సమాచారం

COVID-19 Pandemic: 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్

Hazarath Reddy

ఇండియాలో కరోనా మహమ్మారి (2020 Coronavirus Pandemic in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,900 కేసులు నమోదయ్యాయి. అలాగే 195 మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం కొరోనావైరస్ కేసుల సంఖ్య 46,433 కు చేరుకుందని, ఇప్పటివరకు 1,568 మంది (Coronavirus deaths in india) మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భారీన పడిన వారి సంఖ్య 3,645,342గా ఉంది.

Amphan Cyclone: ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు

Hazarath Reddy

ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ (Coronavirus) కోర‌ల్లో చిక్కుకుని పోయిన ఏపీకి (Andhra pradesh) మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండ‌మాన్‌కు దక్షిణదిశగా ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా వాయుగుండంగా మార‌బోతోందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌పడి తీవ్ర‌మైన తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్‌కు ఎంఫాన్‌గా (Amphan Cyclone) నామ‌క‌రణం చేశారు.

Lockdown 3.0: మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు

Hazarath Reddy

భారత్ మూడవ దశ లాక్డౌన్లోకి (India Lockdown 3.0) ప్రవేశించడంతో, ప్రభుత్వం అనేక సడలింపులను ఇచ్చింది. లాక్‌డౌన్‌ (Lockdown) నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు (Liquor Shops Open in Several Cities Across India) తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం బాబులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల (Liquor Shops) వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.

Lockdown 3.0 Begins: తెరుచుకోనున్న మద్యం షాపులు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

Hazarath Reddy

కరోనాని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి (Lockdown 3.0 Started) రానుంది. మూడవసారి పొడిగించిన లాక్ డౌన్ పై (Lockdown) కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే.

Advertisement

Telugu States Coronavirus: ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో తాజాగా 6 కేసులు, మూడవ దశ లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన కేంద్రం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States COVID-19) రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో శుక్రవారం ఉదయానికి తాజాగా 60 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

Liquor Available in Green Zones: మద్యం షాపులు తెరుచుకోవచ్చు, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హోం శాఖ, మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు అంటే మే 17 వరకు (Lockdown 3.0) పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను (Liquor Stores And Paan Shops) అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Lockdown 3.0: మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు (Lockdown 3.0) కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి మే 17 వరకు రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ (India lockdown) అమల్లో ఉండనుంది. రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుండటంతో కేంద్ర హోంశాఖ (Home Ministry) లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు.

LPG Gas Price Cut: భారీగా తగ్గిన ఎల్‌పిజి సిలిండర్ ధరలు, మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి, హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర 589.50 నుంచి ప్రారంభ‌ం

Hazarath Reddy

వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు (LPG Cylinder Price) వివిధ మెట్రో మూడవ సారి భారీగా దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి రూ. 589.50 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది

Advertisement

'First Special Train': దేశంలో తొలి రైలు కదిలింది, వలస కార్మికులతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌కు బయలు దేరిన ప్రత్యేక రైలు

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్‌ (Coronavirus Lockdown) వల్ల తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన హర్యానా వలస కార్మికులు ప్రత్యేక రైలులో ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారిగా (First Train Ran Amid Lockdown) చెప్పవచ్చు. సుమారు 1239 మంది వలస కార్మికులతో కూడిన ప్రత్యేక రైలు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌కు (Telangana's Lingampalli to Jharkhand's Hatia) శుక్రవారం ఉదయం 4.50గంటలకు బయల్దేరింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Thunderbolt Warning: ఏపీలో మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం, రాగల 24గంటల్లో అల్పపీడనం, హెచ్చరించిన వాతావరణ శాఖ కమిషనర్

Hazarath Reddy

దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి, తదుపరి 48గంటల్లో అది మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. రానున్న 49గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో 41-43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

May Day: మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన

Hazarath Reddy

పెట్టుబడిదారి వ్యవస్థపై బడుగు కార్మికుడు పిడికిలి ఎత్తిన ధైర్యం. దోపిడీ దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కార్మికులకు స్పూర్తినిచ్చిన క్షణం. హక్కుల కోసం రోడ్డెక్కి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల సంస్మరణ దినం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే..పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమ దోపిడికి గురైన కార్మికులు 1886మే1 అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పనివిధాన పద్ధతి ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కార్మికులు మే దినోత్సవం (May Day) ఘనంగా జరుపుతున్నారు.

Coronavirus in Telangana: 45 రోజులు శిశువు కరోనాని జయించింది, దేశ చరిత్రలోనే ఇది తొలికేసు, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జి

Hazarath Reddy

తెలంగాణలో అద్భుతం జరిగింది. కరోనా నుంచి 45 రోజుల శిశువు (45-day old infant) కోలుకుని వైద్యలను ఆశ్చర్యపరిచింది. డాక్టర్లను సైతం కాటికి పంపిన కరోనావైరస్ ని 40 రోజుల శిశువు తరిమికొట్టడం దేశ చరిత్రలోనే ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన ఈ COVID-19 పేషెంట్ తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి (Gandhi hospital in Hyderabad) నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

Weather Alert: దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం, రాగల 48 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం, వెల్లడించిన భారత వాతావరణ విభాగం

Hazarath Reddy

ఉత్తర సుమత్రా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ అండమాన్‌ సముద్రంలో (south Andaman Sea) అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తాతీరంలో ఉరుములు, మెరుపులతో మోస్తరుగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడడానికి అవకాశం ఉంది.

Polavaram Project Update: 2020లోనే ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, పోలవరం సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపిన అధికారులు, పనులు వేగవంతం చేయాలన్న వైయస్ జగన్

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గట్టిగానే అడుగులు వేస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులపై (Polavaram Project Works) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Coronavirus in Maharashtra: ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన

Hazarath Reddy

డెభ్బై ఏళ్ల COVID-19 రోగి పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ సౌకర్యం నుండి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడానికి దాదాపు 17 కిలోమీటర్లు నడిచాడు. రోగులకు ఆహారాన్ని అందించకపోవడం,వాష్‌రూమ్‌ల క్లీన్ వంటి మౌలిక సదుపాయాలు లేనందున తాను అక్కడి నుంచి పారిపోయిన (Flees Isolation Facility) వచ్చానని కరోనా వృద్ధుడు (COVID-19 Patient) తెలిపారు. ఈ ఘటన ఫుణేలో జరిగింది.

AP Coronavirus: బ్ర‌హ్మంగారి ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు, ఏపీలో తాజాగా 73 కరోనా కేసులు, మొత్తంగా 1014 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు (AP positive cases) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుంది.

Advertisement

Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 3, ఈ రోజు గూగుల్ డూడుల్‌లో ఫిషింగర్ గేమ్, ఈ ఆటతో ఇంట్లోనే ఉంటూ సంతోషంగా గడిపేయండి

Hazarath Reddy

గతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ఫిషింగర్ (2017) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. ఇది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వచ్చిన గేమ్ లన్నింటినీ మళ్లీ గూగుల్ డూడుల్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ రోజు వచ్చిన ఫిషింగర్ (Oskar Fischinger) గేమ్ చరిత్ర గురించి తెలుసుకోండి

New Academic Year: ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిని నిర్వహించడంతో పాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (UGC)కు పలు సిపార్సులు చేసింది.

Jagananna Vidya Deevena: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

Hazarath Reddy

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan mohan reddy) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు (AP Govt) నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (Fee reimbursement) ఒకేసారి అందజేయనున్నారు.

COVID-19 in India: దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో (Coronavirus in India) చనిపోగా, కొత్తగా 1,543 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 6,868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 934కి చేరింది. గడిచిన 28 రోజుల నుంచి 16 జిల్లాల్లో ఒక్క కరోనా (Coronavirus) కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో 21,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement
Advertisement