India
KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
Arun Charagondaతెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.
Hyderabad: బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, జాబ్ ఇప్పిస్తామంటూ 600 మందికి టోకరా, ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష వసూలు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు వల వేసిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు 600 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 1లక్ష ,50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బెంగళూరు, విజయవాడలో సైతం ఈ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది
Bihar Bridge Collapse: బీహార్‌లో మరోసారి కూలిన వంతెన, నదిలో కొట్టుకుపోయిన సీఎం నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టు...వీడియో
Arun Charagondaబీహార్ లో మరో వంతెన కూలిపోయింది. సీఎం నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉండగాఇది కూలడం మూడోసారి.
Guidelines For Transfer Of Employees: ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి
Arun Charagondaఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 5 ఏళ్లు ఒకేచోట పని చేసినవారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
Astrpology: ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి..రాఖీ ఏ టైం లో కట్టాలి ,ఏ దిశలో ఉండి కట్టాలి.
sajayaఅన్నా చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన వస్తుంది. ఈ రోజున సోదరీ సోదరీమణులు రాఖీని కట్టుకుంటారు.
Astrology: ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం..30 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం కీర్తి సంపదలను ఆనందాన్ని ఇచ్చే గ్రహం. ఈ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaరైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Astrology: ఈ తేదీల్లో జన్మించిన వారికి భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా తెలుసుకుంటారో అదే విధంగా సంఖ్య శాస్త్రాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం వారి గ్రహాలు వారి రాశుల కారణంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
Tirumala: తిరుమల కొండపై మందుబాబుల బీభత్సం, గాజు బాటిళ్లతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్
Arun Charagondaతిరుమల కొండపై మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో కొట్టుకున్నారు. నందకం అతిథిగా గృహం వద్ద గాజు బాటిళ్ళతో దాడి చేసుకోగా ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. నందకం అతిథిగా గృహం వద్ద ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Astrology: ఆగస్టు 20 బుధాదిత్య యోగం. ఈ మూడు రాశుల వారికిసంపద పెరుగుతుంది
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈనెల 20వ తారీఖు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు ,సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగం, దీన్ని రాజయోగం కూడా అని అంటారు.
Duvvada Srinivas: దువ్వాడ వాణికి టెక్కలి పోలీసుల నోటీస్, పోలీసులతో వాణి వాగ్వాదం, నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.
Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి
Arun Charagondaమౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.
Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaకలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు
Medak Rains: మెదక్‌లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్
Arun Charagondaఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.
Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు కావచ్చు జాగ్రత్త.
sajayaఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.
Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్
Arun Charagondaరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
CM Siddaramaiah In MUDA land Scam Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్..ముడా కుంభకోణంలో ఆరోపణలు, విచారణకు గవర్నర్ అమోదం
Arun Charagondaకర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలిందిమైసూరు నగరాభివృద్ధి ప్రాదికార (ముడా) కుంభకోణంలో ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా ఇప్పుడు అది ఏకంగా కర్ణాటక సీఎంకే తాకింది. ఈ నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Health Tips: కాళ్లు చేతుల్లో తిమ్మిర్లా..అయితే మీకు విటమిన్ బి12 లోపం కావచ్చు.
sajayaమన శరీరానికి బి12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించే ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరం ఏర్పడేటప్పుడు DNA ,RNAఏర్పడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Turkey parliament: పార్లమెంట్‌లో రక్తాలు వచ్చేలా కొట్టుకున్న ఎంపీలు, పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలు, వీడియో వైరల్
Arun Charagondaటర్కీ పార్లమెంట్‌లో ఎంపీల గొడవ రక్తపాతానికి దారి తీసింది. మాట మాట పెరిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఎంపీలు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడంతో గొడవ ప్రారంభమైంది. జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్ అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది దాడి చేయగా ఈ దాడిలో పలువురు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.