విద్య
AP SSC Exams 2020:ఏపీలో జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు, 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి పేపర్‌కు 100 మార్కులు
Hazarath Reddyకరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలు (AP SSC Exams 2020) వాయిదాపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు (July 10 To 15) నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి.
English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం
Hazarath Reddyఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.
Inter Spot Valuation in TS: 20 రోజుల్లో ఇంటర్ ఫలితాలు, స్పాట్ వాల్యూయేషన్‌కు పచ్చజెండా ఊపిన తెలంగాణ హైకోర్టు, జాగ్రత్తలు పాటించాలని ఆదేశం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో (Telangana) ఇంటర్మీడియట్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు (Telangana High Court) అనుమతిచ్చింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఆగిపోయింది. ఇప్పుడు ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై (Inter spot valuation) సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
SSC Exams in TS: కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్
Hazarath Reddyఇప్పటికే మార్చిలో విడుదలైన పాత హాల్ టిక్కెట్లతో (Old Hall Tickets) ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దీనిపై బోర్డు డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు హాజరు కావడానికి కొత్త హాల్ టికెట్లు అవసరం లేదని, దీనికి సంబంధించిన సూచనలు అధికారులకు అందజేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం కారణంగా, ఒక విద్యార్థిని మాత్రమే బెంచ్ మీద కూర్చుని పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయనున్నారు.
CBSE 10th, 12th Board Exam 2020: జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
Hazarath Reddyసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్ష తేదీలను (CBSE 10th, 12th Board Exam 2020) గురువారం ప్రకటించారు. జులై ఒకటి నుంచి జులై 15 వరకూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో COVID-19 లాక్డౌన్ కారణంగా చాలా ఆలస్యం తరువాత ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
Maharashtra: యూనివర్సిటీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయాలని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌
Hazarath Reddyదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samant) ఒక ప్రకటన విడుదల చేశారు.
Class 10 Exam 2020: దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవు, తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మాత్రమే పదవ తరగతి పరీక్షలు, వెల్లడించిన హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. 10 వతరగతి పరీక్షలు కూడా దేశ వ్యాప్తంగా వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
Telangana: 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ
Hazarath Reddyకరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ (Lockdown) నేపద్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తెలంగాణ సర్కారు (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిచేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు (class1-9 to next level) ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది .
New Academic Year: ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ
Hazarath Reddyకరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిని నిర్వహించడంతో పాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (UGC)కు పలు సిపార్సులు చేసింది.
Jagananna Vidya Deevena: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల
Hazarath Reddyవిద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan mohan reddy) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు (AP Govt) నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (Fee reimbursement) ఒకేసారి అందజేయనున్నారు.
Schools Reopened in China: విద్యార్థులకు కొత్తగా డీఐవై టోపీలు, చైనాలో తిరిగి ప్రారంభమైన స్కూళ్లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విద్యార్థుల ఫోటోలు
Hazarath Reddyకరోనావైరస్‌ సృష్టించిన విలయం నుంచి డ్రాగన్ కంట్రీ (China) మెల్లమెల్లగా కోలుకుంటోంది. కరోనావైరస్ పుట్టిన వుహాన్‌లో కూడా ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు (Schools Reopened in China) తెరుచుకుంటున్నాయి. చైనాలోని ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాల విద్యార్థుల చివరి సంవత్సరం సుదీర్ఘంగా మూసివేసిన తరువాత సోమవారం వారి తరగతి గదులకు తిరిగి హజరయ్యారు.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు, 50 సంవత్సరాల కిడ్స్ కోడింగ్ గేమ్, కొత్త కొత్తగా ముందుకు రానున్న గూగుల్ కోడింగ్ గేమ్స్
Hazarath Reddyకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. అందరినీ ఇంట్లోనే కట్టి పడేసింది. ప్రతిచోటా ప్రజలు వారి కుటుంబాలు లాక్డౌన్ (Lockdown) మధ్య ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో వారి మెదడును ఉత్తేజరపరచడానికి గూగుల్ (Google) ప్రసిద్ధ ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్ ఆటలను (Google Doodle Games) తిరిగి చూసే త్రోబాక్ డూడుల్ సిరీస్‌ను ప్రారంభించింది!
AP English Medium: ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyగత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి
Hazarath Reddyపేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.
AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
All Exams Postponed in TS: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌
Hazarath Reddyక‌రోనా (COVID-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో జ‌రగాల్సిన అన్ని ర‌కాల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా (CETs Exams Postponed) వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
Telangana Lockdown: తెలంగాణలో విద్యార్థులకు పరీక్షలు ఉండవు, 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు, 10వ తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం
Hazarath Reddy1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Free Eeducation Learning Apps: మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ దెబ్బకు మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. విద్యార్ధులు, ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మనమందరం ఇప్పుడు ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలను నేర్చుకోలేకపోతున్నామని చాలా బాధపడుతుంటారు. అయితే ఆ బాధ లేకుండా కొన్ని యాప్ లు ప్రీమియం సభ్యత్వంతో ఉచితంగా వారికి సేవలను అందిస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఉపయోగపడే యాప్ ల గురించి ఓసారి తెలుసుకుందాం.
10th Class Exams: పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు, రేపటి పరీక్ష మాత్రం యధాతథం
Vikas Mandaపరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించిన హైకోర్ట్ ప్రస్తుతానికి మార్చి 23- మార్చి 30 వరకు ఉన్న పది పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.....
Ignaz Semmelweis: చేతులు కడుక్కోవడంపై ఏనాడో చెప్పిన ఓ గొప్పశాస్త్రవేత్త, తల్లులకు పునర్జన్మను ప్రసాదించిన మహానుభావుడు, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వైస్‌ను స్మరిస్తూ గూగుల్ ప్రత్యేక డూడుల్
Vikas Mandaడాక్టర్ ఇగ్నాజ్ మరణం అత్యంత దురదృష్టకరమైనది. 1865 అతడి మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఇతర డాక్టర్లు, సెక్యురిటీ సిబ్బంది కొట్టి పిచ్చోడిగా ముద్రవేశారు. మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు.....