India

Kolkata Rape Murder Case: ఆస్పత్రిలో రాత్రిపూట శవాలతో సెక్స్, కోల్‌కతా రేప్ హత్య కేసు నిందితుడు ఫోన్‌లో సంచలన వీడియోలు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపిన జూనియర్ డాక్టర్లు

Hazarath Reddy

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తమ 31 ఏళ్ల సహోద్యోగిపై దారుణంగా అత్యాచారం (Kolkata Rape Murder Case) చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు షరతులతో తమ సుముఖత వ్యక్తం చేశారు.

Typhoon Yagi: వియత్నాంను వణికించిన యాగి తుపాను, భారీ వరదలకు 141 మంది మృతి, మరో 59 మంది గల్లంతు, వరద పోటెత్తి పొంగిపొర్లిన డైక్ నది

Hazarath Reddy

వియత్నాంను యాగి తుపాను వణికిస్తోంది. అక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మ‌రో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పార్టీలో సినీ ప్రముఖులు

Arun Charagonda

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రాగా గెస్ట్ హౌస్‌‌పై దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న..18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Malaika Arora Father Suicide: బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్‌ అరోరా

Hazarath Reddy

బాలీవుడ్‌ ప్రముఖ నటి మలైకా అరోరా (Malaika Arora) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Behr University Ragging: వీడియో ఇదిగో, జూనియర్ విద్యార్థిని అక్కడ కొడుతూ దారుణంగా ర్యాగింగ్, ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసిన బెహర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని బెహర్ యూనివర్శిటీలో ర్యాగింగ్ జరిగిందని ఆరోపించిన ఆందోళనకరమైన సంఘటనలో, ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు తీవ్రంగా దాడి చేశారు. బాధితుడిని బెల్ట్‌లతో కొట్టారు. అలాగే తన్నడం, పంచ్‌లతో సహా భౌతిక దాడికి పాల్పడ్డారు.

CM Revanth Reddy On Hydra: అక్రమార్కులు ఎంత గొప్పోల్లైన వదలిదేది లేదు..హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్

Arun Charagonda

హైడ్రా అక్రమ నిర్మాణాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్...ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు వార్నింగ్ ఇచ్చారు.

Case File Against Kodali Nani: కొడాలి నానిపై కేసు పెట్టిన ఆలూరు టిడిపి నేతలు, చంద్రబాబుని లోఫర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆలూరు టిడిపి నేతలు కేసు పెట్టారు. ఆలూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని టిడిపి నేతలు సిఐ కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లోఫర్ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసు పెట్టారు.

Manipur Unrest: డీజీపీ రాజీనామా చేయాల్సిందే, విద్యార్థుల నిరసనతో అట్టుడుకుతున్న మణిపూర్, రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నంతో మళ్లీ కల్లోల పరిస్థితులు

Hazarath Reddy

రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర డీజీపీ, రక్షణ సలహాదారుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు

Advertisement

Ganesh Chaturthi 2024: వీడియో ఇదిగో, భక్తిని వదిలేసి రక్తిలో మునిగిన భక్తులు, తిరుపతి వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు, ఏడుగురుని అరెస్టు చేసిన పోలీసులు

Hazarath Reddy

తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు.

World's Largest iPhone: ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్, 6 అడుగుల ఐఫోన్‌ని చూశారా..ఆపరేటింగ్ వీడియో వైరల్

Arun Charagonda

ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌తో జతకట్టింది మైనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Telangana Police: 11 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్‌కు చెక్కును అందించిన డీజీపీ జితేందర్ రెడ్డి..వీడియో

Arun Charagonda

తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్‌ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.

Advertisement

Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం

Arun Charagonda

ఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Mahbubnagar: దొంగతనానికి వచ్చి కరెంట్‌ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్‌నగర్‌లో షాకింగ్ సంఘటన

Arun Charagonda

దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.

Stray Dogs Attack: కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

Arun Charagonda

తెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశారు. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Viral Video: బొప్పాయిలో వినాయకుడు, జగ్గంపేటలో వినూత్న సంఘటన, వినాయకుడిని చూసేందుకు ఎగబడుతున్న జనం..వీడియో వైరల్

Arun Charagonda

కాకినాడ జిల్లా జగ్గంపేటలో బొప్పాయిలో దర్శనమిచ్చాడు లంబోదరుడు. గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటలో గణపతి నవరాత్రుల పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు అదే గ్రామానికి చెందిన ఒక భక్తుడు తన ఇంటి వద్ద ఉన్న బొప్పాయి చెట్టు మొట్ట మొదటిగా వినాయకుడికి నైవేథ్యంగా సమర్పించేందుకు కొట్టగా అందులో వినాయకుడి దర్శనం ఇచ్చాడు.

Advertisement

Pawan Kalyan With Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. కోటి విరాళం అందజేత

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంకు సంబంధించిన చెక్‌ను రేవంత్‌కు అందించారు పవన్.

Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం,కేకలు వేయడంతో పరారైన నిందితుడు

Arun Charagonda

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Stray Dogs Attack:నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Sharmila Slams Chandrababu: చిన్న పిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు కేంద్రం నుండి 10 వేల కోట్లు తేండి.. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్ వేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. చిన్నపిల్లల పాకెట్ మనీ తీసుకోవడం కాదు‌‌‌ చంద్రబాబు గారు.. కేంద్రం నుండి10 వేల కోట్లు తీసుకు రండి అని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు కనీసం లక్ష నష్టపరిహారం ఇవ్వాలి, తక్షణ సాయంగా‌... పదిహేను వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement