Information
Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించనున్న భానుడు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
TS SSC Result 2023: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల మరో మూడు గంటల్లో, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
Cyclone Mocha Latest Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఈ సాయంత్రానికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలోని అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది,
Cyclone Mocha Update: మోచా తుపానుగా మారుతున్న తీవ్ర అల్పపీడనం, భారత్‌కు తప్పిన సైక్లోన్ గండం, వణుకుతున్న బంగ్లాదేశ్-మయన్మార్ తీరాలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది.
AP EAPCET 2023 Hall Tickets Out: ఏపీ ఈఏపీసెట్ హాల్‌ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..
Hazarath Reddyఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి.
TS SSC Results 2023: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపు విడుదల, పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలు విడుదల చేస్తోన్న విద్యాశాఖ, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Hazarath Reddyతెలంగాణ టెన్త్ ఫలితాలు మే 10న విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది.
TS EAMCET 2023 Exam Date: రేపటి నుంచే టీఎస్‌ ఎంసెట్‌, విద్యార్థులకు బయోమెట్రికల్ తప్పనిసరి, ఈ సూచనలు తప్పక పాటించాలని తెలిపిన అధికారులు
Hazarath Reddyటీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు.
TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదిగో, జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ త్వరలో
Hazarath Reddyజూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.
TS Inter Results 2023: జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, చివరి స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు.
TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు
TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
Rudraమహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
Rudraలక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.
Cyclone Mocha: మోచా తుఫాను ప్రభావం భారత్ మీద ఉండదు, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyదక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చివరికి తుఫానుగా అభివృద్ధి చెందుతుందని మే 8, 2023న భారత వాతావరణ శాఖ (IMD) ధృవీకరించింది.
TS Inter Results 2023: రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌, విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Hazarath Reddyతెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌కు ఇంట‌ర్ బోర్డు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మంళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.
Indian Railway Waitlist Data: 2022-23లో టికెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా 2.7 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేయలేకపోయారు, ఆర్టీఐ ద్వారా వెల్లడి
Hazarath Reddy2022-23లో 2.7 కోట్ల మంది ప్రయాణికులు టిక్కెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా ప్రయాణించలేకపోయారని ఆర్టీఐ వెల్లడించింది.
Cyclone Mocha: నేడు అల్ప పీడనం, బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు.
Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??
Rudraనిరుడు సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.
TS SSC, Inter Results: వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు.. ఏయే తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదంటే??
Rudraవచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది.
Rains In Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ అవకాశం.. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
Rudraతెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
FM Radio In Smart Phone: స్మార్ట్ ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో ఉండాల్సిందే.. సమాచార వ్యాప్తిలో డిజిటల్ అంతరం తగ్గించేందుకు ఎఫ్‌ఎం అవసరమన్న కేంద్రం.. మొబైల్ ఫోన్ల తయారీదారులకు ఆదేశాలు
Rudraస్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సదుపాయం తప్పనిసరిగా ఉండాలంటూ ఫోన్ తయారీదారులకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమైన సమాచారం, వినోదం ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది అవసరమని వ్యాఖ్యానించింది.