News

Viral Video: అదృష్టం అంటే ఇదే...ఎనమిది పల్టీలు కొట్టిన కారు...ప్రయాణికులు సేఫ్...వీడియో

Arun Charagonda

రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు కారు అదుపు తప్పి ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది.

Viral Video: రీల్స్ కోసం ఆటో టాప్ పై కుక్క..ఆపై ఏం చేశాడో తెలుసా?, ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు..వీడియో వైరల్

Arun Charagonda

ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆటో టాప్‌పై కుక్కని నిల్చొపెట్టి వాహనాన్ని నడిపాడు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Roja: జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం ఆపం, జగన్‌ కట్‌ అవుట్ చూస్తేనే కూటమి ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డ మాజీ మంత్రి రోజా

Arun Charagonda

జగన్ ను మళ్లీ సీఎం ను చేసే వరకు ఈ పోరాటం ఆపను అని తేల్చిచెప్పారు మాజీ మంత్రి రోజా. అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు..కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందన్నారు. పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు,బెల్ట్ షాపులు పెడుతున్నారుఅని మండిపడ్డారు రోజా. జగన్ కట్ అవుట్ కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు

CM Revanth Reddy On Pushpa 2 Stampede: ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Arun Charagonda

తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 విషాదంపై మాట్లాడిన సీఎం రేవంత్...అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?...దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులను ప్రశ్నించారు.

Advertisement

Astrology: డిసెంబర్ 30వ తేదీన కేతు గ్రహం సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.

sajaya

9 గ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేతు గ్రహాన్ని చాలామంది అంతా శుభగ్రహంగా పరిగణించరు. అయితే కొన్నిసార్లు కేతు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

Astrology: డిసెంబర్ 28 రాహు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు చాలా కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే రాహువుని దుష్ట గ్రహంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు అన్నిటిని కూడా ఇస్తారని నమ్ముతారు.

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Arun Charagonda

సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

Happy New Year 2025: కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ సమీపంలో చూడగలిగిన టాప్ 5 పర్యాటక కేంద్రాలు ఇవే

sajaya

వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

Advertisement

Telangana: మీడియా ఎస్‌ఐ చిందులు, ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్‌ఐ గీత...ఎస్‌ఐపై జర్నలిస్టుల ఫైర్

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్య పై బాధితులు మాట్లాడుతుండగా పలు ఛానల్ మైక్ లు తీసివేశారు ఎస్సై. ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Fashion Tips For Women: ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫంక్షన్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారో తెలుసుకుందాం.

sajaya

ఫంక్షన్ అయినా పండగ అయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం అలంకరించుకునే విషయంలో నగలది ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పవచ్చు.

Health Tips: చలికాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగారంటే జలుబు దగ్గు నుండి దూరం..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది.

Health Tips: ఈ సీజన్లో వచ్చే అంజీర్ పండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి..

sajaya

చలికాలంలో మన శరీరానికి విటమిన్లు మినరల్స్ పోషకాలు అవసరం ముఖ్యంగా ఇవి డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి. అంటారు అయితే ఈ సీజన్లో పచ్చిగా వచ్చే అంజీర్ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మెరుగైనవి.

Advertisement

Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్‌ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..

sajaya

పచ్చి బఠానీలు ఒక మంచి పోషకాహారమని చెప్పవచ్చు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇది ఈజీగా దొరుకుతుంది. అనేక రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

రష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

YS Jagan Birthday Celebrations: జగన్‌ బర్త్ డే వేడుకల్లో అల్లు అర్జున్ ఫోటో, ఎన్టీఆర్ జిల్లాలో జగన్‌తో పాటు బన్నీ ఫోటోను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మాజీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీ లో అల్లు అర్జున్ ఫోటో పెట్టి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫ్లెక్సీపై రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ కొటేషన్ వేయగా ఇది వైరల్‌గా మారింది.

Advertisement

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.

TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల తేదీల్లో మార్పులు చేసిన టీటీడీ, మార్చి నెల టికెట్ల తేదీల మార్పు, అదే రోజు గదుల కోటా రిలీజ్

Arun Charagonda

మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది టీటీడీ. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల చేయనుంది.

Telangana: దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ని ఢీ కొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, చనిపోయిన వారిలో ఒక మహిళ...వీడియో

Arun Charagonda

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని ఢీ కోట్టింది డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.. దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

PM Modi In Kuwait: 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, రెండు రోజుల పాటు పర్యటించున్న ప్రధాని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టూర్

Arun Charagonda

రెండు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని వెళ్లారు. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో పర్యటించనున్నారు మోదీ.

Advertisement
Advertisement