News
CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
Arun Charagondaరాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (#SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
Telangana: రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి
Uttarakhand: వైరల్ వీడియో...రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న యువతులు, ఉత్తరాఖండ్‌లో ఘటన, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీడియో
Arun Charagondaఉత్తరాఖండ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఇద్దరు యువతులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. యువతుల ఫైట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియాల్సి ఉంది.
Viral Video: వయనాడ్ విధ్వంసం...కోతి తన పిల్లను ఎలా కాపాడుకుందో చూడండి...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకేరళలోని వయనాడ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వయనాడ్ విధ్వంసంతో కేరళ అతలాకుతలం అయింది. వయనాడ్ విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tulsi Gowda Passes Away: పద్మ శ్రీ తులసి గౌడ కన్నుమూత, లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీగా గుర్తింపు, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన తులసిగౌడ
Arun Charagondaలక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటింది.
Hyderabad: బాచుపల్లిలో 6 అడుగుల పాము, ఓ ఇంట్లోకి ప్రవేశించగా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు..ఎలా పట్టుకున్నాడో చూడండి
Arun Charagondaహైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ భారీ పాము కలకలం రేపింది. బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలో 6 అడుగుల ఓరియంటల్ ర్యాట్ స్నేక్ ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో భయాందోళన చెందిన కాలనీవాసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ భారీ సర్పాన్ని బంధించి సురక్షిత ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్
Hazarath Reddyకీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి
Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు
Hazarath Reddyగుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం డిసెంబర్ 17న జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.
Reel Gone Wrong: వీడియో ఇదిగో, పవిత్రమైన హరిద్వార్‌లో అశ్లీల కంటెంట్‌తో రీల్ వీడియో, 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహరిద్వార్ గంగా, రూర్కీ గంగానహర్ వంతెనలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, అశ్లీలమైన కంటెంట్‌ను సృష్టించిన వీడియో వైరల్ కావడంతో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన ఈ గ్రూప్, సోషల్ మీడియాలో 528K ఫాలోవర్లను సంపాదించిన అనుచితమైన కంటెంట్, ప్రమాదకర చర్యలతో కూడిన రీల్స్‌ను తయారు చేసింది
One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు
Hazarath Reddyలోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్‌డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది
Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చార్‌బాగ్ రైల్వే స్టేషన్ నుండి ఐదేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. రైల్వే యార్డులో ఆగి ఉన్న రైలులో ఈ చిన్నారి మృతదేహం లభ్యమైంది,
Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్
Hazarath Reddyగత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
HYDRA Demolitions: హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం, కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ (హైడ్రా) రంగనాథ్ తెలిపారు. అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినదించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ వంతపాడిన మంత్రి పొన్నం ప్రభాకర్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వంత పాడారు.
Telangana: పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన యువకుడు మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో రూ. 3 లక్షలు బెట్టింగ్, మోసపోయానని తెలుసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనూక్(25) అనే యువకుడికి పబ్జి గేమ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.
Telangana: వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చేయబోయి లారీ, బస్సు మధ్యలో పడ్డ బైకర్, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు
Hazarath Reddyతెలంగాణలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ వద్ద ఓ బైకర్ అతి వేగంగా వెళ్లి లారీ, బస్సు మధ్యలో ఇరుక్కుపోయాడు. మజూద్ అనే యువకుడు బైక్ అతి వేగంగా నడుపుతూ లారీ బస్సు మధ్యలోకి దూసుకువెళ్లాడు, అయితే అదుపుతప్పి పడిపోయాడు.
Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్, రోడ్లపై వచ్చేందుకు వణికిపోతున్న మహిళలు
Hazarath Reddyగుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు.
Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు రంగం సిద్దం, థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు
Hazarath Reddyసంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.
Sandhya Theater Stampede Row: వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు
Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Hazarath Reddyసంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.