Information

Indian Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..

Hazarath Reddy

1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిస‌త్వం నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Rs 2,000 Notes Printing Stopped: రెండు వేల నోటు ప్రింటింగ్ ఆగిపోయింది, ఆర్టీఐ కార్యకర్తకు సమాధానం ఇచ్చిన ఆర్‌బీఐ, రూ. 200 నోటు ప్రింటింగ్‌కే ఎక్కువ ఖర్చు అవుతుందని వెల్లడి

Hazarath Reddy

పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత కేంద్రం వెయ్యి రూపాయ‌ల‌కు బ‌దులుగా 2వేల రూపాయ‌ల నోటును (Rs 2,000 Notes Printing Stopped) తీసుకొచ్చింది. న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రొత్స‌హిస్తూనే 2వేల రూపాయ‌ల‌ను తీసుక‌ురావ‌టంపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India (RBI) దాని ముద్రణను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక్క 2 వేల రూపాయల నోటును కూడా ముద్రించ లేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ (RTI Activist) పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది.

Telangana Police: తెలంగాణ పోలీసుల హెచ్చరిక, సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెడితే కఠిన చర్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపిన తెలంగాణ డీజీపీ

Hazarath Reddy

సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెట్టడంతో బెంగుళూరులో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. పోలీసులకు దుండుగులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) అలర్ట్ అయింది. సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana Director General of Police M. Mahender Reddy) రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Rain Alert in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు (Rain Alert in AP) పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (Disaster Management Authority) తెలిపింది. ఈ నేపథ్యంలొ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

Bengaluru Riots: గుడిని కాపాడేందుకు ముస్లీంలు మానవహారం, బెంగుళూరు అల్లర్లలో వెల్లివిరిసిన మతసామరస్యం, సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియో ఇదే

Hazarath Reddy

ముస్లిం యువకులు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ మతసామరస్యాన్ని చాటారు. ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా (human chain) నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు (Muslims form human chain to save temple) భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. భారతీయతలోని గొప్పదనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Krishna Janmashtami 2020: కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమినే... గోకులాష్టమి (Gokulashtami 2020) అని కూడా అంటారు. భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ (Krishna Janmashtami) జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని (Krishna Janmashtami 2020) ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని (Happy Krishna Janmashtami) జరుపుకుంటున్నాం. అంటే 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు ఈ పంచాంగం చెబుతోంది.

Indian Railways: సెప్టెంబర్ 30 వరకు రైళ్లు రద్దు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చిన ఇండియన్ రైల్వే

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, సెప్టెంబర్ 30 వరకు భారతదేశం అంతటా సాధారణ రైలు సర్వీసులు రద్దు చేస్తూ రైల్వే శాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల రద్దును సెప్టెంబర్ 30 వరకు రైల్వే పొడిగించింది. కాగా ఈ రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేయాల్సి ఉంది. అయితే ప్రత్యేకంగా వేసిన 230 రైళ్లు నడుపుతూనే ఉంటాయని భారత రైల్వే తెలిపింది. కరోనా నేపధ్యంలో ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది.

Pranab Mukherjee COVID 19: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ దిగ్గజం, తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని వినతి

Hazarath Reddy

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ (Former President Pranab Mukherjee) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్‌ ట్వీట్ ( Pranab Mukherjee COVID 19) చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

India's Coronavirus: దేశంలో తాజాగా 62,064 కేసులు నమోదు, 22 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, యాక్టివ్‌గా 6,34,945 కేసులు, మరణాల సంఖ్య 44,386

Hazarath Reddy

దేశంలో వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు (Coronavirus Cases), ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు (Coronavirus Deaths) న‌మోద‌య్యాయి. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా (New Coronavirus Cases) బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా (Coronavirus Active Cases) ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో క‌రోనా బారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 15 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

Indian Railways ‘Khalasi’ System: రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం, ఇకపై ఖలాసీ వ్యవస్థకు ముగింపు, ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు (Indian Railways ‘Khalasi’ System) ఇక నుంచి ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్‌ అటెండెంట్‌ కమ్‌ డాక్‌ ఖలాసీల(టీఏడీకే)కు (telephone attendant-cum-dak khalasis (TADKs) సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు పేర్కొంటూ రైల్వే శాఖ (Indian Railways) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

India Covid Recovery Rate: కరోనాపై భారీ ఊరట, రికవరీ రేటు 67.19కి పెరిగిందని తెలిపిన ఆరోగ్య శాఖ, మృతుల శాతం 2.09కి తగ్గిందని వెల్లడి, దేశంలో 19 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

భారత్‌లో కోవిడ్-10 నుంచి కోలుకుంటున్న వారి శాతం మరింత పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో రికవరీ రేటు (India Covid Recovery Rate) 67.19కి పెరిగిందని, మృతుల శాతం (Corona Death Rate) 2.09కి తగ్గిందని ఆరోగ్య శాఖ (Health Ministry India) వివరించింది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల (India Coronavirus Cases) సంఖ్య 19,08,255గా ఉందని, వీటిలో 5,86,244 యాక్టివ్ కేసులు (Corona Active Cases) ఉండగా, 12,82,216 మంది పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయినట్టు పేర్కొంది. మృతుల సంఖ్య 39,795కి చేరినట్టు ఆ ప్రకటన పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వరుసగా ఏడో రోజు 50,000 పైబడి కేసులు నమోదు అయ్యాయి.

Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన నమో, నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన పూర్తి సమాచారం లోపల కథనంలో..

Hazarath Reddy

అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కతమైంది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Bhumi Pujan) విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయిని (PM Narendra Modi Lays Foundation Stone) వేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన​ క్రతువు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామానంద్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.

Advertisement

COVID-19 in India: కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు, దేశంలో కొత్తగా 52,509 మందికి కోవిడ్-19, భారత్‌లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

కరోనా వైర్‌స్లో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల నుంచి సేకరించిన 48,635 వైరస్‌ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. గత అధ్యయనాల్లో కరోనా వైర్‌సలో ఆరు జన్యుమార్పులు జరిగాయని గుర్తించగా, తాజాగా ఆ సంఖ్య అతిస్వల్పంగా పెరిగి ఏడుకు చేరినట్లు గుర్తించారు.

Ayodhya Ram Mandir: రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు, నేడు మధ్యాహ్నం రామ మందిర్ భూమిపూజ కార్యక్రమం, అద్భుత ఘట్టం మొత్తం ప్రత్యక్ష ప్రసారం

Hazarath Reddy

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి (Ram Mandir Bhumi Pujan) కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో (Lord Rama Birth Place) రామాలయ నిర్మాణానికి నేడు మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు భూమి పూజ కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే శంకుస్థాపనకు సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తి కానున్నాయి.

MP Coronavirus: 580 మంది పోలీసులకు కరోనా, 2000 మంది స్వీయ నిర్భంధంలోకి, మధ్యప్రదేశ్‌లో కరోనా కల్లోలం, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మరోసారి కోవిడ్-19 పాజిటివ్

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా (Madhya Pradesh Coronavirus) విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రజలను అలర్ట్ చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా భారిన పడుతున్నారు. రాష్ట్రంలో 588 పోలీసులకు కరోనా (580 policemen infected with Covid-19) సోకిందని, 2000 మంది పోలీసులను క్వారంటైన్ (2,000 quarantined ) చేశామని హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా (state home minister Narottam Mishra) వెల్లడించారు.

Ram Mandir New Model: అయోధ్య రామ మందిరం నమూనా ఇదే, భారతీయ వాస్తుశిల్పకతకు అద్దంపట్టేలా రామమందిర్ నిర్మాణం, రేపు భూమి పూజ కార్యక్రమం

Hazarath Reddy

భారతీయ వాస్తుశిల్పానికి శ్రీ రామ్ జన్మభూమి మందిర్ (Shri Ram Janmbhoomi Mandir) ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలవనుంది. అయోథ్యలో రామ మందిరానికి సంబంధించిన కొన్ని నమూనాలను (Ayodhya Ram Mandir Photos) శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తన ట్విట్టర్ లో ఉంచింది. భారతీయ వాస్తుశిల్పానికి అద్దం పట్టేలా రామ మందిరం ఫోటోలు ఉన్నాయి. రేపు భూమి పూజ జరగనున్న నేపథ్యంలో వేడుకకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement

Mumbai Rains: ముంబై రెండు రోజుల పాటు బంద్, దేశ ఆర్థిక రాజధానిని వణికిస్తున్న వర్షాలు, చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు, రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు (Mumbai Rains) తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ముంబైతోపాటు తూర్పు కొంకణ్‌, థానే జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

Unlock 3: నేటి నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లు ఓపెన్, పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, మాస్క్‌ తప్పనిసరి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా సెంటర్లు, జిమ్‌లు(Yoga Institutes and Gyms) మూతపడ్డాయి. అన్‌లాక్‌ 3.0లో (Unlock 3) భాగంగా వీటిని తిరిగి ఈ నెల 3 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం (Central) అనుమతిచ్చింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్‌ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్‌ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించింది.

Singh Rajput Death Case: సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్

Hazarath Reddy

బాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య (Singh Rajput Death Case) ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల (Maharashtra vs Bihar Govt) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఖండించారు.

Ram Temple Invitation Card: భూమి పూజ ఇన్విటేషన్ కార్డ్ పస్ట్ లుక్ ఇదే, విశిష్ట అతిథిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్, ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ

Hazarath Reddy

అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు రెడీ (Ram Temple 'Bhoomi Pujan' Invitation Card) అయింది. కాషాయం రంగులో ఉన్న ఈ కార్డుపై ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టు కార్టులో పేర్కొన్నారు. ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ (Ram Temple 'Bhoomi Pujan') నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్ (Mohan Bhagwat) పేరుంది.

Advertisement
Advertisement