సమాచారం
Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు
Hazarath Reddyప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.
Leap Day 2020: లీపు సంవత్సరంలో లీపు రోజు, నాలుగేళ్లకు ఒకసారి ఎందుకు వస్తుంది?, అసలు దీని చరిత్ర ఏమిటీ?, ఎవరు దీనిని ప్రవేశపెట్టారు, ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyఒక కాలెండరు సంవత్సరంలో (Year) అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల (Month) గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం (Leap Year) అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి (Calender Year) వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. ఇక ఫిబ్రవరి 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం లీపు సంవత్సరం లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వస్తుంది.లీప్ రోజుగా (Leap Day 2020) ఫిబ్రవరి 29ని పిలుస్తారు.ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి.
Petrol Price: పెట్రో బాదుడు షురూ, ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, మార్చి 1 నుంచి కొత్త ఇంధనం సప్లై
Hazarath Reddyవాహనదారులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price) పెరగనున్నాయి. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికి కారణం BS-6 ఇంధనం. ప్రస్తుతం యూరో -4 లేదా భారత్ స్టేజ్ (BS-6) ఇంధానాన్ని వాడుతున్నాం. BS-6 వాహనాలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి BS-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగించడం జరుగుతోంది. కానీ కాలుష్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో నరేంద్ర మోదీ సర్కార్ ఏప్రిల్ 01 నుంచి దేశ వ్యాప్తంగా BS - 6 ఇంధనాన్ని అందుబాటులోకి రానుంది.
SN Srivastava: ఢిల్లీకి కొత్త పోలీస్‌ కమిషనర్‌, అల్లరి మూకల పని పట్టనున్న ఎస్ఎన్ శ్రీవాస్తవ, పదవీ విరమణ చేయనున్న అమూల్య పట్నాయక్‌, ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉంది:హోంమంత్రి అమిత్ షా
Hazarath Reddyసీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ ఢిల్లీ నూతన పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు.కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా వచ్చిన కొద్ది రోజులకే ఆయనను కమిషనర్‌గా నియమించడం గమనార్హం.
Hyderabad Police: దేశంలో తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్‌పై క్రిమినల్ కేసులు, దేశానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్, 153 (A) , 121 (A) ,294, 505, రెడ్ విత్ 156(3) కింద కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో తమ ప్లాట్‌ఫామ్‌లపై ద్వేషం, దేశ వ్యతిరేక విషయాలను వ్యాప్తి చేయడానికి వీలు కల్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad police) మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter), ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp), చైనీస్ షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ (TikTok) పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దేశంలోనే తొలిసారిగా టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
Sir John Tenniel: జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు, ఇలస్ట్రేటర్‌గా, వ్యంగ్య కళాకారుడుగా ఎన్నో విజయాలు, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించిన గూగుల్
Hazarath Reddyఇలస్ట్రేటర్ మరియు వ్యంగ్య కళాకారుడు సర్ జాన్ టెన్నియల్ 200 వ జయంతిని (John Tenniel's 200th Birth Anniversary) సంధర్భంగా గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ (Google Doodle) రూపొందించింది. ఫిబ్రవరి 28, 1820 న లండన్లో జన్మించిన సర్ జాన్ టెన్నియల్ (John Tenniel) 1893 లో తన కళాత్మక విజయాల కోసం తన సమయాన్ని కేటాయించాడు. 20 సంవత్సరాల వయస్సులో, టెన్నియల్ ప్రమాదం కారణంగా కుడి కంటిలో దృష్టిని కోల్పోయాడు.
Gold Rush Hits UP: రూ.12 లక్షల కోట్ల విలువ చేసే బంగారు గనులు, దేశ సంపదకు ఐదు రెట్లు ఎక్కువ, యూపీలోని సొంభద్రలో బంగారం నిక్షేపాలు, వార్త నిజం కాదన్న జీఎస్ఐ
Hazarath Reddyఉత్తర ప్రదేశ్‌లోని (UP) సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) (Directorate of Geology and Mining) బంగారపు గనులను (Gold Rush Hits UP) కనుగొంది. దాదాపు 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలను గుర్తించామని జియాలజీ, మైనింగ్‌ విభాగం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ రూ. 12 లక్షల కోట్లు ఉంటుంది.
Free WiFi Service: రైల్వే ప్రయాణికులకు శుభవార్త, ఉచిత వైఫై కంటిన్యూ అవుతుంది, గూగుల్ సహకారం లేకుండా 5600 స్టేషన్లలో ఉచిత వైఫై, వెల్లడించిన రైల్‌టెల్ అధికారులు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై (RailTel) సదుపాయాన్ని తీసివేస్తున్నట్లుగా గూగుల్ (Google) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రైల్‌టెల్ (RailTel) స్పందించింది. గూగుల్ సహకారం లేకుండానే దేశంలోని 5600 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కొనసాగిస్తామని రైల్‌టెల్ అధికారులు వెల్లడించారు.
Google Station: పోర్న్ దెబ్బ, యూజర్లకి గూగుల్ షాక్, రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచిత వైఫై దొరకదు, దేశ వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్
Hazarath Reddyరైల్వే ప్రయాణికులకు గూగుల్ (Google) చేదు వార్తను అందించింది. రైల్వేస్టేషన్‌లలో (Railway Stations) ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పాట్నాలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువమంది గూగుల్ ఉచిత వైఫై సర్వీసును పోర్న్ వీడియోలు (Free porn) చూడటానికి మాత్రమే వినియోగిస్తున్నారని RailTel రిపోర్ట్ చేసింది. యూట్యూబ్, వికీపిడియాలను ఫాలో చేస్తూ వాటినే ఆ వీడియోలనే ఎక్కువగా చూస్తున్నారని తెలిపింది. సర్వీసులకు బదులు దాన్ని వాడటంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడంలో ఓ భాగమని చెప్పవచ్చు.
IPL 2020 Full Schedule: ఎనిమిది జట్లు, 56 మ్యాచ్‌లు, 50 రోజులు, మండు వేసవిలో దుమ్మురేపనున్న ఐపీఎల్ 13వ సీజన్, మార్చి 29న తొలి మ్యాచ్, మే 24న ఫైనల్, పూర్తి వివరాలు కోసం స్టోరీని క్లిక్ చేయండి
Hazarath Reddyమండు వేసవిలో క్రికెట్ సమరం మొదలు కాబోతోంది. మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మొత్తం 8 జట్లు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయి.
New Voting Technology: దేశంలో ఎక్కడనుంచైనా మీరు ఓటు వేయవచ్చు, పోలింగ్ బూత్‌కు వెళ్లనవసరం లేకుండా కొత్త టెక్నాలజీ, ఐటీ-ఎంతో చేతులు కలిపిన ఈసీ
Hazarath Reddyమీరు త్వరలో అందుబాటులోకి రానున్న టెక్నాలజీ ద్వారా నిర్దేశిత పోలింగ్‌ బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ (New Voting Technology) అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- మద్రాస్‌ (IIT-M)తో చేతులు కలిపింది.
Reservations-Supreme Court: రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలకే సర్వాధికారాలు, సంచలన తీర్పును వెల్లడించిన దేశ అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyరిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పును వెల్లడించింది. రిజర్వేషన్ (Reservations) కల్పన అన్నది ప్రాధమిక హక్కేమీ కాదు. నియామకాలు, పదోన్నతుల్లో మనహాయింపులు ఇవ్వాలా? వద్దా? అన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పదవుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రభుత్వానికి తప్పనిసరేమీకాదు.
Pakistan Secret Plan: మరో పుల్వామా దాడికి పాక్ పన్నాగం, 27 మంది ఉగ్రవాదులకు శిక్షణ, దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ అధికారులు
Hazarath Reddyపుల్వామాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరిగి ఈ నెల 14కు (2019 Pulwama attack) ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి దాడికి ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు.
Disha Police Station: దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా.., దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.
Hazarath Reddyమహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
Jio 4G Signals In Tihar Jail: తీహార్ జైల్లో జియో దందా, జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్ కంట్రోలింగ్ సాధ్యం కావడం లేదు, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన అధికారులు, కేసు విచారణ 28కి వాయిదా
Hazarath Reddyటెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. తీహార్ జైలులోని అధికారులకు ఝలక్ ఇచ్చినంత పనిచేసింది. తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్‌ను (Jio 4G signals) నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) తెలిపారు.
Mary Somerville Google Doodle: స్కాట్లాండ్ సైంటిస్ట్ మేరీ సోమెర్‌విల్లేకు గూగుల్ డూడుల్ ఘన నివాళి, భౌతిక, గణిత శాస్త్రాల్లో పరిశోధనలు, నాలుగు పుస్తకాలు రాసిన మారీ సోమర్విల్లె
Hazarath Reddyసెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మేరీ సోమెర్‌విల్లేకు (Mary Somerville) డూడుల్‌తో నివాళి అర్పించింది. సోమెర్‌విల్లే యొక్క ప్రయోగాత్మక భౌతిక పత్రాలను UK యొక్క నేషనల్ సైన్స్ అకాడమీ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఆమె ప్రయోగాత్మక పత్రాలను చదివిన రోజున గూగుల్ (Google) స్కాటిష్ శాస్త్రవేత్తను ఘనంగా సత్కరించింది. ప్రపంచంలోని పురాతన సైన్స్ ప్రచురణ అయిన ప్రతిష్టాత్మక ఫిలాసఫికల్ ట్రాన్సాక్షన్స్లో ప్రచురించబడిన మొదటి మహిళా రచయితగా ఆమె నిలిచింది.
Budget 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో తెలుసా, బడ్జెట్ 2020లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో పెరగనున్న ఫర్నీచర్‌, చెప్పుల ధరలు, తగ్గనున్న మొబైల్ విడిభాగాల ధరలు
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2020) కస్టమ్స్‌ డ్యూటీ (custom duty) పెంపును ప్రవేశపెట్టింది. ఈ పెంపుతో రానున్న కాలంలో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరగనున్నాయి.
Railway Budget 2020: రైల్వే ప్రయాణికులకు శుభవార్త, మరిన్నికొత్త రైళ్లు అందుబాటులోకి, కొత్తగా కిసాన్ రైలు, పర్యాటక ప్రాంతాల్లో తేజస్ రైళ్లు, రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు
Hazarath Reddyఈ బడ్జెట్లో రైల్వే ప్రయాణికులు శుభవార్తను అందించారు. మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్‌లో తెలిపారు.ఇండియన్ రైల్వేస్ కొత్తగా కిసాన్ రైలును (Kisan Rail) ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) భాగస్వామ్యంలో ఈ రైలు నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ టరైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
Education Budget 2020: విద్యారంగానికి రూ.99,300 కోట్లు, 150 యూనివర్సిటీల్లో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోర్సులు, విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు
Hazarath Reddyబడ్జెట్‌లో (Union Budget 2020) విద్యారంగానికి (Education) రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం 3వేల కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. ఈ సందర్బంగా డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. త్వరలోనే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని... మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెడతామని అన్నారు.
Union Budget 2020: మీ సొమ్ముకు మరింత భద్రత, బ్యాంకు డిపాజిట్లపై బీమా పెంపు, ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ, ఎల్ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయం,స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్
Hazarath Reddyరోజంతా కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు మరింత భద్రత కల్పిస్తూ మధ్యతరగతి ప్రజలకుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త ప్రకటించారు. ఇందులో భాగంగా బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను (Deposit insurance) పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు.