సమాచారం

Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు

Arun Charagonda

బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.

Earthquake In Prakasham District: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, సెకను పాటు కంపించిన భూమి..ప్రజల భయాందోళన

Arun Charagonda

ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం రాగా వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Telangana: గురుకులంలో దారుణం..మెట్లపై నుండి జారిపడి విద్యార్థిని మృతి..వీడియో

Arun Charagonda

మెట్ల పై నుండి జారిపడి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి చెందారు. సంగారెడ్డి - జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఈఘటన చోటు చేసుకుంది.

Attack On Police: పోలీసుల మీదే దాడి చేసిన ప్రజలు...మతిస్థిమితం లేదని బాలికపై అత్యాచారం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...ఆగ్రహంతో పోలీసులపైనే స్థానికుల దాడి

Arun Charagonda

బాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో మూడు గంటలు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.

Advertisement

Unregulated Loan Apps: ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష.. వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన కేంద్రం, లోన్ యాప్‌ల వేధింపులు- ఆత్మహత్యల నేపథ్యంలో కీలక నిర్ణయం!

Arun Charagonda

లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్రం. ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం.

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఊపిరిపీల్చుకునే విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

Telangana: మీడియా ఎస్‌ఐ చిందులు, ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్‌ఐ గీత...ఎస్‌ఐపై జర్నలిస్టుల ఫైర్

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్య పై బాధితులు మాట్లాడుతుండగా పలు ఛానల్ మైక్ లు తీసివేశారు ఎస్సై. ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్‌ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.

Advertisement

TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల తేదీల్లో మార్పులు చేసిన టీటీడీ, మార్చి నెల టికెట్ల తేదీల మార్పు, అదే రోజు గదుల కోటా రిలీజ్

Arun Charagonda

మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది టీటీడీ. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల చేయనుంది.

PM Modi In Kuwait: 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, రెండు రోజుల పాటు పర్యటించున్న ప్రధాని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టూర్

Arun Charagonda

రెండు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని వెళ్లారు. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో పర్యటించనున్నారు మోదీ.

Tremors in Prakasam: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో స్కూల్ నుంచి బయటకు పరుగులుతీసిన విద్యార్థులు

Rudra

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

Advertisement

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ వచ్చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Hyderabad: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు...సికింద్రాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై దాడులు, హోటళ్లపై కేసులు నమోదు

Arun Charagonda

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని హోటళ్ళపై కేసులు నమోదు చేశారు.

Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లోని మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Telangana SSC Exam Dates: తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు, వచ్చే ఏడాది మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు..వివరాలివే

Arun Charagonda

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి పదో తరగతి పరీక్షలు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది ఎస్‌ఎస్‌సీ బోర్డు.

Advertisement

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది

Rupee Falls to All-Time Low: డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణించిన రూపాయి విలువ, కేవలం రెండు నెలల్లోనే రూ.84 నుంచి రూ.85కు పడిపోయిన భారత కరెన్సీ

Hazarath Reddy

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు దారుణంగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే తొలిసారిగా 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది

Online Betting Trap: ఆన్‌లైన్ బెట్టింగ్ ట్రాప్..వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఎలాంటి వేశాలు వేస్తున్నారో మీరు చూడండి..

Arun Charagonda

ఆన్ లైన్ బెట్టింగ్ ఫ్రాడ్‌పై ట్విట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువ‌కుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శ‌క్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండిని సూచించారు.

JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

Arun Charagonda

ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.

Advertisement
Advertisement