolition: వీడియో ఇదిగో, 15 సెకన్లలో 22 అంతస్తుల టవర్‌ని కూల్చివేసారు, లేక్‌ చార్లెస్‌లో హెర్ట్జ్‌ టవర్‌ కూల్చివేత వీడియో ఇదిగో..

Vikas M

అమెరికాలోని లూసియానా రాష్ట్రం లేక్‌ చార్లెస్‌లో 2020లో సంభవించిన లౌరా, డెల్టా హరికేన్‌ తుఫాన్ల కారణంగా 22 అంతస్తుల హెర్ట్జ్‌ టవర్‌ బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హెర్ట్జ్‌ టవర్‌ను అధికారులు శనివారం ఇలా నియంత్రిత విధానంలో పేలుళ్లు జరిపి కూల్చివేశారు. 15 సెకన్లలోనే ఈ భవనం నేలమట్టమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

16th Finance Commission Meet: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 41 నుంచి 50 శాతానికి పెంచాలి: 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Hazarath Reddy

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని..అందుకే ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.

Video: వీడియో ఇదిగో, రైలులో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన, చితకబాదిన ప్రయాణికురాలు

Hazarath Reddy

కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికుడికి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.మహిళ అతనిని తన చెప్పులతో కొట్టి, వారి ముందు అతనిని బహిర్గతం చేసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది

Advertisement

Vande Bharat Attack Video: వీడియో ఇదిగో, వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు, చర్యలు తీసుకోవాలంటూ  వీడియో షేర్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

వందే భారత్‌ రైలుపై (Vande Bharat Train) అడపదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో పగలగొడుతున్నాడు

Devara Part 1 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర ట్రైలర్, కేక పుట్టించేలా సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్‌ విడుదలైంది. బాలీవుడ్‌ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

Godavari Water Level Rise: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం, పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు

Hazarath Reddy

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

Suicide Attempt Foiled: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకోవాలని వచ్చి పట్టాలపై నిద్రపోయిన యువతి, తలకు కొద్ది దూరంలో రైలును ఆపేసిన డ్రైవర్

Hazarath Reddy

బీహార్‌లోని మోతిహారిలో జరిగిన నాటకీయ పరిణామాలలో, రైలు పట్టాలపై జీవితాన్ని ముగించాలని భావించిన ఒక యువతి అందుకు బదులుగా నిద్రపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చాకియా రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆమె రైలు కోసం వేచి ఉండగానే పట్టాలపై పడుకుని నిద్రపోయింది.

Advertisement

UP Hit-and-Run Video: షాకింగ్ వీడియో ఇదిగో, మహిళను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిన కారు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో, సెప్టెంబర్ 9న వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి, ఈడ్చుకెళ్లడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వాహనం ఢీకొట్టే సమయంలో రోడ్డు దాటుతున్న మహిళను చూపుతున్న సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Jackal Attack in Sehore: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తులపై నక్క దాడి, రాళ్లు విసిరినా ఆగకుండా దాడి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లోని రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో నక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9, సోమవారం సాయంత్రం జరిగింది. రోడ్డు పక్కన కూర్చున్న శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌లపై నక్క దాడి చేసినట్లు CCTV వీడియోలో బంధించబడింది.

Ganesh Visarjan in Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

Merugu Nagarjuna Slams Anitha: మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, టీడీపీకి వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున వార్నింగ్

Hazarath Reddy

ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Vangalapudi Anitha on Jagan: జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి, హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విజయవాడలో భారీ వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్‌ రెండుసార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లారని విమర్శించారు.

Astrology: సెప్టెంబర్ 16 సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది.

Andhra Pradesh Rains: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, ఈనెల 20–22 మధ్య బంగాళా­ఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది.

Astrology: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి..ఈ పనులు చేస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది.

sajaya

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు.

Advertisement
Advertisement