Information

Tirumala Update: తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

Trains Cancelled: విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు

Rudra

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు

Rudra

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం

Rudra

వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.

TS SSC Supplementary Results 2023: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

జూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలని సూచించారు.

First IIT Outside India: విదేశాల్లో తొలి ఐఐటీ క్యాంపస్‌, టాంజానియా ద్వీపంలోని జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు

Hazarath Reddy

భారతదేశం వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది

SC on Theft in Railways: రైలు ప్రయాణంలో ప్రయాణీకుల వస్తువులు పోతే రైల్వే శాఖ బాధ్యత వహించదు, కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ప్రయాణీకుల వ్యక్తిగత వస్తువులను దొంగిలించడం రైల్వేల “సేవా లోపం” కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ప్రకారం, దొంగిలించబడిన నగదు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లించాలని రైల్వేని ఆదేశించిన వినియోగదారుల ఫోరం జారీ చేసిన ఉత్తర్వులను జస్టీస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.

Advertisement

Madhyapradesh Shocker: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తి మీద మూత్రం పోసిన నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన అధికారులు..

kanha

మధ్యప్రదేశ్‌లో ట్రైబల్ వ్యక్తి మీద మూత్రం పోసిన వ్యక్తి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన అధికారులు.

IBPS Clerk 2023: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఐబీపీఎస్‌, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2023 సంవత్సరానికి గానూ 4545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

EPFO Jobs: ఈపీఎఫ్ఓలో లక్ష రూపాయలకు పైగా జీతంతో ఉద్యోగాలు, 86 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన EPFO, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్తను అందించింది. 80 మంది జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

IMD Weather Alert: భారీ వర్షాలతో అలర్ట్, పాఠశాలలు మూసివేత, కేరళలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Hazarath Reddy

కేరళ (Kerala ) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

Advertisement

Madhya Pradesh Shocker: వైరల్ వీడియో...నడిరోడ్డుపై గిరిజన యువకుడి మొహంపై మూత్రం పోసిన మధ్య ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు...

kanha

ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడి పేరు ప్రవేశ్ శుక్లా. ఇతపే బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ఎమ్మెల్యే సన్నిహితుడు.

Telangana Weather Update: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు

Rudra

జమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.

LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ

Rudra

మరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.

AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

TS Weather Forecast: తెలంగాణకు గుడ్ న్యూస్, ఈ నెలంతా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో ఈ నెలంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పరిగణిస్తారు.

Advertisement
Advertisement