News
BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...రైతులకు యాసంగి పంట ముఖ్యమైందన్నారు.
Gas Cylinder Explosion: వీడియో ఇదిగో, గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం
Hazarath Reddyగ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్దం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Astrology: పొరపాటున కూడా ఇంట్లో ఈ ప్రదేశాలలో డబ్బు ఉంచవద్దు.
sajayaమీరు మీ ఇంట్లో డబ్బు ఉంచే స్థలం మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో డబ్బు ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని ,పేదరికం, అప్పులు ,అదనపు ఖర్చులు వంటి సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.
Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం
Hazarath Reddyటాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వివాదం ముదరడంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
Astrology: డిసెంబర్ 27న శనిగ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajaya2025 కొత్త సంవత్సరానికి ముందు, తీర్పు ,ఫలితాలను ఇచ్చే శని తన రాశిని మార్చబోతున్నాడు. ఆకాశంలోని 27 రాశులలో శని 25వ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
Astrology: డిసెంబర్ 15 ఆదివారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు, గౌరవం, ఆత్మ, ఉన్నత స్థానం , నాయకత్వ సామర్థ్యానికి బాధ్యత వహించే గ్రహం, కొన్ని రాశిచక్ర గుర్తులకు ఫలవంతమైనది.
Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .
Telangana: సారంగపూర్ కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత, ఆరుగురిని ఆస్పత్రికి తరలింపు...పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు
Arun Charagondaజగిత్యాల జిల్లా సారంగపూర్ KGBV పాఠశాలలో అస్వస్థత కు గురయ్యారు విద్యార్థులు. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర చలితో కాళ్లు చేతులు తిమ్మిర్లు వచ్చాయని తెలియగా ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు.
Andhra Pradesh Shocker: చిన్నారిని చిధిమేసిన మూఢనమ్మకం, 40 రోజులుగా ఉపవాసం ఉంటూ చర్చిలో ప్రార్థనలు..చివరకు చర్చిలోనే ప్రాణం విడిచిన చిన్నారి
Arun Charagondaమూఢనమ్మకం చిన్నారిని చిదిమేసింది. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మిల కూతురు భవ్యశ్రీ(8)కి బ్రెయిన్ ట్యూమర్.. వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు.సర్జరీ చేస్తే చిన్నారి బతకదని తల్లిదండ్రులు భయపడ్డారు. దానికి తోడు సర్జరీ చేసేంత డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేశారు. చివరికి చిన్నారి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.
Kakani vs Somireddy: నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా, మూడేండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్న సంజయ్..వీడియో
Arun Charagondaరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.
Syria War: సిరియా నుంచి 75 మంది భారతీయులు సురక్షితంగా బయటకు, లెబనాన్‌కు తరలించామని తెలిపిన భారత విదేశాంగ శాఖ
Hazarath Reddyసిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. తిరుగుబాటు దళాలు (Syria rebels) సిరియాను తమ నియంత్రణలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్ అసద్ (Bashar Al-Assad) ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Mushtaq Khan Kidnapped: ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా, సమీపంలోని మసీదులోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న నటుడు
Hazarath Reddyవెల్‌కమ్ చిత్రం ద్వారా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు ముష్తాక్ ఖాన్ కిడ్నాప్ కలకలం రేపింది. ఆయనను అగంతుకులు ఢిల్లీ-మీరట్ హైవే మీద కిడ్నాప్ చేసి రెండు లక్షల రూపాయలు దోచుకున్నారు.
Telangana: రైల్వే పట్టాలపై పులి సంచారం, వీడియో తీసిన రైల్వే అధికారులు...కొమురం భీం జిల్లాలో ఘటన, వీడియో ఇదిగో
Arun Charagondaకొమురం భీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వేంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రైల్వే సిబ్బందికి పులి కంట పడింది. పులి రైల్వే ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికలను ఒంటరిగానే తేల్చుకుంటాం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, ఇండియా కూటమితో కలిసేది లేదని స్పష్టం
Hazarath Reddyవచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరిదశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో కల్తీ పాలదందా...1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల పాల తయారీ...20 ఏళ్లుగా ఇదే దందా చేస్తున్న వ్యాపారి...వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా గుట్టు రట్టు అయింది. 1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ చేస్తున్నారు ఓ వ్యాపారీ. 20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్నారు వ్యాపారి అజయ్ అగర్వాల్. కెమికల్స్‌తో స్వయంగా పాలను అధికారులు తయారు చేయగా స్థానికులు మండిపడుతున్నారు.
Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి
Hazarath Reddyతండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు.
Siyaram Baba Dies: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సియారామ్ బాబా కన్నుమూత, 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన బాబాగా గుర్తింపు, అంత్యక్రియలకు హాజరుకానున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Hazarath Reddyనర్మదా పుత్రుడు అని పిలువబడే ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు సియారామ్ బాబా మధ్యప్రదేశ్‌లో డిసెంబర్ 11 బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సియారామ్ బాబా ఈరోజు ఉదయం 6:10 గంటలకు తుదిశ్వాస విడిచారు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాబా అని నమ్ముతారు,
Telangana: నల్గొండలో దారుణం, భూ వివాదం..గొడ్డలితో దాడి చేసుకున్న అన్నదమ్ముల పిల్లలు...వీడియో ఇదిగో
Arun Charagondaభూవివాదం నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసుకున్నారు సొంత అన్నదమ్ముల పిల్లలు. ఈ ఘటనలో నలుగురికి గాయాలుకాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఘటన చోటు చేసుకోగా గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తిప్పర్తి పోలీసులు.