సమాచారం

COVID-19 in India: ఇండియాలో 5 రాష్ట్రాల్లో కరోనా లేదు, భారత్‌లో 28 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు చేరుకున్న కరోనావైరస్ కేసులు

Hazarath Reddy

ఇండియాలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి (Deadly COVID-19 in India) కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా (Coronavirus) పాజిటివ్ కేసుల్లో భారత్ 28,000 మార్క్‌ను దాటింది. కొత్తగా 1463 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో సోమవారం సాయంత్రం వరకు మొత్తం కేసుల సంఖ్య 28,380కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 60 మంది మరణించారు.

Moratorium to NBFCs: ఆర్బీఐ కీలక నిర్ణయం, మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, NBFCsలకు మారటోరియం విస్తరణపై బ్యాంకులదే తుది నిర్ణయం

Hazarath Reddy

ఇండియాలోని ఆరు డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని (Special Liquidity Facility) ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేందుకు తీసుకున్నఈ సౌలభ్యం సోమవారం నుంచి మే 11 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అయితే నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (Non-Banking Finance Companies (NBFCs)) 3 నెలల మారటోరియం (Moratorium Benefits) విస్తరించే నిర్ణయం పూర్తిగా బ్యాంకులదేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) తెలిపారు.

Lockdown Extension Suspense: లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Hazarath Reddy

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (PM Narendra Modi Video Conference) ముగిసింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై (Lockdown) సుదీర్ఘంగా చర్చజరిగింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీకి సీఎంలు పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు.

Coronavirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం 11 నెలలు ఆగాల్సిందే, సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సాధ్యం కాదు, బిల్ గేట్స్ కీలక ప్రకటన, ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు భారీగా నిధులు

Hazarath Reddy

ప్ర‌పంచ కుబేరుడు బిల్‌గేట్స్ (Bill Gates) క‌రోనాపై యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను (COVID-19) క‌ట్ట‌డిచేసే వ్యాక్సిన్ త‌యారీ కోసం ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు ఆయ‌న భారీగా నిధులు అంద‌జేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను (Coronavirus Vaccine) ఉత్ప‌త్తి చేస్తామ‌ని ఆయ‌న బిల్‌గేట్స్ ప్ర‌క‌టించారు. అయితే గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన‌ట్లుగా వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement

Andhra Pradesh COVID-19: ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (AP Coronavirus) మహమ్మారి రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 80 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19 Report) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

PM Modi Meeting with CMs: లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ( Lockdown) మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Meeting with CMs) నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference) సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది.కాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, వారందరి అభిప్రాయాలనూ స్వీకరించిన తరువాత లాక్డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే ( lockdown exit strategy) మొగ్గు చూపారని తెలుస్తోంది. రాష్ట్రాల సీఎంలతో కరోనావైరస్ మీద ఇది నాలుగవ సమావేశం.

AP Rain Update: 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 30 నుంచి మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Kannababu) వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.

Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు, 50 సంవత్సరాల కిడ్స్ కోడింగ్ గేమ్, కొత్త కొత్తగా ముందుకు రానున్న గూగుల్ కోడింగ్ గేమ్స్

Hazarath Reddy

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. అందరినీ ఇంట్లోనే కట్టి పడేసింది. ప్రతిచోటా ప్రజలు వారి కుటుంబాలు లాక్డౌన్ (Lockdown) మధ్య ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో వారి మెదడును ఉత్తేజరపరచడానికి గూగుల్ (Google) ప్రసిద్ధ ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్ ఆటలను (Google Doodle Games) తిరిగి చూసే త్రోబాక్ డూడుల్ సిరీస్‌ను ప్రారంభించింది!

Advertisement

PM Modi 'Do Gaz Ki Doori': ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

Hazarath Reddy

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ (Prime Minister Narendra Modi video conference) నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ (e-GramSwaraj Portal) మొబైల్‌ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్‌ పోర్టల్‌ అండ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అవార్డులు ఇచ్చారు. వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు, సర్పంచ్‌లతో మోడీ మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lcokdown) పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు

China Antibody Test Kits: చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మీద వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ (Union Health Minister Dr Harsh Vardhan) శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా కిట్లు నాసిరకంగా (Faulty Antibody Test Kits) వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

Plasma Therapy Results: కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను (Coronavirus) కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స (Plasma Therapy) సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi CM Arvind Kejriwal) అన్నారు. లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో ( LNJP Hospital) నలుగురి కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు (Plasma Therapy Results) ఆయన పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స అనంతరం ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. వారిని త్వరలోనే డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు.

India Coronavirus: కరోనా కట్టడిలో ముందడుగు, 12 జిల్లాల్లో కొత్త కేసులు లేవు, 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి తాజా కేసులు లేవు, దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 4,324 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. గురువారం నాటికి భారత్‌లో (Coronavirus Cases in India) మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1229 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అలాగే 24 గంటల్లో 34 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు 686 మంది మృతి (Coronavirus deaths in india) చెందగా.. 4,324 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

Delhi Corona Deaths: దేశ రాజధానిలో కరోనా కల్లోలం, 45 రోజులు పసిపాప మృతి, 2248కి కరోనా చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కారు

Hazarath Reddy

భారత్‌లో కరోనా (Coronavirus in India) శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా (Coronavirus in Delhi) కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2248కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు (Delhi Corona Deaths) కోల్పోయారు. తాజాగా 45 రోజుల పసిపాపకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Andhra Pradesh Coronavirus: దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Covid-19 pandemic in AP) విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ( andhra pradesh) గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (AP COVID-19) 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి.

Asia's Richest Man: ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం

Hazarath Reddy

ఫేస్‌బుక్ , రిలయన్స్ జియో ( Jio, Facebook Deal) మెగా డీల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఫేస్‌బుక్‌తో (Facebook) జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Man) నిలిచాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది.

Supreme Court Judgment: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

Hazarath Reddy

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో (scheduled areas) రిజర్వేషన్లు 50 శాతం మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని (Telugu states) షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.

Advertisement

PM Narendra Modi: రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ప్రధాని 3వ సారి భేటీ, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు, దాడులు చేస్తే కఠిన శిక్షలు తప్పవు, ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర కేబినెట్

Hazarath Reddy

కరోనావైరస్ పరిస్థితిపై (Coronavirus Pandemic) చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi Video Conference) ఏప్రిల్ 27 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సంభాషించనున్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇది మూడవ సమావేశం. ఈ సమావేశంలో వైరస్ వ్యాప్తి మరియు భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉండటానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.

Coronavirus in India: గుజరాత్‌లో కరోనా కల్లోలం, రెండు వేలు దాటిన కేసులు, దేశంలో 20 వేలు దాటిన కరోనా కేసులు, 652 మంది మృతి

Hazarath Reddy

గత 24 గంటల్లో భారతదేశం 1486 కొత్త కరోనావైరస్ కేసులను (Coronavirus Pandemic) నివేదించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం సానుకూల కరోనావైరస్ కేసులు బుధవారం 20 వేలు (COVID-19 Tally Crosses 20000) దాటాయి. నయం చేయబడిన లేదా విడుదల చేయబడిన వారు 4000 మందిగా ఉన్నారు. 640 మంది (Coronavirus Deaths) మరణించారు. ఇదిలా ఉంటే భారత రాష్ట్రాల్లో కేవలం 4 రాష్ట్రాల్లో 1000 కి పైగా కరోనావైరస్ కేసులు ఉన్నాయి, వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.

Central Government New Ordinance: వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు, రూ. 5 లక్షల జరిమానా, కొత్త ఆర్డినెన్స్ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus) ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు కొత్త ఆర్డినెన్స్‌ (Central Government New Ordinance) తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ (Prakash Javadkar) మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

AP English Medium: ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Advertisement